న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

13 ఏళ్ల నిరీక్షణకు తెర: యూట్యూబ్‌లోకి మాంచెస్టర్ యునైటెడ్

By Nageshwara Rao
Manchester United among 'most subscribed channels' in a day after ending 13-year wait for YouTube debut

హైదరాబాద్: మాంచెస్టర్ యునైటెడ్ పేరు తెలియని పుట్‌బాల్ అభిమాని ఉండడు. ప్రీమియర్ లీగ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మాంచెస్టర్ యునైటెడ్ ఫిబ్రవరి 22 (గురువారం) తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది.

ఇప్పటివరకు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇనిస్టాగ్రామ్‌లలో అలరించిన మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్‌లను ఇకపై అభిమానులు యూట్యూబ్‌లో వీక్షించొచ్చు. యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే మాంచెస్టర్ యునైటెడ్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.

Manchester United among 'most subscribed channels' in a day after ending 13-year wait for YouTube debut

యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన 24 గంటల్లో అత్యధిక మంది చందాదారులను సొంతం చేసుకున్న జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం ఉదయం 10 గంటలకు మాంచెస్టర్ యునైటెడ్ తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించగా ఫిబ్రవరి 23 (శుక్రవారం) నాటికి అంటే 24 గంటల్లో 93, 409 మంది సబ్‌స్క్రైబ్ అయ్యారు.

2005లో ప్రారంభమైన ఈ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్‌లోకి రావడానికి మాంచెస్టర్ యునైటెడ్‌కు 13 ఏళ్ల పట్టింది. యూట్యూబ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన మాంచెస్టర్ సిటీ ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. మాంచెస్టర్ సిటీ యూట్యూబ్ ఛానెల్‌కు 1,140, 268 మంది చందాదారులు ఉన్నారు.

ఫేస్‌బుక్ విషయానికి వస్తే మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకి 71.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక ట్విట్టర్‌లో 7.4 మిలియన్లు, ఇనిస్టాగ్రామ్‌లో 20.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుట్‌బాల్ దిగ్గజ జట్లు అయిన లాలిగా, రియల్ మాడ్రిడ్, బార్సిలోనాలు ఈ మూడు సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్‌లలో మాంచెస్టర్ యునైటెడ్‌తో పోలిస్తే వెనుకనే ఉన్నాయి.

Story first published: Friday, February 23, 2018, 13:47 [IST]
Other articles published on Feb 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X