న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మనసులో మాట: భారత ఫుట్‌బాల్ బెంజిమన్ ‘సునీల్ చెత్రి’

My age and experience have helped me grow into a more all-round player: Sunil Chhetri

హైదరాబాద్: ఇండియన్ ఫుట్ బాల్ 'బెంజిమన్ బటన్' సునీల్ చెత్రి అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇండియన్ సూపర్ కప్ టోర్నీలో బెంగళూరు ఎఫ్‌సీ జట్టుకు సారథ్యం వహించడంతోపాటు జట్టుకు సెమీస్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించిన సునీల్ చెత్రి వయస్సుతోపాటు అనుభవం కూడా తోడవ్వడంతో ఫుట్‌బాల్ ఆటలో ఎదుగుతున్నానని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

సునీల్ ఛెత్రి ఒక ఫుట్ బాలర్ మాత్రమే కాదు. బాధ్యతాయుతమైన ఒక భర్త కూడా. మోహన్ బగన్ లెజెండ్ సుబ్రతా భట్టాచార్య కూతురు సోనంతో వివాహం కావడంతో జీవితమే మారిపోయింది. 14 ఏళ్లుగా తెలిసిన వ్యక్తినే తాను పెళ్లాడినట్లు సునీల్ ఛెత్రి తెలిపారు. తాము ఒక స్నేహితుల మాదిరిగా కలిసి ఉన్నామని పేర్కొన్నాడు.

ఫుట్‌బాల్‌లో ఒడిదొడుకులు ఉంటాయని చెప్పిన సునీల్ ఛెత్రి ఐ-లీగ్ టైటిల్ గెలుచుకోవడంతోపాటు ఐఎస్ఎల్ ఫైనల్స్‌లో ఓటమి పాలవ్వడం వంటి ఘటనలు చెరిగిపోని తీపి గుర్తులని అన్నాడు. ఫుట్‌బాల్ ఆటకు సంబంధించి తనకు తన భార్య సోనం నుంచి చాలా మద్దతు లభిస్తున్నదని తెలిపాడు. పెళ్లి తర్వాత తన జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదన్నాడు.

అదే ఉత్తమమైన నిర్ణయం

అదే ఉత్తమమైన నిర్ణయం

ఎక్కువకాలం తామిద్దరం కలిసే ఉంటామని ఛెత్రి చెప్పాడు. తాను బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడే ఉంటుందని, ఒకవేళ టోర్నీల కోసం విదేశాలకు వెళితే మాత్రం కోల్‌కతాకు వెళిపోతుందని చెప్పాడు. బెంగళూరు ఎఫ్‌సీతో కాంట్రాక్టుతో చేసుకోవడం ఉత్తమమైన నిర్ణయం అని తెలిపాడు. అయితే ఇతర క్లబ్‌ల యాజమాన్యాలంటే గౌరవం కూడా ఉన్నదని తెలిపాడు. ఐదేళ్లుగా బెంగళూరు ఎఫ్‌సి క్లబ్‌లో పని చేయాలని నిర్ణయం తీసుకోవడం తన జీవితంలో మెరుగైందని పేర్కొన్నాడు. బెంగళూరు ఎఫ్‌సి యజమాని పార్థ్ జిందాల్ నుంచి జట్టు సభ్యుల్లో ఎల్లవేళలా సానుకూల వైఖరి ప్రదర్శించారని చెప్పారు. బెంగళూరు ఎఫ్‌సిలో సభ్యుడిగా చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు.

