న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్‌ఎల్ 2017: ఉరిమే ఉత్సాహంతో పోరాడతామంటున్న సాకర్ ప్లేయర్లు

హైదరాబాద్: పది జట్లు కలసి పాల్గొంటున్న ఐఎస్‌ఎల్ సిరీస్‌లో భాగం ఒక్కొక్క జట్టు కనీసం ఆరు మ్యాచ్‌ల వరకు ఆడింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు 13 పాయింట్లతో అందరికంటే ఆధిక్యంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఎఫ్‌సీ గోవా, బెంగుళూరు ఎఫ్‌సీ కొనసాగుతున్నాయి. 2019 సంవత్సరారంభంలో ఏయే జట్లు ఎలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులను ఎదుర్కోబోతున్నాయో సరాదాగా సమీక్షిద్దాం.

footballa

దేశ రాజధాని తరపునుంచి పాల్గొన్న జట్టు ఢిల్లీ డైనమోస్. పాల్గొన్న ఆరు మ్యాచ్‌లకుగాను 3పాయింట్లు సంపాదించుకుని జాబితాలో అందరికంటే ఆఖరి స్థానంలో నిలుచుని ఉంది. మొదట్లో ఎఫ్‌సీ పూణె సిటీపై ఆడి 3-2 స్కోరును గెలుచుకుంది. తర్వాత జరిగిన ఐదు మ్యాచ్‌లు సున్నా స్కోరుతో ఓడిపోయి ఐఎస్‌ఎల్‌లోనే కొత్త రికార్డు సృష్టించింది. ఆ 3 పాయింట్లతోనే జట్టును నడిపిస్తూ తలమునకలవుతోంది.

ఢిల్లీ డైనమోస్ శుభారంభం చేసి తర్వాత చప్పుడు లేకుండా కూర్చుంది. కోల్‌కత్తాకు చెందిన ఏటీకే జట్టు ఒకటి, రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి ఎలాగైతే చివర్లో ఆడిన రెండు మ్యాచ్‌లను గెలిచింది. నవంబరులో మొదలై ఇంకా కొనసాగుతూ ఉన్న ఈ కాలి బంతాట (ఫుట్‌బాల్) జనవరిలో ఎలా ఉండబోతుందో..

జనవరి 3, ఏటీకే (కోల్‌కత్తా) వర్సెస్ ఎఫ్‌సీ గోవా

జనవరి 3, ఏటీకే (కోల్‌కత్తా) వర్సెస్ ఎఫ్‌సీ గోవా

నూతన సంవత్సర శుభాకాంక్షల అనంతరం జరగాల్సిన ఈ మ్యాచ్ వాయిదా పడటంతో జనవరి 3 కోల్‌కత్తా వేదికగా జరగబోతోంది. మామూలుగానే ఇండియన్ ఫుట్‌బాల్ జట్లలో ఈ ఇరు జట్లంటే అభిమానులకు ప్రత్యేక ఆసక్తి. 2014లో జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కత్తానే గెలిచింది.

ప్రస్తుత లీగ్‌లో గోవా రెండో స్థానంలో ఉంది. ఇదే కోల్‌కత్తా జట్టు ఇంతకుముందు సిరీస్‌లలో ఇప్పటికే రెండు సార్లు గోవా జట్టును ఓడించడం గమనార్హం.

జనవరి 7, బెంగుళూరు ఎఫ్‌సీ వర్సెస్ ఏటీకే(కోల్‌కత్తా), వేదిక: బెంగుళూరు

జనవరి 7, బెంగుళూరు ఎఫ్‌సీ వర్సెస్ ఏటీకే(కోల్‌కత్తా), వేదిక: బెంగుళూరు

కూల్ సిటీ బెంగుళూరు తరపు నుంచి ఆడుతున్న బెంగుళూరు ఎఫ్‌సీ

ఈ లీగ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లకు నాలుగు మ్యాచ్‌లలో గెలిచింది. ప్రస్తుత లీగ్‌లో మెదటి మ్యాచ్‌లో సున్నాతో ఆరంభించి ప్రస్తుతం పన్నెండు పాయింట్లతో గోవాతో సమంగా కొనసాగుతుంది.

టాప్ 4లో ఒకటిగా నిలిచిన బెంగుళూరు ఎఫ్‌సీ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్‌కత్తా జట్టు ఏటీకే‌తో జనవరి 7న తలపడనుంది. అంతకుముందు జరిగిన సిరీస్‌లలో కోల్‌కత్తా జట్టు బెంగుళూరు జట్టును ఓడించింది. ఈ నేపథ్యంలో జనవరి 7న జరగనున్న మ్యాచ్ బెంగుళూరు జట్టుకు చాలా కీలకంగా నిలవనుంది.

