న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్ 2018: ఎవరు గురించి ఎవరేమన్నారు..??

FIFA World Cup 2018: Whos saying what at the World Cup

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ సంరంభం మొదలై వారం రోజులు గడిచింది. ప్రతి రోజూ సుమారు ఆరు జట్లు తలపడి మూడు మ్యాచ్‌లతో ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జట్టుపై అభిమానంతో వచ్చే వాళ్లు ఆటగాళ్లంటే వీరాభిమానంతో వచ్చే వాళ్లతో స్టేడియాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తొలి మ్యాచ్‌లో రష్యా సౌదీ అరేబియాపై 5-0 తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ మొదలుకొని రోజూ అదే జోరుతో దూసుకుపోతోందీ టోర్నీ. ప్రస్తుతం కొనసాగుతున్న ఫిఫా వరల్డ్ కప్ తీరుపై ప్రముఖులు ఇలా వ్యాఖ్యానించారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

'వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనా జట్టుతో కచ్చితంగా ఇంగ్లాండ్ జట్టే తలపడుతుంది. అందులో విజేతగా ఇంగ్లాండ్ విజేతగా నిలుస్తుంది' _ ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్

'ఇదేం ఆట.? వాళ్లు మనల్ని తొక్కేస్తున్నారు. ఇది జాతీయ జట్టు అని ఎలా అనుకోగలం' _ఇరాన్‌తో తలపడుతున్న సమయంలో.. స్పానిష్ జర్నలిస్ట్ తమ దేశం గురించి ఇలా రాసుకొచ్చాడు.

'అతను ఓ గ్రేట్ కోచ్ సలహాలతో ఆడుతున్నాడు. క్రిస్టియానొ రొనాల్డొ ఓ పోర్ట్ వైన్ లాంటోడు. వయస్సుతో సంబంధం లేకుండా అతని ప్రదర్శన కొనసాగిస్తున్నాడు'_ పోర్గుల్ జట్టు యజమాని ఫెర్నాండో సాంతోస్

'అదీ ఆటంటే. మా ఆటగాళ్లు వరల్డ్ కప్‌ని గుర్తించారు. వాళ్లు దేశాన్ని ప్రేమిస్తున్నారు. దేశం కోసమే ఆడుతున్నారు'_ రష్యా డిప్యూటి మినిస్టర్ విటలీ ముట్కో

'ఈ టోర్నమెంట్ నాకు ఎందుకో ఇంత బాగా కలిసొచ్చేస్తోంది'_రష్యా ఆటగాడు డెనిస్ చెరిషెవ్

'మనమంతా ఆయనతో ఉందాం. మన అభిమానం అతనికి మరింత ప్రోత్సాహమిస్తుందని అతనికి తెలియాలి' _లియోనల్ మెస్సీ గురించి అర్జెంటీనా స్ట్రయికర్ పౌలో డైబాలా

'ఇవాళ కాదు రేపు చూడు.. ఆలీవర్.. అందరి కంటే విభిన్నమైన ఆట తీరు ప్రదర్శిస్తాడు. ఒకవేళ అతను టోర్నమెంట్‌కు దూరమైతే చాలా కోల్పోతాం'_ఫ్రాన్స్ కోచ్ డిడైర్ దేశ్‌ఛాంప్స్

'మీరు ఇంకొంచెం పాజిటివ్‌గా ఉంటే.. అది మన అందరికీ మంచిది'_ రియల్ మాడ్రిడ్ ఆటగాడు రాఫెల్ వరాన్ మీడియాని సంభోదిస్తూ ఇలా అన్నాడు.

'సెనెగల్ జట్టు ఓటమి నుంచి కోలుకుని త్వరగా బయటికి రావాలి'_ కోచ్ ఆదడ్ నవాల్కా

'జట్టులో అతనే ఎక్కువగా టార్గెట్ అయ్యాడు. చాలా సార్లు ఫౌల్‌కు కూడా గురైయ్యాడు' _ బ్రెజిల్ ఆటగాడు ఫిలిప్ కౌటినో అతని సహచరుడు నెయ్‌మార్‌ను ఉద్దేశించి అలా అన్నాడు.

'ప్రపంచంలోనూ, బ్రెజిల్‌లో కూడా స్తీల పట్ల చులకన భావం, అవమానించడం, లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఫిఫా చూడడానికి వచ్చిన అభిమానులపై కూడా ఇలాగే జరుగుతున్నాయి'_ విదేశీ మహిళలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై బ్రెజిల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ రైట్స్ వారు ఇలా స్పందించారు.

Story first published: Thursday, June 21, 2018, 19:04 [IST]
Other articles published on Jun 21, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X