న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఉత్కంఠభరితంగా విజయం అందుకున్న సౌదీ అరేబియా

last-gasp winner from Salem Al Dawsari

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా ఆఖరి వరకు పోరాడి గెలిచింది. మ్యాచ్‌ డ్రాగా ముగిసినట్లేనని అంతా భావించిన తరుణంలో, ఆఖరి క్షణాల్లో గోల్‌తో సౌదీ అరేబియా 2-1తో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. ఆ జట్టు వెనుకబడి మరీ పుంజుకుంది. సౌదీ తరఫున అల్‌ ఫరాజ్‌ (45+6, పెనాల్టీ), సలేం అల్‌ దవ్‌సారి (90+5) గోల్స్‌ కొట్టగా.. ఈజిప్ట్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మహ్మద్‌ సలా (22వ)సాధించాడు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించిన సౌదీ గోల్‌కీపర్‌ ఎసామ్‌ హదరి ఓ పెనాల్టీని అద్భుతంగా అడ్డుకున్నాడు. కానీ మరోదాన్ని ఆపలేకపోయాడు. 45 ఏళ్ల హదరి 39వ నిమిషంలో సౌదీ అరేబియా ఆటగాడు పహాద్‌ అల్‌ మువాలాద్‌ స్పాట్‌ కిక్‌ను కుడివైపు దూకుతూ కళ్లుచెదిరే రీతిలో ఆపాడు. ఐతే సౌదీ రెండు అర్ధభాగాల్లోనూ స్టాపేజ్‌ సమయంలో గోల్స్‌ సాధించింది. ప్రథమార్థం ఇంజురీ సమయంలో సౌదీ అరేబియాకు లభించిన పెనాల్టీని ఫరాజ్‌ సద్వినియోగం చేసుకున్నాడు.

1
958027

ఐతే మ్యాచ్‌లో మొదట ఆధిక్యం సంపాదించింది ఈజిప్టే. ఆరంభ ఎలెవన్‌లో ఉన్న స్టార్‌ ఆటగాడు మహ్మద్‌ సలా 22వ నిమిషంలో గోల్‌ సాధించాడు. కానీ సౌదీ ఆటగాళ్లు ఈజిప్ట్‌ గోల్‌ పోస్టులపై నిరంతరాయంగా దాడులు చేస్తూనే ఉన్నారు. మ్యాచ్‌ మొత్తంలో 23 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్టుపై సౌదీ ఆటగాళ్లు దాడులు చేశారు. డిఫెండర్‌ సలేం అల్‌ దాస్రి ఆట అదనపు సమయంలో అద్భుతమైన గోల్‌ చేసి ఈ వరల్డ్‌కప్‌లో సౌదీకి తొలి విజయాన్ని అందించాడు.

మ్యాచ్‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా దవ్‌సారి సాధించిన గోల్‌తో సౌదీ విజయాన్ని అందుకుంది. దీంతో సౌదీ అరేబియా 2-1తేడాతో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. 1994 ప్రపంచకప్‌ తర్వాత సౌదీకి ప్రపంచకప్‌లో ఇదే తొలి విజయం. ఈజిప్ట్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి గ్రూప్‌లో అట్టడుగు స్థానంతో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.

Story first published: Tuesday, June 26, 2018, 8:12 [IST]
Other articles published on Jun 26, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X