రొనాల్డో అంటేనే రికార్డుల మోత: 10 మ్యాచ్‌ల్లో 16 గోల్స్.. ఇది ఆల్‌టైం రికార్డు

Posted By:
 Ronaldo Breaks UCL All-Time Record

హైదరాబాద్: రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో యూరోపియన్ యూనియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (యుఈఎఫ్ఎ) చాంపియన్స్ లీగ్‌లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పి తానేమిటో మరోసారి చాటి చెప్పాడు. మూడు రోజుల క్రితం జువెంటస్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ సాధించాడు రొనాల్డో.

యూసీఎల్ 10వ మ్యాచ్‌లో వరుసగా ఆయన గోల్ సాధించడం ఇదే మొదటిసారి. తన రికార్డులను తానే తిరగరాయడంలో రొనాల్డోకు సాటి లేదని మరోసారి నిరూపించాడు.

రూడ్‌వాన్ నిస్టర్‌రాయ్ రికార్డును:

రూడ్‌వాన్ నిస్టర్‌రాయ్ రికార్డును:

ఇప్పటికే రూడ్ వాన్ నిస్టర్ రాయ్ చేసిన రికార్డును బద్దలు కొట్టాడు రొనాల్డో. వరుసగా రూడ్ వాన్ నిస్టర్ రాయ్ 2003లో జరిగిన యూసీఎల్ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన రికార్డు ఇప్పటివరకు అలాగే ఉన్నది. 2003లో మాంఛెస్టర్ సిటీ తరఫున ఆడిన డచ్ క్రీడాకారుడు రూడ్ వాన్ నిస్టర్ రాయ్ తొమ్మిది వరుస యూసీఎల్ మ్యాచ్ ల్లో 12 గోల్స్ సాధించడం విశేషం.

 యూసీఎల్ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో:

యూసీఎల్ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో:

ఇదిలా ఉంటే క్రిస్టియానో రోనాల్డో యూసీఎల్ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లోనూ గోల్స్ సాధించడమే కాదు. మొతం 10 మ్యాచ్ ల్లో 16 గోల్స్ సాధించడమే రికార్డు కానున్నది. గతేడాది జరిగిన చాంపియన్స్ లీగ్ ఫైనల్స్ మ్యాచ్ కూడా జువెంటస్‌తోనే క్రిస్టియానో రొనాల్డో తాజా రికార్డు ప్రారంభం కావడం మరో ఆసక్తికర పరిణామం.

వాన్ నిస్టర్ రాయ్ రికార్డును:

వాన్ నిస్టర్ రాయ్ రికార్డును:

అపోయెల్, బోరుస్సియా డార్ట్ మండ్ జట్లకు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌ల్లో రెండేసి గోల్స్ సాధించాడు క్రిస్టియానో రొనాల్డో. ఆ పై లాస్ బాల్కానోస్‌తో రౌండ్ 16 టై గ్రూపులో జరిగిన మ్యాచ్లో మరో జంట గోల్స్ సాధించి.. తదుపరి పారిస్ సెయింట్ జెర్మైన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2003 నాటి మాంఛెస్టర్ సిటీ ప్లేయర్ వాన్ నిస్టర్ రాయ్ రికార్డును క్రిస్టియానో రొనాల్డో సమం చేశాడు.

రొనాల్డో కంటే వెనుకబడిన లియానెల్ మెస్సీ:

రొనాల్డో కంటే వెనుకబడిన లియానెల్ మెస్సీ:

స్థూలంగా రొనాల్డో యూసీఎల్ టోర్నీలో 119 గోల్స్ సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఆయన ప్రత్యర్థి ప్లేయర్ బార్సిలోనా ఆటగాడు లియానెల్ మెస్సీ 20 గోల్స్ వెనుకబడి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Friday, April 6, 2018, 14:05 [IST]
Other articles published on Apr 6, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి