న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వైద్య పరీక్షల అనంతరం.. తిరుగుజట్టులోకి రావాలనే ఎదురుచూపుల్లో.. నేమర్

Neymar hopes to return to training after final examination on May 17

హైదరాబాద్: పారిస్ సెయింట్ జర్మైన్, బ్రెజల్ ఆటగాడైన నేమార్ వైద్య పరీక్షల అనంతరం జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. నేమార్ ఫిబ్రవరి నుంచి అతని కాలికి గాయం కారణంగా ఫుట్‌బాల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మార్సిల్లే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతను ప్రమాదానికి గురై సర్జరీ చేయించుకున్న విషయం విదితమే.
రాబోయే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకున్న పీఎస్‌జీ జట్టు అతన్ని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించింది. కానీ, మళ్లీ జట్టులోకి వస్తాడా అనే సందేహంలోనే ఆ జట్టు కొనసాగిస్తూనే ఉంది. కేవలం పీఎస్‌జీ కోచ్ ఉనయ్ ఎమెరీ ఒక్కడే తిరిగి వస్తాడనే నమ్మకంతో ఉన్నాడు.

అనుకున్నట్లు గానే, అతను కాలి గాయం నుంచి మే 17 తేదీకి సిద్ధమయ్యేలా ఉన్నాడని వైద్యులు తెలిపారు. సరిగ్గా లీగ్ 1 ఛాంపియన్స్ ఫైనల్ గేమ్‌కు 2 రోజుల ముందుకల్లా తెరమీదకు రానున్నాడు. ఈ విషయంపై నేమార్ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఖచ్చితంగా చెప్పగలను. చికిత్స తీసుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సర్జరీ అనంతరం కోలుకున్న నాకు ఆఖరి పరీక్ష మే 17వ తేదీ ఉంటుంది. ఆ రోజు సక్సెస్ అయితే ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాను. నాకు ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు తగిన సమయముంది.. ఖచ్చితంగా అప్పటికల్లా కోలుకుని తిరిగి జట్టు జెర్సీ ధరించి మైదానంలో అడుగుపెడతాను.' అంటూ అభిప్రాయపడ్డాడు.

ఇంకా మాట్లాడుతూ,.. ఇది నాకు మొదటి సర్జరీ అయినప్పటకీ నేను ఎప్పటిలాగే కొనసాగగలను. ఈ గాయం కారణంతో నాలో ఎటువంటి మార్పు రాలేదు. రోజూ ప్రాక్జీస్ చేస్తున్నాను. కలను నెరవేర్చుకోవడానికి ఒకవేళ నా నుంచి ఇంకా ఎక్కువ సమయం పడుతుందంటే దానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఈ సమయం కోసం నేను నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. అలాంటి అవకాశం ముందుంటే ఎంతటికైనా తెగిస్తాను. ఎంత కష్టమైనా పడతాను' అని వివరించాడు.

తిరిగి నేమార్ కోలుకుని పారిస్ సెయింట్ జర్మైన్ తరపున జట్టులో ఆడతాడని కోచ్ ఉనయ్ ఎమెరీ, నేమార్ ఆశ నెరవేరాలంటే మే 17వ తేదీ తుది వైద్య పరీక్షల వరకు ఆగాల్సిందే.

Story first published: Wednesday, April 18, 2018, 17:49 [IST]
Other articles published on Apr 18, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X