ఎంతోకాలం స్ట్రైకర్‌గా ఉండలేనని చెప్పిన ఛెత్రి

ఎంతోకాలం స్ట్రైకర్‌గా ఉండలేనని చెప్పిన ఛెత్రి

అంతేకాదు తాను ఎంతోకాలం స్ట్రైకర్‌గా ఉండలేనని సునీల్ ఛెత్రి చెప్పడం విశేషం. బెంగళూరు ఎఫ్‌సి జట్టు మొదటి కోచ్ ఆష్లే వెస్ట్‌వుడ్ తనను మిడ్ ఫీల్డర్ అటాకింగ్‌కు దిగాలని సూచించాడు. ప్రారంభంలో ఆష్లే వెస్ట్ వుడ్ విజన్ అర్థం చేసుకోలేదని, ఆ తర్వాత కానీ ఆయన విజన్ తాను ఎదుగుదలకు తోడ్పాటునిచ్చిందని సునీల్ ఛెత్రి పేర్కొన్నాడు. డిఫెన్స్‌లో వాస్తవికతను అర్థం చేసుకున్నానని ఛెత్రి చెప్పాడు. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మంచి డిఫెండర్‌గా ఎదిగానని తెలిపాడు. దీనికి కొత్త కోచ్ అల్బర్ట్ రోచ్ మరికొన్ని కొత్త అంశాలు చేర్చాడని చెప్పాడు. ప్రస్తుతం ఆటతీరుతో చాలా సంత్రుప్తిగా, విభిన్నమైన ఆటగాడిగా నిలిపాయని తెలిపారు.

ఎంతో శరవేగంగా ఎదుగుతూ వచ్చా

ఎంతో శరవేగంగా ఎదుగుతూ వచ్చా

ఈ పరిణామాలన్నీ తనను ఆల్ రౌండర్‌గా తీర్చిదిద్దాయని తెలిపాడు. ప్రస్తుతం తాను గేమ్ చాలా ఎంజాయ్ చేయడంతోపాటు జట్టులో భాగస్వామిని అవుతున్నానని సునీల్ ఛెత్రి చెప్పాడు. ఎంతో శరవేగంగా ఎదుగుతూ వచ్చానని, ఈ దశలో చాలా ముఖ్యమని తెలిపాడు. జట్టులో ఉదాంత సింగ్‌తో పోటీ పడుతున్నట్లు తన ఛాతి ఎగసిపడేదని తెలిపాడు. గోల్ కీపర్ గురు ప్రీత్ సంధూతో సరిసమానంగా పోటీ పడుతున్నట్లు చెప్పాడు. తనతోపాటు జట్టు సభ్యులంతా పరస్పరం విజయం సాధించడానికే సవాళ్లను ఎదుర్కోవడానికి తోడ్పాటునిస్తున్నారని గుర్తు చేసుకున్నాడు.

రిటైర్మెంట్ గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది

రిటైర్మెంట్ గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది

ఇప్పుడే రిటైర్మెంట్ గురించి మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుందని అన్నాడు. 2011లో భారత్‌కు సుస్థిరమైన జట్టు ఉందని ఛెత్రి చెప్పాడు. అన్వర్ అలీ, మంగీ (గౌరామంగీ సింగ్), సుబ్రతా పాల్‌తోపాటు భైచుంగ్ భూటియా, సమీర్ నాయక్, మహేశ్ గావ్లీ, రెన్నెడి సింగ్ తదితరులు జట్టు ఆటతీరులో విధి విధానాలను ఖరారు చేశారని తెలిపాడు. ప్రస్తుతం పాల్, జేజేలతోపాటు తమ జట్టు ట్రోఫీ గెలుచుకోవడం పట్ల ఆశగా ఎదురు చూస్తున్నామని, ప్రస్తుత టోర్నమెంట్ పైనే కేంద్రీకరించామన్నాడు.

అభిమానించే పుట్ బాల్ ప్లేయర్లు వీరే

అభిమానించే పుట్ బాల్ ప్లేయర్లు వీరే

భారతదేశంలో లియాండర్ పేస్, గియాంలౌగీ బఫన్, జావియర్ జనెట్టి వంటి వారు ఆదర్శంగా ఉన్నారని తెలిపాడు. తనకు నచ్చిన ప్లేయర్లలో రొనాల్డో, థైరీ హెన్రీ, హెర్నాన్ క్రెస్పో, సెర్జియ ఆగౌరో, జ్లాటన్ ఇబ్రహీంమువిక్ తదితరులు ఉన్నారని చెప్పాడు. భారతదేశానికి చెందిన ప్లేయర్లలో భాయిచుంగ్ భూటియా, ఐఎం వజయన్, అశిం విశ్వాస్, జేజే లాల్పెఖౌలా, రోబిన్ సింగ్ తన అభిమాన ప్లేయర్లుగా ఉన్నారని ఛెత్రి ఈ సందర్భంగా తెలిపాడు.

Story first published: Thursday, April 19, 2018, 12:01 [IST]
Other articles published on Apr 19, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X