న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

గెలవడమే టార్గెట్.. తిక్కలేస్తే కొరికేస్తా..!!

Here Are All 3 Times Luis Suarez Has Bitten Opponents

హైదరాబాద్: సూపర్ స్ట్రయికర్..బంతితో గోల్స్ చేయడంలో మొనగాడు. కానీ తన ఆటకు అడ్డొస్తే మాత్రం ఊరుకునేదే లేదు. కొరికి పరేస్తాడు. ఏదో భయపెట్టేందుకు కొరకడం కాదు. కండ ఊడేలా కొరికి పరేస్తాడు. అది క్లబ్ మ్యాచ్ అయినా.. పిఫా ప్రపంచకప్ మ్యాచ్ అయినా తీరు మారదు.. అందుకే ఉరుగ్వే స్టార్ ఫుట్‌బాలర్ లూయిస్ సూరెజ్ అంటే ప్రత్యర్థులకు భయం..2014లో బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చిన సాకర్ ప్రపంచకప్‌లో సూరెజ్ విపరీత ప్రవర్తనతో అందరూ అతన్ని ఛీ కొట్టారు.

ఉరుగ్వే జట్టు ఇటలీతో జరిగే గ్రూప్ మ్యాచ్‌లో నెగ్గితేనే నాకౌట్ చేరుతుంది. కీలకమైన మ్యాచ్‌లో రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. స్టార్ స్ట్రయికింగ్‌తో ఉరుగ్వే జట్టులో కీలక ఆటగాడిగా సూరెజ్‌పై మరింత బాధ్యత పడింది. ఈ నేపథ్యంలో తనను మార్కింగ్ చేస్తున్న ఇటలీ డిఫెండర్ గియార్జియో చియెలినిపై సూరెజ్ కు కోపం వచ్చింది. ఆ ఆవేశంతో విరుచుకుపడి గోల్ చేయనీయకుండా అడ్డుకుంటున్న గియార్జియో భుజాన్ని తన శక్తిమేరా కొరికాడు.

దీంతో గియార్జియో కిందపడి గిలగిలలాడాడు. ఒకవైపు సూరెజ్ ఏమీ తెలియనివాడిలా నోటికి దెబ్బ తగిలినట్లుగా నటిస్తూ అనుకోకుండా భుజానికి మూతి తాకిందన్నట్లు కలరింగ్ ఇచ్చాడు. డి బాక్స్ సమీపంలో పెనాల్టీ సమీపంలో జరిగిన ఈ సంఘటనను రిఫరీ గమనించకపోవడంతో అప్పటికి బతికి పోయాడు. అనంతరం విచారణలో అతను కొరికిన విషయం నిర్ధారణ కావడంతో నాలుగునెలలపాటు సూరెజ్‌ను అన్ని ఫుట్‌బాల్ పోటీలనుంచి తక్షణం పిఫా బహిష్కరించింది.

గతంలోనూ లివర్‌పూల్, మరో గ్రూపు తరపున ఆడిన సూరెజ్ ఇలాగే ప్రత్యర్థులను కొరికాడు. దీంతో ఈసారి పిఫా కఠినంగా వ్యవహరించి అతనికి భారీ జరిమానా విధించింది. అతనిని వరుసగా 10 గేమ్‌లు, 7 గేమ్‌లు ఆడొద్దంటూ నిషేదం విధించింది. కాగా, అనంతరం బార్సిలోనాకు , లివర్‌పూల్‌కు ఆడిన సూరెజ్ కాస్త జాగ్రత్తగానే ఉంటున్నాడు.

Story first published: Thursday, May 31, 2018, 9:31 [IST]
Other articles published on May 31, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X