న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఈ వరల్డ్ కప్‌లో బ్రెజిల్ గోల్ హంటర్ ఎవరో తెలుసా?

By Nageshwara Rao
FIFA 2018 World Cup: Player to watch: Gabriel Jesus, Brazil goal hunter

హైదరాబాద్: పీలె, మరడోనా ప్రపంచంలో అత్యుత్తమ పుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్లు. అరంగేట్రం చేసిన తొలినాళ్లలోనే సత్తా చాటారు. 20 ఏళ్లలోపే వీరు ఆడిన పుట్‌బాల్ వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు. సాధారణంగా ఫిఫా వరల్డ్ కప్ వచ్చిన ప్రతిసారీ అందరూ అప్పటికే స్టార్ల మీద దృష్టిసారిస్తారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | ఫిఫా వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్: తేదీలు, వేదికలు, సమయం

అయితే, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో కొందరు యువ ఆటగాళ్లు సైతం తమ అద్భుత ప్రదర్శనతో అందరి మన్ననలు అందుకుంటారు. ఈసారి అలా హీరోగా నిలవగలడని పుట్‌బాల్ విశ్లేషకులు భావిస్తోన్న ఆటగాళ్లలో ఒకడు గాబ్రియెల్‌ జీసెస్‌.

వీధుల్లోని గోడలకు రంగులు

వీధుల్లోని గోడలకు రంగులు

బ్రెజిల్‌కు చెందిన గాబ్రియెల్‌ జీసెస్‌ ఒకప్పుడు పుట్‌బాల్ స్టేడియాలతో పాటు వీధుల్లోని గోడలకు రంగులు వేసేవాడు. అలాంటి గాబ్రియెల్‌ జీసెస్‌ ఇప్పుడు తన దేశం తరుపున సెన్సెషన్‌గా మారాడు. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా వరల్డ్ కప్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలో దిగుతున్న బ్రెజిల్‌ జట్టులో కీలక ఆటగాడు.

ఇపీఎల్‌లో మాంచెస్టర్‌ సిటీ జట్టుకు ప్రాతినిథ్యం

ఇపీఎల్‌లో మాంచెస్టర్‌ సిటీ జట్టుకు ప్రాతినిథ్యం

ప్రస్తుతం గాబ్రియెల్‌ జీసెస్‌ మార్కెట్ విలువ $95 మిలియన్. 20 ఏళ్ల గాబ్రియెల్‌ జీసెస్‌ ఇంగ్లిష్‌ ప్రిమియర్‌ లీగ్‌లో మాంచెస్టర్‌ సిటీ జట్టు తరఫున అద్భుతమైన గోల్స్‌ కొట్టాడు. మొత్తంగా 28 మ్యాచ్‌ల్లో 15 గోల్స్‌ చేశాడు. బ్రెజిల్‌ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 8 గోల్స్‌ సాధించాడు.

మైదానంలో అతడి వేగం అద్భుతం

మైదానంలో అతడి వేగం అద్భుతం

బ్రెజిల్ జట్టులో గాబ్రియెల్‌ జీసెస్‌ అత్యుత్తమ ఆటగాడు అని అనడానికి కారణం మైదానంలో అతడి వేగమే. మైదానంలో గాబ్రియెల్‌ జీసెస్‌ ఓ చిరుతలా పరుగెత్తుతాడు. అతడి వేగం మ్యాచ్‌ని వీక్షిస్తోన్న ప్రతి ఒక్కరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బంతిని నియంత్రించడంలో నైపుణ్యం అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

 తొలి మ్యాచ్ స్విట్జర్లాండ్‌తో

తొలి మ్యాచ్ స్విట్జర్లాండ్‌తో

ఇక, రష్యా వేదికగా జూన్ 14 నుంచి జరగనున్న వరల్డ్ కప్‌లో గాబ్రియెల్‌ జీసెస్‌ ఎదుట పెను సవాళ్లే ఉన్నాయి. 2014 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టిన బ్రెజిల్ ఈసారి ఎలాగైనా సరే కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. కాగా, టోర్నీలో భాగంగా బ్రెజిల్ జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆదివారం (జూన్ 17)న స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.

Story first published: Wednesday, June 13, 2018, 15:40 [IST]
Other articles published on Jun 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X