న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సాకర్ సంరంభం: రష్యాకు పోటెత్తనున్న ఇండియన్లు

Surge in travel bookings by Indians looking to head to Russia for FIFA World Cup

న్యూఢిల్లీ: జూన్ నెల 14వ తేదీ నుంచి రష్యాలో సాకర్ కప్ సంరంభం ప్రారంభం కానున్నది. వివిధ దేశాలకు చెందిన సాకర్ అభిమానుల మాదిరిగా భారతీయ ఫుట్‌బాల్ అభిమానులు 'ఫిఫా వరల్డ్ కప్' టోర్నీని వీక్షించేందుకు పోటెత్తనున్నారు. వివిధ ట్రావెల్ సంస్థల వెబ్ సైట్లలో సాకర్ అభిమానులు తమ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. రష్యాలో తొలిసారి జరుగనున్న ఈ సాకర్ సంరంభం ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ కానున్నది.

క్లియర్ ట్రిప్, పేటీఎం ట్రావెల్, బిగ్ బ్రేక్స్ ప్రయాణ సంస్థల వెబ్ సైట్లలో టిక్కెట్ల బుకింగ్స్ 50 శాతం నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. ట్రావ్ కార్ట్ వెబ్‌సైట్ తమ వద్ద టిక్కెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. అంతే కాదు సాకర్ అభిమానులు పోటెత్తడంతో రష్యాలోని హోటళ్లు 100 శాతం ఆకుపెన్సీ రేటు నమోదు చేశాయని టూర్ ఆపరేటర్లు తెలిపారు.

టావ్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు మాన్‌హీర్ సింగ్‌సేథీ మాట్లాడుతూ 'జనవరి నుంచి రష్యాకు వెళ్లేందుకు ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. మార్చి నెలాఖరు కల్లా టిక్కెట్లన్నీ విక్రయించేశాం. ప్రతి ప్రీమియం హోటళ్లలో బుకింగ్‌లు పూర్తయ్యాయి' అని చెప్పారు. జూన్ 14వ తేదీ నుంచి జరిగే సాకర్ సంరంభంలో 32 దేశాల జట్లు రష్యాలోని 11 నగరాల పరిధిలోని 12 స్టేడియంలలో తలపడనున్నాయి.

భారత్ ఏనాడూ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఏనాడూ అర్హత సాధించలేదు. ఫుట్‌బాల్ ఆడుతున్న దేశాలకు తాజాగా లభించిన ర్యాంకుల్లో భారత్ 97వ స్థానం పొందింది. అత్యుత్తమ వేడుకగా సాగే సాకర్ సంరంభాన్ని వీక్షించేందుకు మాత్రం భారత అభిమానులు భారీగానే పోటెత్తుతున్నారు.

భారత్ నుంచి రష్యాకు 15 లక్షల మంది వీక్షణ

భారత్ నుంచి రష్యాకు 15 లక్షల మంది వీక్షణ

భారతదేశం నుంచి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మంది రష్యాకు వెళతారని అంచనా వేస్తున్నట్లు బిగ్ బ్రేక్స్ డాట్ కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ గోస్వామి తెలిపారు. వివిధ ప్రపంచ దేశాల నుంచి రష్యాకు వెళ్లే ఫుట్ బాల్ అభిమానుల్లో భారతీయలే 20 శాతానికి పైగా ఉంటారని కపిల్ గోస్వామి అంచనా వేశారు.

 రష్యాకు వెళ్లే విదేశీయుల్లో భారతీయులు 20 శాతం

రష్యాకు వెళ్లే విదేశీయుల్లో భారతీయులు 20 శాతం

రోజురోజుకు రష్యాకు వెళ్లే ప్రయాణికుల్లో 50 శాతానికి పైగా పెరిగారు. కొన్ని రోజులుగా భారతదేశం నుంచి రష్యాకు చేరుకుంటున్న వారిలో 20 శాతం భారతీయులు ఉంటున్నారు' అని కపిల్ గోస్వామి తెలిపారు. టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ పోర్టల్స్ యాజమాన్యాలు స్పందిస్తూ రష్యాకు వెళుతున్న భారతీయులు తాము బస చేస్తున్న ప్రాంతాల్లో సందర్శనీయ ప్రాంతాలు, తదితర అంశాలను గురించి తెలుసుకుని ముందుకు సాగుతున్నారు. బిగ్ బ్రేక్స్ సంస్థ మ్యాచ్‌లు జరిగే నగరాలకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు.

 నగరాల మధ్య టూర్లు డిజైన్ చేస్తున్న కాక్స్ అండ్ కింగ్స్

నగరాల మధ్య టూర్లు డిజైన్ చేస్తున్న కాక్స్ అండ్ కింగ్స్

సాకర్ కప్ సంరంభాన్ని వీక్షించేందుకు వస్తున్న విదేశీయులు, భారతీయులు ఆయా స్టేడియాల మధ్య నగరాలు, సందర్శన ప్రాంతాలకు ‘కాక్స్ అండ్ కింగ్స్' సంస్థ టూర్లు ప్లాన్ చేస్తోంది. ఢిల్లీతోపాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాకర్ అభిమానులు రష్యాకు బయలుదేరి వెళుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 15 శాతం పెరిగే అవకాశం ఉన్నదని కాక్స్ అండ్ కింగ్స్ రిలేషన్ షిప్స్ అధిపతి కరణ్ ఆనంద్ తెలిపారు. రష్యాకు వెళ్లే వారికి కేవలం 10 రోజుల్లోనే వీసా లభిస్తుందని చెప్పారు.

 రష్యాకు వెళ్లే వారి కోసం ఇలా ప్యాకేజీ

రష్యాకు వెళ్లే వారి కోసం ఇలా ప్యాకేజీ

యాత్ర ప్యాకేజీ ప్రకారం ఆరు రోజులకు రూ.69,990లకే వీసా, ప్రయాణ టిక్కెట్లు లభిస్తున్నాయి. గతంలో ఇది రూ.78,990 ఉండేది. ఇది మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ మధ్య ప్యాకేజీలు అందుబాటులోకి తెస్తుందని యాత్రా డాట్ కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరత్ ధాల్ తెలిపారు. గూమో అనే సంస్థ ఫ్లై దుబాయి నుంచి వెళ్లే అభిమానుల కోసం ‘ఫిఫా ఫీవర్' అనే ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. రష్యాలోని ఇతర నగరాలను సందర్శించడానికి క్లియర్ ట్రిప్, మేక్ మై ట్రిప్ తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Story first published: Saturday, May 19, 2018, 17:04 [IST]
Other articles published on May 19, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X