న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫాన్స్ జట్టు నిలబడాలంటే.. 19 ఆడాల్సిందే

FIFA 2018 World Cup: Player to watch: Kylian Mbappe to add sharp edge to France

హైదరాబాద్: 20 ఏళ్ల లోపే.. తొలి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఆడి మరడోనా, పీలెలాంటి దిగ్గజాలు ప్రపంచానికి తామేంటో చాటి చెప్పారు. ఫిఫా మెగా టోర్నీ వచ్చిన ప్రతిసారీ అందరూ అప్పటికే పేరుమోసిన స్టార్ల మీద దృష్టి పెడతారు. ఐతే ప్రతి కప్పులోనూ కొందరు కొత్త కుర్రాళ్లొచ్చి మాయ చేస్తారు. అద్భుత ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తారు. ఈసారి కూడా వచ్చిన కొందరు కుర్రాళ్లపై విశ్లేషకులు అంచనాలు మోపారు.

మరి కొద్ది గంటల్లో ఆరంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలో.. ఫ్రాన్స్ జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఇలా భావించడానికి కిలియన్‌ ఎంబాప్‌ కూడా ఒక కారణం. అతడి వయసు 19 ఏళ్లే. కానీ ఇప్పటికే చాలా పేరు సంపాదించాడు. అతని వార్షిక వేతనం 2152 కోట్ల రూపాయలకుపైగానే ఉంటుంది. గత ఏడాది కాలంలో అతను వేగంగా ఎదిగాడు. నిరుడు ఛాంపియన్స్‌ లీగ్‌లో ఆరు గోల్స్‌ కొట్టడంతో అతడి పేరు మార్మోగింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

అతడి జోరు చూసి పారిస్‌ సెయింట్‌-జర్మన్‌ క్లబ్‌ ఏకంగా 180 మిలియన్ల యూరోల బదిలీ ఫీజుతో అతడిని తన క్లబ్బులోకి తీసుకుంది. దీన్ని బట్టే కిలియన్‌ సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చు. తొలి ప్రపంచకప్‌లో ఇతడి విన్యాసాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అలా అని మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో ఇతనే ప్రధాన స్ట్రయికర్ అని చెప్పుకోవడానికి లేదు. అలా అని ఎంబపే జట్టులో ప్రధాన స్ట్రయికర్ కాదు. ఒకానొక సమయంలో సహచరులు గోల్ చేసేందుకు బంతి ద్వారా సహకారం అందించి ప్రశాంతంగా ఉండిపోతాడు. ఇదే విషయంపై ఫ్రాన్స్ జట్టు కోచ్ అయిన దిడ్లర్, ఎంబ‌పేను తెగపొగిడేస్తున్నాడు. ఎవరైనా సహచరులు గోల్ చేసినా.. ఎంబపే ప్రశాంతంగా ఉండిపోతాడు. ఇలాంటి వ్యక్తిత్వం అందరిలోనూ ఉండదు.

Story first published: Wednesday, June 13, 2018, 15:45 [IST]
Other articles published on Jun 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X