ఫిఫా ర్యాంకులు: దారుణంగా పడిపోయిన భారత ర్యాంకు

Posted By:

హైదరాబాద్: ఫిఫా గురువారం విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో భారత ఫుట్‌బాల్ జట్టు ర్యాంక్ మరింత పడిపోయింది. తాజాగా విడుదల చేసిన 'ఫిఫా' ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఏకంగా 10 స్థానాల్ని కోల్పోయి 107వ ర్యాంకుకు దిగజారింది.

2019 ఆసియా కప్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో మకావు చేతిలో ఓడటం.. భారత పుట్‌బాల్ జట్టు ర్యాంక్‌పై ప్రభావం చూపింది. సునీల్ ఛెత్రి కెప్టెన్‌గా భారత పుట్‌బాల్ జట్టు గత నెలలో ఆడిన మాడు మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం, ఒక దానిని డ్రా చేసుకోవడంతో 97వ ర్యాంక్‌లో నిలిచింది.

FIFA rankings: India slip to 107

మే నెల తర్వాత భారత్ ర్యాంక్‌కు 100కి పైగా పడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. జూలైలో 96వ స్థానానికి ఎగబాకడం ద్వారా భారత్‌ తమ అత్యుత్తమ ర్యాంకు సాధించింది.

Story first published: Friday, September 15, 2017, 10:08 [IST]
Other articles published on Sep 15, 2017
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి