
లియోనెల్ మెస్సీ
అర్జెంటీనా సంచలనం లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో బుల్లెట్‌లా దూసుకెళ్తూ కళ్లు చెదిరే షాట్లతో గోల్స్ సాధించే ఈ స్టార్ ఫార్వర్డ్ ఆటగాడికి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. మరడోనా వారసుడిగా పేరు పొందిన మెస్సీ.. గత ప్రపంచ కప్‌లో పెద్దగా రాణించకపోయినప్పటికీ అతనిపై భారీ అంచనాలున్నాయి. ఈసారి విజృంభిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అర్జెంటీనా తరపున 83 మ్యాచులు ఆడి 37 గోల్స్ కొట్టిన మెస్సీ మెరిస్తే.. ఈసారి ఆ జట్టుకు తిరుగుండకపోవచ్చు.

క్రిస్టియానో రోనాల్డో
ప్రపంచ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అందరికంటే ఎక్కువగా ఆర్జిస్తున్న పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో
మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో.. తన దూకుడుకు, నైపుణ్యాన్ని జోడించి గత ప్రపంచ కప్ లో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

నేమర్
ప్రపంచకప్‌లో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న మరో ఆటగాడు నేమర్. 22ఏళ్ల నేమర్‌కు అద్భుతమైన డ్రిబ్లింగ్, మైదానంలో మెరుపు వేగం, కళ్లు చెదిరే గోల్స్ చేసే సత్తా ఉన్నాయి. కాన్పడరేషన్స్ కప్‌లో బ్రెజిల్‌ను గెలిపించి ‘గోల్డెన్ బూట్' అందుకున్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో నేమర్ చెలరేగిపోతాడని బ్రెజిల్ భావిస్తోంది.

వియాన్ రూనె
పొజిషన్: ఫార్వర్డ్
28ఏళ్ల రూనె ఇంగ్లండ్ తరపున 91 మ్యాచులు ఆడి 39 అంతర్జాతీయ గోల్స్ చేశాడు. 2006, 2010 ప్రపంచ కప్‌ల అనుభవం ఉంది.

ఆండ్రెస్ ఇనెస్ట
పొజిషన్: మిడ్‌ఫీల్డర్
30ఏళ్ల ఈ ఆటగాడు స్పెయిన్ తరపున 97 మ్యాచులు ఆడి, 11 అంతర్జాతీయ గోల్స్ చేశాడు. ఇతనికి 2006, 2010 ప్రపంచ కప్‌ల అనుభవం ఉంది.

అర్జెన్ రాబెన్(కుడివైపు, ఎరుపు డ్రెస్)
నెదర్లాండ్స్ ఆటగాడు అర్జెన్ రాబెన్. పొజిషన్: మిడ్‌ఫీల్డర్
30ఏళ్ల ఈ ఆటగాడు 75 మ్యాచులు ఆడి, 23 అంతర్జాతీయ గోల్స్ చేశాడు. 2006, 2010 ప్రపంచ కప్‌ల అనుభవం ఉంది.

ఆండ్రియా పిర్లో(ఇటలీ)
పొజిషన్: మిడ్‌ఫీల్డర్
35ఏళ్ల ఈ ఆటగాడు ఇటలీ తరపున 108 మ్యాచులు ఆడి, 13 గోల్స్ చేశాడు. ఇతనికి 2006, 2010 ప్రపంచ కప్‌ల అనుభవం ఉంది.

లూయిజ్ సురజ్(రెడ్ డ్రెస్)
పొజిషన్: ఫార్వర్డ్
27ఏళ్ల ఈ ఆటగాడు ఉరుగ్వే తరపున 80 మ్యాచులు ఆడి, 41 గోల్స్ చేశాడు. ఇతనికి 2010 ప్రపంచ కప్ అనుభవం ఉంది.

మారియో గోట్జ్ (జర్మనీ)
పొజిషన్: మిడ్‌ఫీల్డర్
22ఏళ్ల ఈ ఆటగాడు జర్మనీ తరపున 29 మ్యాచులు ఆడి, 9 అంతర్జాతీయ గోల్స్ చేశాడు. బ్రెజిల్‌లో జరగబోయే ప్రపంచకప్ ఇతనికి మొదటిది.

యాయ టూరె (మైదానం కందపడి ఉన్న ఆటగాడు)
పొజిషన్: మిడ్‌ఫీల్డర్
31ఏళ్ల ఈ ఆటగాడు ఐవరీ కోస్ట్ తరపున 82 మ్యాచులు ఆడి, 16 అంతర్జాతీయ గోల్స్ చేశాడు. ఇతనికి 2006, 2010 ప్రపంచ కప్‌ల అనుభవం ఉంది.