న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు: నగదు ఓకే, ట్రోఫీ మాకు వద్దు

By Nageshwara Rao
 Egypt goalkeeper refuses World Cup man of the match award over Budweiser links

హైదరాబాద్: రష్యాలో ఫిఫా వరల్డ్ కప్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడికి టోర్నీ నిర్వాహకులు మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద అవార్డు కింద కొంత నగదు, ట్రోఫీని అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పలు దేశాలకు చెందిన ఆటగాళ్లు మాత్రం అవార్డు కింద ఇచ్చే నగదుని తీసుకుంటున్నారు గానీ, ట్రోఫీని మాత్రం తీసుకోవడం లేదంట.

 ‘బడ్‌వైజర్‌' స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరించడమే

‘బడ్‌వైజర్‌' స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరించడమే

అయితే, ఇందుకు ప్రధాన కారణం ‘బడ్‌వైజర్‌' స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరించడమేనని అంటున్నారు. టోర్నీలో భాగంగా శనివారం ఈజిప్టు-ఉరుగ్వే జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఈజిప్టు గోల్‌కీపర్‌ మహమ్మద్‌ ఎల్షినవీ తన అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్ధి జట్టులోని ఆటగాళ్లు గోల్స్ కొట్టకుండా అడ్డుగోడగా నిలిచాడు.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికైన మహమ్మద్‌

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికైన మహమ్మద్‌

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ తన అద్భుత ప్రదర్శనకు గాను జట్టు విజయంలో కీలకపాత్ర పోషించే ఆటగాడికి అందజేసే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు మహమ్మద్‌ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మహమ్మద్‌ను ట్రోఫీతో పాటు నగదును అందుకోవల్సిందిగా పిలిచారు. నగదు బహుమతిని అందుకున్నాడు, అయితే ట్రోఫీ స్వీకరించేందుకు మాత్రం నిరాకరించాడు.

ప్రధాన స్పాన్సర్‌ షిప్‌గా ‘బడ్‌వైజర్‌'

ప్రధాన స్పాన్సర్‌ షిప్‌గా ‘బడ్‌వైజర్‌'

రష్యాలో జరుగుతున్న 21వ ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ‘బడ్‌వైజర్‌' ప్రధాన స్పాన్సర్‌ షిప్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను ఇదే అందజేస్తోంది. మద్యం తయారు చేసే బడ్‌వైజర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందించడం కారణంగానే ట్రోఫీని తీసుకునేందుకు మహమ్మద్‌ నిరాకరించాడు.

ట్రోఫీని మాత్రం తీసుకోవడం లేదు

ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో ఈజిప్ట్‌తో పాటు ముస్లింలు అధికంగా ఉండే పలు దేశాలు ఈ మెగా టోర్నీలో ఆడుతోన్న సంగతి తెలిసిందే. వీరంతా కూడా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కింద ఇచ్చే ట్రోఫీని తీసుకోవడం లేదు. బడ్‌వైజర్ అందించే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకోకపోవడంతో ఈజిప్టు గోల్‌కీపర్‌ మహమ్మద్‌ ఎల్షినవీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Monday, June 18, 2018, 17:23 [IST]
Other articles published on Jun 18, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X