న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఏం చేశాడంటే: చిన్నారి అభిమాని కోసం రొనాల్డో ఇలా? (వీడియో)

By Nageshwara Rao
Fifa World Cup 2018 : Cristiano Ronaldo Makes A Record
Ronaldo came back out, wiped the tears from his face, took photos and signed his shirt

హైదరాబాద్: పుట్‌బాల్‌లో పరిచయం అక్కర్లేని పేర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనాల్‌ మెస్సీ. ప్రస్తుతం ప్రపంచంలోనే ఈ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. అలాంటి స్టార్‌ ఆటగాళ్లతో ఒక్క ఫొటో అయినా దిగాలని అభిమానులంతా ఆశిస్తుంటారు.

 రొనాల్డో కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని

రొనాల్డో కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని

ప్రస్తుతం రష్యా వేదికగా 21వ ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా ఓ చిన్నారి తన అభిమాన ఆటగాడైన రొనాల్డోను చూసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. రొనాల్డో కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తన తల్లితో సహా వచ్చి అక్కడే ఉన్న భద్రతాసిబ్బందిని అడిగాడు.

వరల్డ్ కప్‌కు ఉగ్రవాదుల ముప్పు

వరల్డ్ కప్‌కు ఉగ్రవాదుల ముప్పు

రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌కు ఉగ్రవాదులు ఉప్పు పొంచి ఉండటంతో భద్రతా సిబ్బంది కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఆ చిన్నారి తట్టుకోలేక ఏడవటం మొదలుపెట్టాడు. సిబ్బంది కుదరదని ఎంత చెప్పిన ఆ పిల్లాడు మాత్రం ఏడుపు ఆపలేదు. ఈ తతంగం మొత్తాన్ని బస్సులో నుంచి గమనించిన రొనాల్డో నేరుగా అతని దగ్గరికి వచ్చేశాడు.

ఏడుస్తున్న చిన్నారిని హత్తుకున్న రొనాల్డో

ఏడుస్తున్న ఆ చిన్నారిని దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు. అతని టీ షర్ట్ మీద ఓ ఆటోగ్రాఫ్‌ కూడా ఇచ్చేశాడు. చివర్లో ఆ పిల్లాడిని ఓదార్చడానికి ఓ ముద్దు కూడా పెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, అప్పటి వరకూ ఏడుస్తూనే ఉన్న ఆ చిన్నారి రొనాల్డోను చూసేసరికి తెగ సంతోషపడ్డాడు.

మొరాకోతో తలపడనున్న పోర్చుగల్

మొరాకోతో తలపడనున్న పోర్చుగల్

ఇదిలా ఉంటే ఈ వరల్డ్ కప్‌లో భాగంగా పోర్చుగల్‌ తన తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో హ్యాట్రిక్‌ గోల్స్ నమోదు చేయండంతో స్పెయిన్ 3-3తో డ్రాగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోర్నీలో భాగంగా పోర్చుగల్‌ బుధవారం మొరాకోతో తలపడనుంది.

Story first published: Monday, June 18, 2018, 12:07 [IST]
Other articles published on Jun 18, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X