న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపికైన సునీల్ ఛెత్రి

By Nageshwara Rao
Sunil Chhetri Wins 2017 AIFF Player of the Year Award

హైదరాబాద్: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ప్రకటించిన 2017 వార్షిక అవార్డుల్లో భారత పుట్‌బాల్ కెప్టెన్ సునీల్‌ చెత్రి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డుకు ఎంపికయ్యాడు. బైచుంగ్ భూటియా తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో భారత ఫుట్‌బాలర్‌గా ఇటీవలే ఛెత్రి రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.

Sunil Chhetri Wins 2017 AIFF Player of the Year Award

ఇండియన్ సూపర్ లీగ్‌లో సునీల్ ఛెత్రి బెంగళూరు ఎఫ్‌సి జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అంతేకాదు బెంగలూరు ఎఫ్‌సి జట్టు కెప్టెన్‌గా, స్టార్ ఆటగాడిగా సాకర్ అభిమానుల మన్ననలు పొందుతున్నాడు. ఇక, మహిళల విభాగంలో మణిపూర్‌కు చెందిన కమలా దేవి 'ఉమన్‌ ఫుట్‌బాలర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును దక్కించుకుంది.

ఇటీవల జరిగిన ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌లో రాణించిన అనిరుధ్‌ థాపా 'ఎమర్జింగ్‌ ప్లేయర్‌' అవార్డుకు ఎంపికయ్యాడు. నాలుగు దేశాల మధ్య జరిగిన ఈ ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక, మహిళల్లో 'ఎమర్జింగ్‌ ప్లేయర్‌' అవార్డుకు పన్నతోయి ఎంపికైంది.

2017 సంవత్సరానికి గాను ఏఐఎఫ్‌ఎఫ్‌ అవార్డులను దక్కించుకున్న వారి జాబితా:

* 2017 AIFF Player of the Year: Sunil Chhetri
* 2017 AIFF Woman Footballer of the Year: Kamala Devi
* 2017 AIFF Emerging Player of the Year: Anirudh Thapa
* 2017 AIFF Emerging Woman Footballer of the Year: E Panthoi
* 2017 AIFF Award for Best Referee: C R Srikrishna
* 2017 AIFF Award for Best Assistant Referee: Sumanta Datta (Assam)
* 2017 AIFF Award for long-time contribution to Indian Football : Hero MotoCorp
* 2017 AIFF Award for Best Grassroots Development Programme : Kerala Football Association.

Story first published: Monday, July 23, 2018, 15:51 [IST]
Other articles published on Jul 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X