ఫిఫా ర్యాంకుల్లో స్వల్పంగా మెరుగైన భారత్.. టాపర్‌గానే జర్మనీ.. పరిస్థితి దిగజారిన రష్యా

Posted By:
Germany top FIFA standings despite wobble, India climb to 97th

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ ర్యాంక్స్‌లో జర్మనీ తన స్థానాన్ని కాపాడుకున్నది. ఇటీవల వివిధ దేశాలతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లను గెలుచుకోవడంలో వెనుకబడినా జర్మనీ టాప్ వన్‌గానే నిలిచింది. ఒకవైపు రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ తేదీ ముంచుకొస్తుండగా, ఇంతకుముందు నాలుగు గేమ్స్‌లో మూడింటిని జర్మనీ డ్రా ముగించింది. ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించినా జర్మనీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలోనే కొనసాగుతున్నది.

ఎఎఫ్సీ క్వాలిఫయింగ్‌లో ఓడిపోయినా ఇలా మెరుగు:

ఎఎఫ్సీ క్వాలిఫయింగ్‌లో ఓడిపోయినా ఇలా మెరుగు:

ఎఎఫ్సీ ఆసియన్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో క్వార్ట్‌జ్ రిపబ్లిక్ జట్టుపై ఓటమి పాలైనా భారత్ తన ర్యాంకు రెండు పాయింట్లు పెంచుకోగలిగింది. ఓవరాల్‌గా 97వ ర్యాంకు వద్ద భారత్ స్థిర పడింది.

బ్రెజిల్, స్పెయిన్ జట్ల మధ్య మ్యాచ్ డ్రా:

బ్రెజిల్, స్పెయిన్ జట్ల మధ్య మ్యాచ్ డ్రా:

ఇటీవల ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను జర్మనీ డ్రాగా ముగించింది. ఏడో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ జట్టుపైనా 2 - 2 స్కోర్ తేడాతో మ్యాచ్ డ్రాగా ముగించింది. రెండో ర్యాంకు సాధించిన బ్రెజిల్, స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌నూ 1 - 1 స్కోర్ తేడాతో డ్రా గా ముగించింది.

2014లో జర్మనీ ఇలా ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ కైవసం:

2014లో జర్మనీ ఇలా ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ కైవసం:

జోయాచిమ్ లౌవ్యూ సారథ్యంలో జర్మనీ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లతోనే 2014 టైటిల్‌ను గెలుచుకోగలిగింది. యూరో 2016 టోర్నీలో వరుసగా 22 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన బ్రెజిల్ జట్టు సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. అయితే వరల్డ్ కప్ ఆతిథ్య జట్టు రష్యాపై 3 - 0 స్కోర్ తేడాతోనూ, జర్మనీతోనూ తేలిగ్గా విజయం సాధించగలిగినందుకు బ్రెజిల్ జట్టు రెండో స్థానంలో నిలబడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ గాయపడిన నేయ్మార్ లేకుండానే బ్రెజిల్ విజయం సాధించడం గమనార్హం.

సౌదీ, జపాన్ జట్లతో మ్యాచ్‌ల్లో బెల్జియం ఇలా విజయం:

సౌదీ, జపాన్ జట్లతో మ్యాచ్‌ల్లో బెల్జియం ఇలా విజయం:

బెల్జియం జట్టు గతంతో పోలిస్తే రెండు పాయింట్లు మెరుగు పర్చుకుని మూడో స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా, జపాన్ దేశాలతో జరిగిన ఫ్రెండ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విజయం సాధించింది బెల్జియం జట్టు. అలెక్సిస్ సాంచెజ్ సారథ్యంలోని చిలీ జట్టు ఒక ర్యాంకు పైకి ఎదిగి తొమ్మిదో స్థానంలో నిలిచింది. కానీ రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించని టాప్ - 10 ర్యాంకింగ్ జట్టు చిలీ ఒక్కటే అంటే అతి శయోక్తి కాదు.

