న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఆసియా క్రీడలు 2018 నుంచి ఇరాక్ జట్టును అందుకే తప్పించారా?

 Iraq pull out of Asian Games football tournament

హైదరాబాద్: మరో రెండు వారాల్లో జరగనున్న ఆసియా గేమ్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నుంచి ఇరాక్ జట్టు తప్పుకుంది. టోర్నమెంట్ మొదలయ్యే సమయానికి తమ జట్టు పూర్తిగా సిద్ధమై ఉండదని అందుకనే తాము తప్పుకుంటున్నామని ఇరాక్ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. బాగ్దాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి ఈ అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో అనుకున్న దానికి విరుద్ధంగా ఉన్న ఆరు గ్రూపుల్లోని జట్లు ఐదుగా మారాయి. ఇలా ఇరాక్ తప్పుకోవడం వల్ల ఏకంగా ఒక గ్రూపు (చైనా, టైమర్ లెస్తే, సిరియా) తప్పుకున్నట్లు అయింది.

ఆసియా గేమ్స్‌లో పాల్గొంటామని ముందు ప్రకటించినా తాము సిద్ధమైన దానిని బట్టే.. టోర్నమెంట్‌లో ఆడతామని ఒకవేళ పూర్తి సన్నద్ధతతో లేకపోతే తప్పుకుంటామని ఇరాక్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ముందుగానే ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం..ఇరాక్ జట్టు అండర్ 16 క్రీడాకారులను పాస్‌పోర్ట్ కంట్రోల్ దగ్గరే ఆపేశారు. వయస్సుకు మించిన ఆటగాళ్లను కూడా జట్టులోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో వారిని ప్రాంతీయ టోర్నమెంట్లో మాత్రమే ఆడేందుకు వీలు కల్పించారు.

2018 ఆసియా క్రీడల్లో భాగంగా ఆగష్టు 10నుంచి మొదలుకానున్న ఫుట్‌బాల్ అండర్ 23సంవత్సరాల వయస్సున్న ప్లేయర్లు మాత్రమే పాల్గొనాలంటూ.. నిబంధనలు విధించారు. ఈ క్రమంలో కోచ్‌లు ముగ్గురిని మాత్రం ఎక్కువ వయస్సున్న వారిని జట్టులోకి ఎంచుకున్నారు. ఇరాక్ జట్టు ఇప్పటికీ ఒకే ఒక్కసారి స్వర్ణాన్ని సాధించగలిగింది. 1982లో న్యూఢిల్లీలో జరిగిన టోర్నమెంట్‌ ఫైనల్లో కువైట్‌పై 1-0తేడాతో గెలిచి ట్రోఫీని గెలుచుకుంది.

ఆసియా ఖండాంతరంగా జరగనున్న ఆసియన్ గేమ్స్‌కు భారత్ నుంచి 524 మంది ఆటగాళ్లను భారత ఒలింపిక్ సంస్థ ప్రకటించింది. ఇండోనేషియాలోని పాలెంబర్గ్, జకార్తా ప్రాంతాలలో ఆగష్టు 18 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకూ ఈ ఈవెంట్లు జరగనున్నాయి. వీరిలో మొత్తం 277 మంది పురుషులతో పాటు.. 247 మహిళ క్రీడాకారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Thursday, August 2, 2018, 16:18 [IST]
Other articles published on Aug 2, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X