న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

2014 అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాం: బ్రెజిల్ కెప్టెన్

Neymar Exclusive: Brazil have come a long way since that Germany game

హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం 2014 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిల్.. సెమీ ఫైనల్స్‌లో అవమానకర రీతిలో జర్మనీ చేతిలో 1 - 7 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు ఆ టోర్నీ కోసం యావత్ బ్రెజిల్ ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు బ్రెజిల్ సాకర్ అభిమానులకు సంతోషకరమైన జ్ఞాపకాలు లేవు గానీ, కొలంబియా జట్టుపై జరిగిన జువాన్ జునిగతో తలపడి మోకాలి గాయంతో బాధ పడుతూ నేయ్మార్ ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. రిఫరీ దాన్ని నాడు ఫౌల్‌గా పరిగణించకపోవడంతో సొంత దేశంలో జరిగిన టోర్నీలో కప్ అందుకోలేకపోయింది బ్రెజిల్.

కలవరపెడుతున్న నేయ్మార్ గాయం

కలవరపెడుతున్న నేయ్మార్ గాయం

నాలుగేళ్ల క్రితం జరిగిన గాయాలు బ్రెజిలియన్లు మరిచిపోయారు. కానీ ఈ సారైనా సాకర్ కప్ టైటిల్‌ను గెలుచుకోవాలని ఆశపడుతోన్న నాలుగు జట్లలో బ్రెజిల్ ఒకటి ఉంది. కానీ మళ్లీ గాయంతో నేయ్మార్ బాధపడుతుండటం బ్రెజిల్ పౌరులను ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా బ్రెజిల్ జట్టు కెప్టెన్ నేయ్మార్ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జర్మనీ డిపెండింగ్ చాంపియన్‌గా ఉన్నప్పుడు టోర్నమెంట్ టైటిల్ గెలుచుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందన్నాడు. దక్షిణ అమెరికా జట్టుపై అర్హత సాధించిన తొలి జట్టు తమదేనన్నారు.

18 జట్లపై విభిన్న పరిస్థితుల్లో ఆడాలి

18 జట్లపై విభిన్న పరిస్థితుల్లో ఆడాలి

ఒక టీం అర్హత సాధించాలంటే కనీసం 18కి తగ్గకుండా వివిధ దేశాల జట్లతో భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని నేయ్మార్ తెలిపారు. ఇది ఫుట్ బాలర్స్‌కి పెద్ద సవాల్ అని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే అర్హత సాధించిన తాము రష్యాలోనూ మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పాడు. తన కాలికి అయిన గాయాన్ని తగ్గించుకునేందుకు ప్రపంచ కప్ టోర్నీని పరిగణనలోకి తీసుకుని శస్త్ర చికిత్స చేయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం చాలా పర్‌ఫెక్ట్‌గా ఉన్నానని తెలిపారు. తమ ప్రయాణానికి చాలా దూరం వెళ్లాలని, అర్థం చేసుకోవడం చాలా కష్టమేనన్నారు. తన కాలికైన గాయం కెరీర్ ముగిసిపోయేలా చేస్తుందని భావించానని తెలిపాను. అయితే ఈ దఫా సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

32 జట్లతో తలపడటం తేలిక కాదన్న నేయ్మార్

32 జట్లతో తలపడటం తేలిక కాదన్న నేయ్మార్

ఈ టోర్నీలో 32 జట్లు పాల్గొననున్నాయి. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు గెలుపొందడం అంత తేలికం కాదని నేయ్మార్ తెలిపాడు. గ్రూప్ ఈలో స్విట్జర్లాండ్, కొస్టారికా, సెర్బియా జట్లతో బ్రెజిల్ తలపడనుంది. స్విట్జర్లాండ్ జట్టుకు సాకర్‌లో గొప్ప చరిత్ర ఉందని తెలిపాడు. కొత్తగా ఆవిర్భవించిన సెర్బియా జట్టుతోపాటు కొస్టారికా జట్టు ఎంత గట్టిగా ఆడతాయో తెలుసుకోవాల్సి ఉంటుందన్నాడు. ఏది ఏమైనా గ్రూప్ ఈ చాలా కఠినమైందన్నాడు. నాకౌట్ దశకు చేరుకునేందుకు చాలా నాణ్యత, మెరుగైన ఆట తీరు ప్రదర్శించాల్సిన అవసరముందన్నారు.

రొనాల్డో, మెస్సీలు గొప్ప ఆటగాళ్లు

రొనాల్డో, మెస్సీలు గొప్ప ఆటగాళ్లు

స్పెయిన్‌లో క్రిస్టియానో రొనాల్డో, లియానెల్ మెస్సీ గొప్ప ఆటగాళ్లు అని నేయ్మార్ తెలిపాడు. మెస్సీ వంటి గొప్ప ఆటగాడితో ఆడటం తనకు గౌరవం అని చెప్పాడు. మెస్సీని నిజంగా ఇష్టపడతానన్నాడు. మెస్సీ భిన్నమైన ఆటగాడని అన్నాడు. క్రిస్టియానో రొనాల్డోను తీసి పారేయలేమని, ఆయన కూడా తప్పనిసరిగా ఉత్తమ ఆటగాడని చెప్పాడు. మెస్సీతోపాటు రొనాల్డో సాధించిన రికార్డులు సమానమైనవని, అద్భుతమని అభిప్రాయ పడ్డాడు.

అర్జెంటీనా, పోర్చుగల్ జట్లతో మ్యాచ్‌లు కఠిన పరీక్షే

అర్జెంటీనా, పోర్చుగల్ జట్లతో మ్యాచ్‌లు కఠిన పరీక్షే

అర్జెంటీనా, పోర్చుగల్ జట్లతో వరల్డ్ కప్ టోర్నీలో ఆడటం చాలా కఠిన పరీక్ష అని నేయ్మార్ పేర్కొన్నాడు. ఆ రెండు జట్లకు లియానెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మంచి ఫలితాలని అందిస్తారని అభివర్ణించాడు. అర్జెంటీనా, ఉరుగ్వేలతోపాటు బ్రెజిల్ కూడా టోర్నమెంట్‌లో ఫేవరెటేనని చెప్పాడు. యూరోపియన్ టీమ్‌ల్లో డిపెండింగ్ చాంపియన్ జర్మనీతోపాటు స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, పోర్చుగల్ తదితర జట్లను ఢీ కొట్టడం చాలా కష్ట సాధ్యం అని తెలిపాడు.

Story first published: Monday, June 4, 2018, 14:31 [IST]
Other articles published on Jun 4, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X