న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్ 2018: సెనెగల్‌‌ను తేలిగ్గా తీసుకుంటే అంతే!

By Nageshwara Rao
 FIFA World Cup 2018: Senegal team, records, fixtures

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో ఆరు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.


దేశం: సెనెగల్


గ్రూపు H: సెనెగల్, పోలాండ్, జపాన్, కొలంబియా


వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 19: vs Poland
June 24: vs Japan
June 28: vs Colombia


ఫిఫా ర్యాంకింగ్: 27


ఉత్తమ ప్రదర్శన: 2002లో క్వార్టర్‌ఫైనల్‌.


స్టార్ ప్లేయర్లు: కలిడౌ కౌలిబలీ, సాడియో మానె, కీట బాల్డె.


కోచ్: అలియో సిస్సె


గత రికార్డులు:
No. of times team has played in WC (number): 1
No. of matches played (number): 5
No. of matches won: 2
No. of matches lost: 1
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 7


అంచనా: ఆఫ్రికన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ గ్రూప్‌-డిలో ఓటమన్నదే లేకుండా రష్యా వరల్డ్ కప్‌లో సెనెగల్ అడుగుపెడుతోంది. 2002లో తొలి వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్‌ చేరి యావత్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని సెనెగల్‌ అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. ఆ ప్రపంచకప్‌లో తొలిసారిగి బరిలో దిగిన ఈ జట్టు ఆరంభ మ్యాచ్‌లోనే అప్పటి ప్రపంచ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌కు షాకిచ్చింది. అదే ఊపుతో క్వార్టర్స్‌కు దూసుకుపోయి ఔరా అనిపించింది. ఆ విజయమే స్ఫూర్తిగా రెండోసారి ఫిఫాకప్‌ బరిలోకి దిగుతోంది.

Story first published: Saturday, June 9, 2018, 16:35 [IST]
Other articles published on Jun 9, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X