బార్సిలోనా రికార్డు: 39 మ్యాచ్‌ల్లో అజేయం.. టాపర్స్‌లో మెస్సీ

Posted By:
Messi moves into the top five winners in LaLiga history

బార్సిలోనా: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్‌ దిగ్గజాల్లో ఒక్కటైన బార్సిలోనా క్లబ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. వరుస విజయాలతో లా లీగా టోర్నీలోనే నూతన రికార్డు నెలకొల్పింది. వరుసగా 39 మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలువడమే ఆ రికార్డు. అంతేకాదు బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ.. స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ 'లా లీగా' టోర్నీలోనే ఐదుగురు అగ్రశ్రేణి ప్లేయర్లలో ఒకరిగా నిలిచారు.

1979-80లో 38 మ్యాచ్‌ల్లో అజేయంగా బార్సిలోనా

1979-80లో 38 మ్యాచ్‌ల్లో అజేయంగా బార్సిలోనా

ఇక లా లీగా టోర్నీలో ఇంతకుముందు 1979-80లో బార్సిలోనా క్లబ్ వరుసగా 38 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాడు రియల్ సోషిడాడ్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో ఈ విజయాన్ని నమోదు చేసింది. కానీ తన రికార్డునే బార్సిలోనా శనివారం వాలెంసియాపై జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తిరగరాసింది.

వాలెంసియా జట్టుపై విజయంతో రికార్డుకు ఇలా చేరువ

వాలెంసియా జట్టుపై విజయంతో రికార్డుకు ఇలా చేరువ

వాలెంసియా జట్టుపై సాధించిన విజయంతో బార్సిలోనా ఈ రికార్డుకు చేరువైంది. వాలెంసియా జట్టుపై లూయిస్ సూరెజ్, శ్యాముల్ ఉమితి చేసే గోల్స్‌తో బార్సిలోనా క్లబ్‌కు 312వ విజయం సొంతమైంది. లియానెల్ మెస్సీ 413, రియల్ మాడ్రిడ్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో 523 మ్యాచ్‌లు ఆడిన ఘనత సాధించారు.

మాజీ టీమ్మెట్ రికార్డును సరి సమానం చేసిన మెస్సీ

మాజీ టీమ్మెట్ రికార్డును సరి సమానం చేసిన మెస్సీ

కానీ జావీ హెర్నాండెజ్ 505 మ్యాచ్‌ల్లో 322 విజయాలు సాధించారు. అయినా లియానెల్ మెస్సీ తన మాజీ టీమ్మేట్‌ రికార్డును సరిసమానం చేశారు. 550 లా లీగా మ్యాచ్‌ల్లో రాల్ 327 విజయాలు సాధించారు. గోల్ కీపర్లలో ఇద్దరు టాప్ స్టానాల్లో నిలిచారు. ఆండోనీ జుబిజారెటరా 622 మ్యాచ్‌ల్లో 333 మ్యాచ్‌ల్లో తమ జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇక ఐకెర్ కాసిల్లాస్ కేవలం 510 మ్యాచ్‌ల్లోనే 334 మ్యాచ్‌ల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ట్రోఫీలు కావాలంటే మెస్సీ, రొనాల్డోలతో గ్రైజ్మన్ కలువాలి

ట్రోఫీలు కావాలంటే మెస్సీ, రొనాల్డోలతో గ్రైజ్మన్ కలువాలి

ఇక నుంచి రియల్ మాడ్రిడ్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో, బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీలు ట్రోఫీ గెలుచుకోవాలంటే అట్లెంటికో మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ ఆంటోనీ గ్రైజ్మన్ వంటి ఆటగాళ్ల మద్దతు అవసరం అని ఫెర్నాండో టొర్రెస్ వ్యాఖ్యానించాడు. ట్రోఫీలు గెలుచుకోవాలంటే గ్రైజ్మన్‌కూ వారి సహకారం అవసరమని చెప్పాడు.

గతేడాది మాదిరిగానే అట్లెంటికో మాడ్రిడ్‌లో గ్రైజ్మన్ కీలక పాత్ర

గతేడాది మాదిరిగానే అట్లెంటికో మాడ్రిడ్‌లో గ్రైజ్మన్ కీలక పాత్ర

గతేడాది మాదిరిగానే ఈ ఏడాదిలోనూ అట్లెంటికో మాడ్రిడ్ జట్టు తరఫున 26 గోల్స్ సాధించి జట్టును ముందుకు నడిపించాడు. గతేడాది కూడా ఇదే రికార్డు సాధించిన గ్రైజ్మన్ ఈ ఏడాది అదే జోరు సాగించాడు. గతేడాది అట్లెంటికో మాడ్రిడ్ జట్టు లా లీగా టైటిల్ గెలుచుకున్న తర్వాత టీంలోకి వచ్చి చేరాడు. ఫెర్నాండో టొర్రెస్ అంచనా ప్రకారం రొనాల్డో, మెస్సీలకు గ్రైజ్మన్ తోడుగా నిలిస్తే వారు మరిన్ని టైటిళ్లను తీసుకురాగలడని చెప్పాడు.

మెస్సీ, రొనాల్డోలకు సరి సమానమైన జోడీ గ్రైజ్మన్

మెస్సీ, రొనాల్డోలకు సరి సమానమైన జోడీ గ్రైజ్మన్

మెస్సీ, రొనాల్డోలకు సరి సమానమైన జోడీగా గ్రైజ్మన్‌ను అభివర్ణించిన టొర్రెస్.. ఆ రెండు జట్లలో ఏదో ఒకటి అట్లెంటికో మాడ్రిడ్ జట్టు నుంచి పొందగలవనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫెర్నాండో టొర్రెస్ ఇప్పటికే అట్లెంటికో మాడ్రిడ్ జట్టును వీడనున్నట్లు ప్రకటించేశాడు. కానీ అట్లెంటికో మాడ్రిడ్ జట్టు యాజమాన్యం మాత్రం గ్రైజ్మన్, గోల్ కీపర్ జాన్ ఓబ్లాక్, కోచ్ డియాగో సిమ్మోన్‌ను అలాగే అట్టిపెట్టుకోవాలని కోరుకుంటోంది.

టొర్రెస్‌తో వెళ్లాలని భావించిన గోల్ కీపర్ ఒబ్లాక్

టొర్రెస్‌తో వెళ్లాలని భావించిన గోల్ కీపర్ ఒబ్లాక్

అట్లెంటికో మాడ్రిడ్ గోల్ కీపర్ ఒబ్లాక్ కూడా ఫెర్నాండో టొర్రెస్‌తో ముందుకు వెళ్లాలని భావించాడు. షాట్ స్టాపర్ ఫెర్నాండో కూడా ఒబ్లాక్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఓబ్లాక్ వంటి గొప్ప గోల్ కీపర్‌ను తాను ఎక్కడా చూడలేదని పేర్కొన్నాడు. ఆయనతో కలిసి ఉండటానికి ఏమైనా చేస్తానని చెప్పాడు.

Story first published: Tuesday, April 17, 2018, 9:22 [IST]
Other articles published on Apr 17, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి