న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

టైటిల్ కైవసంపైనే బెంగళూరు గురి: అల్బర్ట్ రోసా

ఎఎఫ్ సి కప్ ఫైనల్స్ మ్యాచ్ వైపు వెనక్కు తిరిగిచూస్తే తాము సాధించిన అనుభవం గొప్పదిగానూ, గర్వంగా కనిపిస్తున్నదన్న బెంగళూరు ఎఫ్ సి కోచ్ అల్బర్ట్ రోసా

By Nageshwara Rao

బెంగళూరు: వరుసగా మూడేళ్లలో రెండుసార్లు టైటిల్ గెలుచుకున్న బెంగళూరు జట్టు.. ఐ - లీగ్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు అంటే ఎవరికీ సందేహం లేదు. 2016లో ఎఎఫ్‌సి ఫైనల్స్‌కు చేరుకున్న బెంగళూరు జట్టుపై ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐ లీగ్ టోర్నీలో విజయాలపై అభిమానుల్లో ఆశలు భారీగానే ఉన్నాయి.

అభిమానుల అంచనాలకు కూడా టైటిల్ ను తిరిగి గెలుచుకోవాలన్న తమ ఆశలపై మరింత వత్తిడి పెంచుతుందంటున్నాడు బెంగళూరు ఎఫ్ సి కోచ్ అల్బర్ట్ రోసా. అయితే టైటిల్ తిరిగి గెలుచుకోవాలన్న లక్ష్యంతోనే తమ జట్టు ముందుకు వెళుతుందని అల్బర్ట్ రోసా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఐ లీగ్ టోర్నీలో తాము ఏ జట్టునూ కూడా తేలిగ్గా తీసిపారేయడం లేదన్నాడు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా తమ జట్టు ప్రమాణాలు మెరుగు పడితే టాస్క్ ను ఎదుర్కోవడం కష్ట సాధ్యమైనా అది సవాలేనన్నాడు. ఎఎఫ్ సి టోర్నీ తమకు గొప్ప అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాడు. అన్నింటికంటే భారత ఫుట్ బాల్ ఆటకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టిందన్నాడు.

I-League: Bengaluru FC aims to retain title, says Albert Roca

మరోసారి టైటిల్ గెలుచుకోవడం అంత తేలికేం కాదని రోసా వ్యాఖ్యానించాడు. అభిమానులతోపాటు ప్రతి ఒక్కరూ తమ జట్టు పెర్పార్మెన్స్‌ను సునిశితంగా పరిశీలిస్తారన్నారు. కానీ తమ జట్టు చాలా కష్టపడి పనిచేస్తున్నదని, టైటిల్ గెలుచుకోవడానికి అవసరమైన కసరత్తు జరుగుతుందన్నాడు.

కోల్ కతా జెయింట్స్ మొహున్ బగన్, ఈస్ట్ బెంగాల్ జట్లు ఎల్లవేళలా గట్టిపోటీనిస్తూ టైటిల్ కోసం పోటీనిస్తున్నాయి. దీనికి తోడు తాము కొత్త రెండు జట్లు లీగ్ లో చేరాయన్నాడు. వాటి గురించి తమకు తెలియదని ఆయన చెప్పాడు. అయితే ఆయా జట్లను ఎదుర్కొనేందుకు వేచిచూస్తూ కూర్చోలేమన్నాడు. అలాగని తమపై ఎటువంటి ఒత్తిడి లేదన్నాడు.

శిక్షణ పొందిన ప్లేయర్లుగా ఆడితే.. జట్టు విజయాల పట్ల ఆసక్తితో ఉంటే చాలన్నాడు. తమ జట్టులో అల్వారో చాలా అనుభవం కలిగి ఉన్నాడని, తమ జట్టులో అనుభవం గల వారికి, ప్రతిభావంతులకు కొదవలేదని అల్బర్ట్ రోసా వివరించాడు. జట్టులోని మిడ్ ఫీల్డర్లు ఒకటి, రెండు పాయింట్లు సాధించేందుకు అవకాశాలు అందిపుచ్చుకుంటారని అంచనావేస్తున్నానన్నాడు.

టీం విశ్లేషకులతో కోచింగ్ సిబ్బంది సమావేశమై ఆయా జట్లలోని ముఖ్యాంశాలను చర్చిస్తారన్నాడు. ఇటీవల ముగిసిన ఐఎస్ఎల్ టోర్నీని చాలా నిశితంగా గమనించామని ఆయన వివరించాడు. గుర్మిత్ సింగ్ చాలా కష్టపడే కుర్రాడు, నైతిక విలువలు గల ఆటగాడడన్నాడు. 100 శాతం పెర్పార్మెన్స్ మెరుగుపడుతుందని చెప్పాడు.

అయితే ఆయన ఎప్పుడు ఐ - లీగ్ కు సిద్ధమవుతాడన్నది తాను చెప్పలేనని, ఆయన చాన్స్ ఎప్పుడు కొట్టేయాలో నిర్ణయించుకోవాల్సిందీ గుర్మిత్ మాత్రమేనన్నాడు. తమకు అభిమానుల మద్దతు చాలా అవసరమని చెప్పాడు. జెడిటి జట్టుతో జరిగిన సెమీ ఫైనల్స్‌లో అభిమానుల మద్దతు వల్లే విజయం సాదించగలిగామన్నాడు.

వారు నాటి మ్యాచ్ లో చాలా ప్రముఖ పాత్ర పోషించారన్నాడు. ఎఎఫ్ సి కప్ కోసం బెంగళూరు జట్టు ప్రయాణం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచిందని, ఈ దఫా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నదని చెప్పాడు. తమ క్లబ్ విజయాల్లోనూ, టైటిళ్లు కైవసం చేసుకోవడంలోనూ అభిమానులే కీలకమని అల్బర్ట్ రోసా వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X