మ‌రో చాంపియ‌న్స్ లీగ్ గెల‌వ‌డమే నా క‌ల‌: లియోనెల్ మెస్సీ

పారిస్‌: బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌ను వీడిన స్టార్ ఫుట్‌బాలర్, అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్‌ మెస్సీ.. ఇక ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ లీగ్‌-1లో కనిపించనున్నాడు. ఈ మేరకు మెస్సీ ఫ్రెంచ్‌ క్లబ్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. పీఎస్‌జీలో ఇప్పటికే బ్రెజిల్‌ స్టార్‌ నెయ్‌మార్‌, ఫ్రాన్స్‌ స్ట్రెకర్‌ ఎంబాపె ఉన్నారు.

పీఎస్‌జీ చేరిన సంద‌ర్భంగా లియోనల్‌ మెస్సీ మాట్లాడుతూ... మ‌రో చాంపియ‌న్స్ లీగ్ గెల‌వ‌డం తన కల అని తెలిపాడు. 'మ‌రో చాంపియ‌న్స్ లీగ్ గెల‌వ‌డం నా క‌ల‌. ఆ ప‌ని చేయ‌డానికి నేను స‌రైన ప్లేస్‌లోనే ఉన్నాన‌ని అనుకుంటున్నా. కచ్చితంగా చాంపియ‌న్స్ లీగ్ గెలుస్తామనే నమ్మకం ఉంది' అని మెస్సీ అన్నాడు. చివ‌రిసారి 2015లో బార్సిలోనా టీమ్‌లో త‌న చివ‌రి యురోపియ‌న్ టైటిల్‌ను మెస్సీ గెలిచాడు. అప్పటినుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మెస్సీ మరో చాంపియ‌న్స్ లీగ్ గెలవలేకపోయాడు. మెస్సీ పోరాడినా.. ఇతర ప్లేయర్స్ సరైన ప్రదర్శన చేయకపోవడంతో బార్సిలోనా మరో టైటిల్ గెలవలేకపోయింది.

పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ) ఇప్ప‌టి వ‌రకూ ఒక్క చాంపియ‌న్స్ లీగ్ కూడా గెల‌వలేదు. పీఎస్‌జీ ఏడాదికి 7 కోట్ల యూరోలు (సుమారు రూ.310 కోట్లు) మెస్సీకి చెల్లించ‌నున్న‌ట్లు స‌మాచారం. మెస్సీ లాంటి స్టార్ ప్లేయ‌ర్ త‌మ టీమ్‌లో చేరుతుండ‌టంతో పీఎస్‌జీ అభిమానులు అత‌నికి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఇప్ప‌టికే బ్రెజిల్‌కు చెందిన నెయ్‌మార్, ఫ్రాన్స్‌ స్ట్రెకర్‌ ఎంబాపె కూడా ఇదే టీమ్‌లో ఉన్నారు. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ప్రస్తుతం పీఎస్‌జీలో ఉండడంతో.. ఆ క్లబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ త్రయం అన్నా పీఎస్‌జీకు టైటిల్ అందిస్తారేమో చూడాలి.

ప్రపంచ నేతలారా.. నా దేశాన్ని ఇలా వదిలేయకండి! ప్రజలను కాపాడండి! వేడుకున్న సన్‌రైజర్స్‌ ప్లేయర్!!ప్రపంచ నేతలారా.. నా దేశాన్ని ఇలా వదిలేయకండి! ప్రజలను కాపాడండి! వేడుకున్న సన్‌రైజర్స్‌ ప్లేయర్!!

ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మెస్సీతో కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ చేసుకునేందుకు సుముఖంగా లేమని బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక ప్రకటన నేపథ్యంలో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రతిష్టాత్మక కోపా అమెరికా 2021లో అర్జెంటీనా విజయం తర్వాత సెలవుల్లో ఉన్న మెస్సీ.. క్లబ్‌లో చేరిన మరుసటి రోజే ఈ మేరకు ప్రకటన జారీకావడం గమనార్హం. మెస్సీతో బార్సిలోనా క్లబ్‌.. కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ ఉండొచ్చని భావించగా ఈ హఠాత్పరిణామంతో ఫ్యాన్స్‌ విస్మయానికి గురయ్యారు.

ఏ గేమ్‌లో అయినా ఓ ప్లేయ‌ర్ ఓ టీమ్‌తో కొన‌సాగాల‌నుకొని.. ఫ్రీగా ఆడాల‌ని నిర్ణ‌యించుకుంటే అంతకంటే పెద్ద సంతోషం మరోటి ఉండదు. కానీ స్పానిష్ లీగ్‌లో మాత్రం అలా కుద‌ర‌దు. మెస్సీ త‌న ఫీజును 50 శాతం త‌గ్గించుకుంటాన‌ని చెప్పాడు. అస‌లు మొత్తానికే ఫ్రీగా ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నా మెస్సీకి ఆ అవ‌కాశం లేదు. నిజానికి మెస్సీ త‌న ఫీజును గ‌రిష్ఠంగా 50 శాతం కంటే త‌గ్గించుకోవ‌డానికే వీలు లేదు. స్పానిష్ నిబంధ‌న‌లు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. అక్క‌డి ఉపాధి చ‌ట్టం ప్ర‌కారం.. ఎవ‌రైనా ఉద్యోగి త‌న వేత‌నంలో 50 శాతం మాత్ర‌మే కోత విధించుకోవ‌చ్చు. అంత‌కు మించి అవ‌కాశం ఉండ‌దు. ఆర్థిక‌ప‌ర‌మైన అవ‌క‌త‌వ‌క‌ల‌ను అడ్డుకోవ‌డానికి స్పెయిన్ ఈ నిబంధ‌న తీసుకొచ్చింది.

ఒక‌వేళ స్పెయిన్‌లో ఆ చ‌ట్టం లేక‌పోయినా కూడా లా లిగా నిబంధ‌న‌ల ప్ర‌కారం కూడా మెస్సీ బార్సిలోనాలో కొన‌సాగ‌లేడు. దీనికి కార‌ణం.. ఓ క్ల‌బ్ త‌న వార్షిక ఆదాయంలో ప్లేయ‌ర్స్‌కు చెల్లించాల్సిన గ‌రిష్ఠ మొత్తం 70 శాతం మాత్రమే. ఇప్పుడు బార్సిలోనా జీతాల నుంచి మెస్సీ జీతం మొత్తం తీసేసినా.. వారి వార్షిక ఆదాయంలో ఈ మొత్తం 95 శాతంగా ఉంది. అంటే 70 శాతం కంటే ఇప్ప‌టికే చాలా ఎక్కువే. ఆ లెక్క‌న మెస్సీ ఫ్రీగా కొన‌సాగాల‌న్నా.. అవ‌కాశం లేకుండా పోయింది. గ‌త కొన్నేళ్లుగా ఖ‌రీదైన ప్లేయ‌ర్స్‌తో కాంట్రాక్టులు కుదుర్చుకోవ‌డం బార్సిలోనాను ఆర్థికంగా దెబ్బ‌తీసింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
అంచనాలు
VS
Story first published: Wednesday, August 11, 2021, 17:35 [IST]
Other articles published on Aug 11, 2021
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X