నిద్రలోనే కనుమూసిన పుట్‌బాల్ కెప్టెన్

Posted By:
Fiorentina captain and Italy star Davide Astori dies in his sleep aged 31

హైదరాబాద్: ఫియోరెంటినా, ఇటలీ జాతీయ జట్టు ఫుట్‌బాల్‌ ఆటగాడు డావీ అస్టోరి నిద్రలో కన్నుముశాడు. ప్రస్తుతం క్లబ్‌ జట్టైన ఫియోరెంటినాకు కెప్టెన్‌గా ఉన్న 31 ఏళ్ల అస్టోరి నిద్రలోనే కన‍్నుమూసినట్లు క్లబ్‌ తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది. తాను బస చేస్తున్న హోటల్‌ గదిలోనే అస్టోరి మృతిచెందాడు.

'It's so unfair' - Former coach Garcia on Astori's sudden death

బ్రేక్ ఫాస్ట్ కోసం హోటల్ సిబ్బంది ఫోన్ చేయడంతో అస్టోరి ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో హోటల్ గదికి వెళ్లి చూస్తే విగతజీవిగా పడిఉన్నాడు. అయితే అస్టోరి కార్డియక్‌ అరెస్ట్‌కు గురికావడంతోనే చనిపోయి ఉండవచ్చని యుడిని సిటీ ప్రాసిక్యూటర్ ఆండోనియో డీ నికోలో స్పష్టం చేశాడు.

మరోవైపు, యుడినెస్‌ జట్టుతో పోరుకు ముందు అస్టోరి మృత్యువాత పడటానికి అనారోగ్య సమస్యలే కారణమని ఫియోరెంటినా జట్టు యాజమాన్యం తెలిపింది. ఇటలీ ఫుట్‌బాల్‌ జట్టు తరపున 14 మ్యాచ్‌లు ఆడిన అస్టోరి.. 2016లో ఫియోరెంటినా క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు.

ఇప్పటి వరకు ఫియోరెంటినా తరపున 58 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. అతనికి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు. అయితే, భార్య ఫ్రాన్‌సెస్కాతో విభేదాల కారణంగా అస్టోరి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక వార్తా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

Uuuuuuuuu tic-tac-tic-tac ❤️💥🤘🏻 . . . . #assafa

A post shared by Francesca Fioretti (@francesca_fioretti) on Dec 22, 2017 at 2:35pm PST

Story first published: Monday, March 5, 2018, 13:34 [IST]
Other articles published on Mar 5, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి