మెస్సీ.. రెండో భార్యకు.. మూడో కొడుకు..

Posted By: Subhan
Lionel Messi's third child with Antonella Roccuzzo is named Ciro

హైదరాబాద్: క్రిస్టియన్ రొనాల్డొకు.. లియోనల్ మెస్సీకి ఫుట్ బాల్ గ్రౌండ్ లోనే కాదు బయట కూడా పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరూ భార్యలు, పిల్లల విషయంలో హద్దులు ఏమీ పెట్టుకోలేదనిపిస్తుంది. అదే విషయం మరో సారి నిరూపితం కానుంది. త్వరలోనే మెస్సీ మూడో సారి తండ్రి కాబోతుండటమే దానికి నిదర్శనం.

అయితే పుట్టబోయే కొడుకు పేరు కూడా ముందుగానే నిర్ణయించేశారు ఆ తల్లిదండ్రులు కైరో మెస్సీగా ఆ బిడ్డ పేరు పెట్టాలని ఫిక్సయ్యారట. లియోనల్ మెస్సీ 2017 జూన్ 30న ఆంటోనెల్లాను రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే అతనికి ఇద్దరు పిల్లలు ఉండటంతో రాబోయే సంతానంతో కలిపి ముగ్గురు కానున్నారు.

Desayunando con ellos 😍❤️❤️

A post shared by Leo Messi (@leomessi) on Oct 29, 2017 at 2:15am PDT

ఆ తండ్రి పుత్రోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నాడు. తన భార్య గర్భంలో కొడుకు కదులుతున్న ఫొటోను సోషల్ మీడియాలో ఉంచి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు.

❤️El hermano mayor mas dulce❤️

A post shared by AntoRoccuzzo88 (@antoroccuzzo88) on Nov 23, 2017 at 6:51am PST

రొనాల్డొ సైతం రెండో భార్యను వివాహమాడి ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే అతనికి ఏడుగురు పిల్లలు కావాలనేది కోరిక అంటూ చాలా మీడియాతో పంచుకున్నాడు.

A post shared by Leo Messi (@leomessi) on Nov 15, 2017 at 11:43am PST

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 9, 2018, 17:40 [IST]
Other articles published on Feb 9, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి