బిగ్ డీల్: అలెక్సిస్ శాన్సెజ్‌ కోసం మాంచెస్టర్ యునైటెడ్ పెద్ద మొత్తం

How will Alexis Sanchez compare to Manchester United's post-Ferguson big deals?

హైదరాబాద్: మాంచెస్టర్ యునైటెడ్ జట్టు తన విజయాలను మరింతగా మెరుగుపరచుకునేందుకు గాను ఓల్డ్ ట్రాఫోర్డ్ నుంచి అలెక్సిస్ శాన్సెజ్‌ను మార్పిడి ద్వారా కోనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా తమ జట్టులోని హెన్రిఖ్ ముహిత్యుయన్‌ను ఆర్సెనెల్‌కు పంపాలని చూస్తోంది.

బిడ్డింగ్‌లో ఆటగాళ్ల కోనుగోలు కోసం మిలియన్ల పౌండ్లను ఖర్చు పెట్టే మాంచెస్టర్ యునైటెడ్ ఈ ఒప్పందం విషయంలో జోస్ ముర్హిన్రోతో జాగ్రత్తగా వ్వవహారిస్తోంది. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు తరుపున ఆడేందుకు అలెక్సిస్ శాన్సెజ్‌ కూడా సుముఖత వ్యక్తం చేశాడు. అంతేకాదు ఈ మార్పిడి ఒప్పందం కోసం ఎలాంటి ఫీజు కూడా అడగకపోవడం విశేషం.

ఓల్డ్ ట్రాఫోర్డ్ జట్టుకు ఆడే సమయంలో అలెక్సిస్ శాన్సెజ్‌ ప్రాధమిక ధర వారానికి గాను £350,000 నుంచి £500,000 ఉండటం విశేషం. అయితే ఓల్డ్ ట్రాఫోర్డ్ జట్టు నుంచి అలెక్సిస్ శాన్సెజ్‌ కోనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు సంబంధించిన అత్యంత ఖరీదైన ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే...


మారోనీ ఫెల్లానీ - £27.5m
ఫెర్గూసన్‌ స్ధానంలో డేవిడ్ మోయిస్ మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో తీసుకున్న సమయంలో ఆ జట్టు టాప్ టార్గెట్స్‌గా గెరాత్ బేల్, టోన్ క్రూస్, సెక్ ఫాబ్రిగ్యాస్, క్రిస్టియానో రొనాల్డోలు మాత్రమే. వీరందరితో పోలిస్తే ఒకే ఒక్క సంతకంతో మారోనీ ఫెల్లానీని మాంచెస్టర్ జట్టు సొంతం చేసుకుంది.

మారోనీ ఫెల్లానీ తనదైన శైలిలో దూకుడుని ప్రదర్శిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించేవాడు. ముఖ్యంగా మాజీ ఎవర్టన్ మేనేజర్‌కు మారోనీ ఫెల్లానీ దూకుడు అంటే ఎంతో ఇష్టం. ముర్హిన్రో సారథ్యంలో మారోనీ ఫెల్లానీ బెల్జియం ఇంటర్నేషన్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు.


జాన్ మాటా - £37.1m
యునైటెడ్ నుంచి చెల్సియాకు మాటా మారడంలో ముర్హిన్రో కీలకంగా వ్యవహరించాడు. స్టామ్ ఫోర్డ్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్‌కు మారడానికి ముందు వరకు జాన్ మాటా 30 ప్రీమియర్ లీగ్ గోల్స్ సాధించాడు. సాకర్‌లో మాటా గొప్పతనాన్ని కీర్తించని వారు ఉండరంటే నమ్మండి. 29 ఏళ్ల మాటా కేవలం £37.1m ఫీజుతోనే సరిపెట్టుకున్నాడు.


అండర్ హెర్రారియా - £29m
ముర్హిన్రో సమయంలో మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో అండర్ హెర్రారియా బలమైన మిడ్ ఫీల్డర్‌గా ఎదిగాడు. సూపర్ ఎనర్జీ ఇతడి సొంతం. అయితే మరిన్ని గోల్స్ చేసి ఉంటే ఇంకా కెరీర్ ఎంతో బాగుండేది. ఇప్పటివరకు ఆరు ప్రీమియర్ లీగ్ ఆడిన అండర్ హెర్రారియా ఐదు గోల్స్ కూడా చేయలేదు.


లూకీ షా - £30m
మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో రెగ్యులర్ బెర్తు కోసం గత మూడున్నర ఏళ్లుగా ఎదురుచూస్తునే ఉన్నాడు. 2015లో ఛాంపియన్స్ లీగ్‌లో పీఎస్వీతో జరిగిన మ్యాచ్‌లో కాలుకి తీవ్ర గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకునే సరికి అతడికి చాలా సమయం పట్టింది.


ఏంజెల్ డీ మారియా - £59.7m
లూయిస్ వాన్ గాల్‌ స్థానాన్ని మోయిస్ భర్తీ చేసిన తర్వాత ఏంజెల్ డీ మారియా కోసం మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యం ఓపెన్ చెక్ బుక్‌ని ఆఫర్ చేసింది. అప్పటివరకు రియల్ మాడ్రిడ్ జట్టుకు ఆడుతున్న ఏంజెల్ డీ మారియాను రికార్డు ధరకు £59.7m వెచ్చించి మాంచెస్టర్ యునైటెడ్ జట్టు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌లో ఏంజెల్ డీ మారియా హై-ఫ్రొఫైల్ కలిగిన వ్యక్తి.


ఆంటోనీ మారిటల్ - £36m
ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ సమయంలో ఓ బ్రిటిష్ పత్రిక ఆంటోనీ మారిటల్ £36m చెల్లించి కోనుగోలు చేయడం వేస్ట్ అని రాసుకొచ్చింది. కెరీర్ తొలినాళ్లలో ఆంటోనీ మారిటల్ తనను తాను నిరూపించుకునేందుకు గాను ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లాడిన ఆంటోనీ మారిటల్ 8 గోల్స్ చేయడం నిజంగా శుభసూచికం.


ఎరిక్ బైల్లీ - £30m
జోస్ ముర్హిన్రో నేతృత్వంలో జరిగిన మొట్టమొదటి డీల్ ఎరిక్ బైల్లీదే కావడం విశేషం. ఎరిక్ బైల్లీ అద్భుతమైన డిఫెండర్. పోర్చుగీసు మేనేజర్ సైతం ఎరిక్ బైల్లీ ఆటతీరుకు ముగ్దుడయ్యాడు.


హెన్రిఖ్ ముహిత్యుయన్‌ - £30m
ఆర్సెనల్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్‌కు అలెక్సిస్ శాన్సెజ్‌ మార్పిడి ద్వారా వస్తున్నాడంటే ఎక్కువగా బాధపడేది హెన్రిఖ్ ముహిత్యుయన్‌ మాత్రమే. ఎందుకంటే జట్టులో హెన్రిఖ్ ముహిత్యుయన్‌ రోల్‌కే అలెక్సిస్ శాన్సెజ్‌ ఎసరు పెట్టనున్నాడు. 29 ఏళ్ల హెన్రిఖ్ ముహిత్యుయన్‌ ఇప్పటికీ జట్టులో రెగ్యులర్ స్థానం కోసం కృషి చేస్తూనే ఉన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

    Story first published: Tuesday, January 23, 2018, 18:26 [IST]
    Other articles published on Jan 23, 2018