ఐదో ర్యాంకు వద్ద స్థిరపడిన అర్జెంటీనా:

ఐదో ర్యాంకు వద్ద స్థిరపడిన అర్జెంటీనా:

గురువారం ఫిఫా ప్రకటించిన ర్యాంకుల్లో జర్మనీ, బ్రెజిల్ మొదటి రెండో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక బెల్జియం రెండు స్థానాలు మెరుగు పర్చుకుని మూడో స్థానానికి, పోర్చుగల్ ఒక పాయింట్ కోల్పోయి నాలుగో ర్యాంకుకు, అర్జెంటీనా ఒక పాయింట్ నష్టపోయి ఐదో స్థానానికి పడిపోయింది. టాప్ 13గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు మూడు పాయింట్లు మెరుగుపడింది. మెక్సికో, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ రెండు పాయింట్లు పెంచుకోగలిగాయి. పెరు, డెన్మార్క్ స్థానాలు మాత్రం మెరుగు పడలేదు. పోలండ్ నాలుగు పాయింట్లు కోల్పోయి పదో ర్యాంకు వద్ద సంతృప్తిపడింది.

రష్యా ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఇదే చెత్త రికార్డు:

రష్యా ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఇదే చెత్త రికార్డు:

ఇదిలా ఉంటే వచ్చే జూన్ 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సాకర్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న రష్యా ర్యాంకు మాత్రం రికార్డు స్తాయిలో 66వ ర్యాంకుకు పడిపోయింది. ఇది రష్యా జట్టు చరిత్రలోని అతి తక్కువ ర్యాంక్. 493 పాయింట్లతో రష్యా మూడు స్థానాలు పడిపోయి 66వ ర్యాంకుకు చేరుకున్నది. 495 పాయింట్లతో సాల్వేనియా 65వ ర్యాంకు, 462 పాయింట్లతో మాలి 67వ స్థానంలో నిలిచాయి.

గత నెలలో మ్యాచ్‌ల ఆధారంగానే ర్యాంకులు ఖరారు:

గత నెలలో మ్యాచ్‌ల ఆధారంగానే ర్యాంకులు ఖరారు:

మార్చి అంతా ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లతో చాలా బిజీగా సాగింది. వివిధ దేశాల మధ్య జరిగిన 133 మ్యాచ్ ల ఆధారంగా తాజాగా ర్యాంకులు ఖరారు చేసినట్లు ఫిపా తెలిపింది. మొదటి స్తానంలో నిలిచిన జర్మనీ 1533, తర్వాత స్థానంలో ఉన్న బ్రెజిల్ 1384, బెల్జియం 1346, పోర్చుగల్ 1306, అర్జెంటీనా 1254, స్విట్జర్లాండ్ 1179, ఫ్రాన్స్ 1166, స్పెయిన్ 1162, చిలీ 1146, పోలండ్ 1118 పాయింట్లతో టాప్ ర్యాంకుల్లో నిలిచాయి.

మాస్కోతోపాటు 12 స్టేడియాల్లో మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు:

మాస్కోతోపాటు 12 స్టేడియాల్లో మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు:

మరో రెండు నెలల్లో రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రష్యా రాజధాని మాస్కోలో జూన్ 14వ తేదీన ప్రారంభ మ్యాచ్ జరుగనున్నది. 2018 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ ల నిర్వహణ కోసం మాస్కోలో రెండు స్టేడియంలతోపాటు సెయింట్ పీటర్స్ బర్గ్, సోచి, కజన్, సరాంస్క్, కలిన్‌గ్రాడ్, వోల్గో గ్రాడ్, రొస్టోవోన్ డాన్, నిజ్ని నోవోగ్రాడ్, యాక్తరింగ్ బర్గ్, సమర నగరాల్లోని స్టేడియంలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది.

Story first published: Friday, April 13, 2018, 15:22 [IST]
Other articles published on Apr 13, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి