న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

జర్మనీ ఓటమి మెక్సికన్ల కళ్లలో ఆనందాన్ని నింపింది

By Nageshwara Rao
FIFA World Cup 2018: Mexico Vs Sweden Match Highlights
South Korea and Mexico fans celebrate after Germanys World Cup exit

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో స్వీడన్‌ చేతిలో 3-0 తేడాతో మెక్సికో చిత్తుగా ఓడింది. అయితే, ఈ పరాజయం నుంచి మెక్సికన్లు తేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే డిఫెండింగ్‌ ఛాంపియన్‌‌గా బరిలోకి దిగిన జర్మనీ.. దక్షిణకొరియా చేతిలో ఓడిపోవడం వారిలో ఆనందాన్ని నింపింది.

దీంతో మెక్సికో సిటీలోని దక్షిణ కొరియా ఎంబసీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం కనిపించింది. అంతేకాదు "బ్రదర్‌.. ఇప్పటి నుంచి మీరు కూడా మెక్సికన్లే" అంటూ దక్షిణ కొరియన్లను కౌగిలించుకుంటూ, భుజాలపై ఎత్తుకుంటూ మెక్సికన్లు సంబరాలు చేసుకున్నారు. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో గనుక జర్మనీ గెలిచి ఉంటే మెక్సికోకు నాకౌట్‌కు అవకాశం దక్కేది కాదు.

South Korea and Mexico fans celebrate after Germanys World Cup exit

దీంతో దక్షిణ కొరియా-జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ మెక్సికన్లలో ఒకరకమైన ఉత్సుకతను రేకెత్తించింది. చివరకు దక్షిణ కొరియా 2-0 తేడాతో జర్మనీని ఓడించడంతో దక్షిణ కొరియాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మెక్సికన్లు పండగ చేసుకున్నారు. దీంతో స్వీడన్‌, మెక్సికోలు నాకౌట్‌కు క్వాలిఫై కాగా, దక్షిణ కొరియా.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో జర్మనీని ఓడించి మెక్సికన్ల కళ్లలో ఆనందాన్ని నింపి మరీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన జర్మనీ

వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన జర్మనీ

మెక్సికో చేతిలో పరాభవంతో టోర్నీని ఆరంభించి స్వీడన్‌పై అతి కష్టం మీద గట్టెక్కిన జర్మనీ.. నాకౌట్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన చివరి మ్యాచ్‌లో 0-2తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల్లో కలిపి మూడు పాయింట్లే సాధించిన జర్మనీ అనూహ్య రీతిలో గ్రూప్ దశలోనే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.

సంబరాలు చేసుకున్న మెక్సికన్లు

సంబరాలు చేసుకున్న మెక్సికన్లు

"ఓ ఆసియా దేశం ఢిపెండింగ్‌ ఛాంపియన్‌ను చిత్తు చేయటం మాములు విషయం కాదు. పైగా మాకు అవకాశం దక్కుతుందా? అన్న టెన్షన్‌లో ఉన్నాం. ఇలాంటి తరుణంలో దక్షిణ కొరియా పోరాటం మాకు మధురానుభూతిని మిగిల్చింది. అందుకే ఈ సెలబ్రేషన్స్‌" అని మెక్సికన్లు అన్నారు.

కొరియా జట్టుపైనా మేం గెలవలేకపోయాం

కొరియా జట్టుపైనా మేం గెలవలేకపోయాం

జర్మనీ ఓటమిపై జోకిమ్ లూ మాట్లాడుతూ "‘నేను షాకయ్యాను. కొరియా జట్టుపైనా మేం గెలవలేకపోయాం. ఇలాంటి ఆటతో ఎలా ముందుకెళ్లగలం? దీనిపై మేం ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇంతకుమించి ఏమీ మాట్లాడలేను. మా నిష్క్రమణ నన్ను నిరాశకు గురి చేయలేదు" అని అన్నాడు.

1938 తర్వాత ఇదే తొలిసారి

1938 తర్వాత ఇదే తొలిసారి

ప్రపంచకప్‌లో ఒక ఆసియా జట్టు చేతిలో జర్మనీ ఓడటం ఇదే తొలిసారి. కాగా, 1938 తర్వాత జర్మనీ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో నిష్క్రమించడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియా జర్మనీని ప్రపంచకప్‌లో ఓడించడం కూడా ఇదే తొలిసారి. గతంలో ఆ జట్టుతో తలపడ్డ రెండుసార్లూ ఓడింది. ప్రస్తుత టోర్నీతో కలిపి గత ఐదు ప్రపంచకప్‌ల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడం ఇది నాలుగోసారి.

2010లో జరిగిన వరల్డ్ కప్‌లో ఇటలీ సరిగ్గా ఇలానే

2010లో జరిగిన వరల్డ్ కప్‌లో ఇటలీ సరిగ్గా ఇలానే

2006 ఛాంపియన్‌ ఇటలీ 2010లో జరిగిన వరల్డ్ కప్‌లో సరిగ్గా ఇలానే గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. 2010 విజేత స్పెయిన్‌ 2014లో కూడా ఇలానే నిష్క్రమించింది. రెండేసి విజయాలు సాధించిన స్వీడన్, మెక్సికో ఆరు పాయింట్లతో గ్రూప్-ఎఫ్ నుంచి నాకౌట్‌కు అర్హత సాధించాయి. అయితే మెరుగైన గోల్స్‌ సగటు ఆధారంగా స్వీడన్‌ గ్రూప్‌‌లో అగ్రస్థానంలో నిలిచింది. మెక్సికోకు రెండో స్థానం దక్కింది.

Story first published: Thursday, June 28, 2018, 17:51 [IST]
Other articles published on Jun 28, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X