న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫహాద్ అల్ మాత్రమే కాదు: సౌదీ రిఫరీలందరిపైనా ఫిఫా నిషేధం!

FIFA drops disgraced Saudi Arabian referee Fahad Al Mirdasi from World Cup

జ్యురిచ్: ఎట్టకేలకు సౌదీ అరేబియా అభ్యర్థనను ఫిఫా మన్నించినట్లే ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన రిఫరీ ఫహాద్ అల్ మిర్దాసీపై నిషేధం విధించాలని ఫిఫాను సౌదీ అరేబియాను కోరింది. జీవితకాలం ఆయనపై నిషేధం విధించాలని అభ్యర్థించింది. రెండు వారాల క్రితం ఫహాద్ అల్ మిర్దాసీని ఒక జట్టు విజయానికి సహాయ పడ్డారని రుజువు కావడంతో ఆయనపై సౌదీ అరేబియా ఫుట్‌బాల్ సమాఖ్య జీవితకాలం నిషేధం విధించింది.

రిఫరీల నియామకంపై ఫిఫా ఫోకస్

రిఫరీల నియామకంపై ఫిఫా ఫోకస్

రష్యాలో ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్‌కప్ టోర్నమెంట్ నిర్వహణకు అవసరమయ్యే రిఫరీల ఎంపిక పైనే ద్రుష్టి సారించింది. కానీ ఫహాద్ అల్ మిర్దాసీని రిఫరీగా నియమించడానికి ఆయన పరిస్థితులు సంత్రుప్తికరంగా లేవని ఫిఫా తెలిపింది. అంతే కాదు సౌదీ అరేబియాకు చెందిన రిఫరీలందరిపై, వారికి ఇద్దరు సహాయకులపై నిషేధం విధిస్తూ ఫిఫా నిర్ణయం తీసుకున్నది.

సౌదీకి, ఎఎఫ్‌సీ ఫహద్‌పై నిషేధంపై అధికారిక సమాచారం

సౌదీకి, ఎఎఫ్‌సీ ఫహద్‌పై నిషేధంపై అధికారిక సమాచారం

ఫహాద్‌తోపాటు ఆయన సహాయకులు మహ్మద్ అల్ అబక్రీ, అబ్దుల్లా అల్షాల్‌వాల్ పైనా నిషేధం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఫహాద్ అల్ మిర్దాసీని ప్రత్యక్షంగా తప్పించడం లేదని ఫిఫా తేల్చింది. ఫహాద్ ఆయన టీంను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సౌదీ అరేబియా ఫుట్ బాల్ సమాఖ్య (ఎస్ఎఎఫ్ఎఫ్), ఆసియాన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సీ)లకు అధికారికంగా సమాచారం అందజేసింది. వీరి స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జపాన్ దేశాల నుంచి ఇద్దరు అదనపు అసిస్టెంట్ రిఫరీలను ఎంపిక చేశామని పేర్కొంది.

ఫహాదీ సహాయకులుగా యూఏఈ, జపాన్ రిఫరీలు

ఫహాదీ సహాయకులుగా యూఏఈ, జపాన్ రిఫరీలు

యూఏఈకి చెందిన హసన్ అల్ మహ్రీ, జపాన్‌కు చెందిన హిరోషి యమౌచీలను మహ్మద్ మహ్మద్ అబ్దుల్లా (యూఏఈ), ర్యూజీ సాటో (జపాన్)లను సహాయకులుగా నియమిస్తున్నట్లు ఫిఫా తెలిపింది. సౌదీ అరేబియాలో అల్ ఇతిహాద్, అల్ ఫైసాలీ జట్ల మధ్య జరిగిన కింగ్స్ కప్ ఫైనల్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు ముడుపులు తీసుకున్న అల్ మిర్దాసీపై సాఫ్ సస్పెన్షన్ వేటు వేసింది. గమ్మత్తేమిటంటే ఫహాద్ అల్ మిర్దాసి ‘ఫిఫా' వరల్డ్ కప్ అధికారి. కానీ తాను తన జీవితంలో ఎటువంటి ఫుట్‌బాల్ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనలేదని మిర్దాసీ తెలిపాడు.

ర్యాంక్స్‌లో రియల్ మాడ్రిడ్ టాప్

ర్యాంక్స్‌లో రియల్ మాడ్రిడ్ టాప్

చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టు ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా రియల్ మాడ్రిడ్ జట్టు మరో దఫా సంబురాల్లో మునిగి తేలుతోంది. రియల్ మాడ్రిడ్ జట్టు తర్వాత బేయర్న్ మ్యునిచ్, మాంచెస్టర్ సిటీ, జువెంటస్, బార్సిలోనా ర్యాంకులు యధాతథంగా ఉన్నాయి.

పీఎస్జీ, అట్లెంటిక్ మాడ్రిడ్ జట్లు ఒక్కో స్థానం పైపైకి

పీఎస్జీ, అట్లెంటిక్ మాడ్రిడ్ జట్లు ఒక్కో స్థానం పైపైకి

పారిస్ సెయింట్ జెర్మైన్ ఒక స్థానం పెరిగి ఆరో స్థానానికి, అట్లెంటిక్ మాడ్రిడ్ ఏడో స్థానానికి చేరాయి. కొత్తగా పీఎస్వీ ఇండోవెన్ క్లబ్ పదో ర్యాంక్ పొందగా, పొర్టో ఒక్క స్థానం పెరిగి తొమ్మిదో స్థానానికి ఎదిగింది. లివర్ పూల్ జట్టు రెండు స్థానాలు కోల్పోయి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నది.

Story first published: Thursday, May 31, 2018, 15:33 [IST]
Other articles published on May 31, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X