న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

‘బీడి కట్ట’పై లియోనల్ మెస్సీ ఫొటో.. నెట్టింట పేలుతున్న కుళ్లు జోకులు!

Lionel Messi’s Photo on Beedi Packet Goes Viral

హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఫొటో 'బీడికట్ట'పై ఉండటం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫొటోను రుపిన్ శర్మ ఐపీఎల్ అనే ఓ నెటిజన్ 'భారత్‌లో మెస్సీ వాణిజ్య ఒప్పందం'ఇదే అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేయగా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ బీడీ కట్ట అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడని ఒకరంటే.. కోపా అమెరికా టైటిల్ గెలిచిన తర్వాత మెస్సీ చేసుకున్న తొలి వాణిజ్య ఒప్పందం ఇదేనంటూ మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్, ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఇక 28 ఏళ్ల నీరిక్షణ తెరదించుతూ ప్రతిష్టాత్మక ఫుట్ బాల్ టోర్నీ కోపా అమెరికా టైటిల్‌ను అర్జెంటీనా సొంతం చేసుకుంది. రియోలోని మారకానా స్టేడియం వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అర్జెంటినా 1-0 తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించింది. అర్జెంటీనా ఆటగాడు ఏజెల్‌ డీ మారియా గోల్‌ చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దాంతో కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా తొలిసారిగా అతిపెద్ద టోర్నీని గెలిచినట్లయింది.

అర్జెంటీనా చివరిసారిగా 1993లో కోపా అమెరికా కప్‌ను గెలుచుకున్నది. మొత్తంగా ఇప్పటివరకు ఆ జట్టు 15 సార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో కోపా అమెరికా టోర్నీలో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఉరుగ్వే టీమ్ సరసన నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకూ 15 సార్లు ఈ టోర్నీలో గెలుపొందింది. కాగా, కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌, అర్జెంటీనా తలపడడం ఇది మూడోసారి. 1937లో తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. అప్పుడు కూడా అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత రెండు సార్లు (2004, 2007) బ్రెజిల్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నది. ఇప్పటి వరకూ అర్జెంటీనా, బ్రెజిల్‌ 112 మ్యాచ్‌ల్లో తలపడగా.. బ్రెజిల్‌ 46 మ్యాచ్‌లు, అర్జెంటీనా 41 మ్యాచ్‌ల చొప్పున గెలుపొందాయి.

దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్‌లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్‌..అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి.ఫైనల్లో డీ మారియా చేసిన ఏకైక గోల్‌తో అర్జెంటీనా ట్రోఫీ గెలిచింది కానీ.. టోర్నీ మొత్తం ఆ టీమ్ తరఫున కెప్టెన్ మెస్సీయే అద్భుతంగా రాణించాడు. మొత్తం 4 గోల్స్ చేయడంతోపాటు 5 గోల్స్ కావడంలో సాయం చేసి టోర్నీ టాప్ స్కోరర్‌, బెస్ట్ ప్లేయర్ ట్రోఫీలు అందుకున్నాడు.

మెస్సీకిది అర్జెంటీనా తరఫున 151వ మ్యాచ్‌. ఆ టీమ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా మెస్సీదే. ఇన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత కోపా ఫైనల్లో రిఫరీ చివరి విజిల్ వేయగానే మెస్సీ గ్రౌండ్‌లోనే మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లు పెట్టాడు. తన కెరీర్‌లో అర్జెంటీనా తరఫున గెలిచిన తొలి మేజర్ టోర్నీ ఇదే. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అతను గాయంతోనే బరిలోకి దిగాడు.

Story first published: Wednesday, July 14, 2021, 15:51 [IST]
Other articles published on Jul 14, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X