జనవరి 11, ఎఫ్‌సీ గోవా, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ, వేదిక: గోవా

జనవరి 11, ఎఫ్‌సీ గోవా, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ, వేదిక: గోవా

ఆతిథ్య జట్టు జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ గోవా ఎఫ్‌సీ జనవరి 11న తలపడనుంది. ఈ మ్యాచ్ ఎఫ్ సీ గోవా కు మంచి స్కోరు సంపాదించడానికి ఓ సదవకాశమనే చెప్పాలి. కానీ, జంషెడ్ పూర్ ఎఫ్‌సీ అంతే రీతిలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నందున ఈ పోరు ఉత్కంఠ భరితంగా సాగనుంది.

మాన్యుయోల్ లాంజారొటెకు ఫెర్రన్ కొర్రొమినొస్‌కు మధ్య జరగనున్న ఈ భీకరపోరుకు గోవా జట్టు దిగ్గజాలైన ఆండ్రి బైకీ, టిరీ సిద్ధంగా ఉన్నారు. క్రీడాకారుల పరిస్థితి అటుంచితే అభిమానులకైతే పండగే.

జనవరి 13, చెన్నైయిన్ ఎఫ్‌సీ వర్సెస్ పూణె సిటీ, వేదిక: చెన్నై

జనవరి 13, చెన్నైయిన్ ఎఫ్‌సీ వర్సెస్ పూణె సిటీ, వేదిక: చెన్నై

నంబరు వన్ స్థానంలో ఉన్న చెన్నైయిన్ ఎఫ్‌సీ ఫూణె సిటీ జట్టుతో తలపడనుంది. స్వస్థలంలోని మెరీనా ఎరెనా ప్రాంతంలో తనకంటే ఒక్కటే పాయింట్ తక్కువలో ఉన్న ఫూణె సిటీ జట్టుతో తలపడటమంటే భీకర యుద్దమే.

చెన్నై జట్టుకి ఉన్న ఒకే ఒక సదవకాశమేమంటే, ఇప్పటి వరకు ఎఫ్‌సీ ఫూణె సాధారణ జట్టులతో తలపడి తన స్కోరును సంపాదించుకోగలిగింది. మంచి ఫామ్‌లో ఉన్న చెన్నై జట్టుకు ఫూణె జట్టును ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. మహా వ్యూహాలను నేర్పుగా వాడగల పూణె జట్టు యజమాని అయిన రాంకో పొపొవిక్ ఈ ఆటలో ఎంతవరకు తన మాయాజాలాన్ని ప్రదర్శించగలడో చూడాల్సిందే.

జనవరి 17 , జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ వర్సెస్ కేరళ బ్లాస్టర్స్, వేదిక: జంషెడ్ పూర్

జనవరి 17 , జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ వర్సెస్ కేరళ బ్లాస్టర్స్, వేదిక: జంషెడ్ పూర్

ఇంతకుముందే తలపడిన ఇరుజట్లు మళ్లీ తమ నైపుణ్యంతో ఆధిక్యాన్ని ప్రదర్శించదలచుకున్నాయి. కేరళ జట్టు మాజీ మేనేజర్ అయిన స్టీవ్ కాపెల్ ప్రస్తుతం జంషెడ్‌పూర్ తరపున వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను మొదటి మ్యాచ్ మాదిరిగానే తన జట్టు ప్రతిభను పూర్తిగా వాడి పాత జట్టు ఆటగాళ్లను చిత్తు చేయగలడో లేదో తెలుసుకోవాలి.

ప్రస్తుత స్కోరు: జంషెడ్‌పూర్ 9 పాయింట్లు , కేరళ బ్లాస్టర్స్ 7

జనవరి 21, కేరళ బ్లాస్టర్స్ వర్సెస్ ఎఫ్‌సీ గోవా, వేదిక: కేరళ

జనవరి 21, కేరళ బ్లాస్టర్స్ వర్సెస్ ఎఫ్‌సీ గోవా, వేదిక: కేరళ

జనవరి 17న జరిగిన మ్యాచ్ అనుభవంతో కేరళ బ్లాస్టర్స్ ప్రస్తుతం టాప్ 2 లో ఉన్న ఎఫ్‌సీ గోవాతో తలపడనుంది. ఐదు పాయింట్ల ఆధిక్యంతో ప్రయాణం కొనసాగిస్తున్న ఎఫ్‌సీ గోవాతో తలపడి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షీంచుకునేందుకు కేరళ యోచిస్తోంది. ఇప్పటికే డిసెంబరు 9న జరిగిన మ్యాచ్‌లో గోవా 5 పాయింట్లు గెలుచుకోగా కేరళ 2 పాయింట్లతో సరిపెట్టుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 16:37 [IST]
Other articles published on Dec 26, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X