న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

'మైదానంలో అతి చేసిన మాట వాస్తవమే'

Neymar blames brattish behaviour on his inner child

హైదరాబాద్: రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2018లో ఎన్నో వినోదాలు, ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. అంతేకాదు కొన్ని సంఘటనలు హాస్యాన్ని కూడా తెప్పించాయి. ఇలాంటి వాటిల్లోదే నెయ్‌మార్ 'రోలింగ్ షో'. జూన్ 2 సోమవారం మెక్సికోతో బ్రెజిల్ ఆడిన మ్యాచ్‌లో నెయ్‌మార్ చేసిన విన్యాసాలకు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యాయి. ఫిఫా కప్‌లో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ స్టార్‌ ఆటగాడ్‌ నెయ్‌మార్‌ తనదైన 'రోలింగ్‌ కళ'కు కచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందేనంటూ ట్విటర్‌లో ఫుట్‌బాల్ అభిమానులు తీర్మానించేశారు.

వీటిని సమ్మతిస్తూ అప్పుడు తాను అతి చేసింది వాస్తవమేనంటూ చెప్పుకొచ్చాడు నెయ్‌మార్. కానీ, చూసే వాళ్లకు ప్రతీసారి అతి చేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ, దానిని కావాలని చేయనని తన కోపాన్ని అణచుకోవడానికి మాత్రమే చేస్తానని పేర్కొన్నాడు. ఇలా మైదానంలో తాను కాస్త అతి చేసిన మాట నిజమేనని నెయ్‌మార్‌ అంగీకరించాడు. అసహనం నుంచి బయటపడాలో ఇప్పటికీ నేర్చుకుంటున్నానని చెప్పాడు.

ఆడేటప్పుడు నాలో ఓ పిల్లాడు ఉంటాడు. వాడిని బాధించినప్పుడల్లా ఇలా ప్రవర్తిస్తుంటాడు. వాడు కేవలం నాలోనే ఉంటాడు. మైదానంలో ఉండేవాడు కాదు. అందరితో పాటు పిచ్‌పై బంతి కోసం పరుగెడుతున్న సమయంలో.. 'నా పిక్కలపై తంతారు. మోకాలితో నా వెనక గుద్దుతారు. నా పాదాన్ని తొక్కేస్తారు. కొన్నిసార్లు అతి చేస్తానని మీరు భావిస్తుండొచ్చు. నేను అతి చేసేది నిజమే. కానీ నేను మైదానంలో చాలా బాధపడుతుంటా' అని నెయ్‌మార్‌ అన్నాడు.

టోర్నీలో భాగంగా జూలై 2 సోమవారం రాత్రి మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది. తొలి అర్థబాగంలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నెయ్‌మార్ 51వ నిమిషంలో గోల్‌ సాధించి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. చివర్లో మెక్సికో కొంచెం దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. ఇక మరికొద్ది క్షణాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా మిడ్‌ఫీల్డర్‌ కౌటిన్హో స్థానంలో వచ్చిన ఫర్మినో 88వ నిమిషంలో గోల్‌ సాధించడంతో ఆ జట్టు విజయం ఖాయమైంది.

Story first published: Tuesday, July 31, 2018, 11:16 [IST]
Other articles published on Jul 31, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X