న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

అభిమానుల సంబరానికి భూకంపం వచ్చింది..!!

Earthquake triggered by Mexico fans celebrating German defeat

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాల్ టోర్నీ ఫిఫాలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఆదివారం హిర్వింగ్ లొజానో స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జర్మనీపై మెక్సికో ఒకే ఒక్క గోల్ తేడాతో విజయం సాధించింది. నిజ‌మే.. ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో న‌మోదైన ఒక గోల్ మెక్సికోలో భూకంపం తెప్పించింది. ఆరంభం నుంచి గోల్ చేసేందుకు తీవ్రంగా శ్రమించిన ఇరు జట్లు తీవ్రమైన స్థాయిలో ఆడారు.

ఈ క్రమంలో.. త‌మ టీమ్ డిఫెండింగ్ చాంపియ‌న్ జ‌ర్మ‌నీపై గెల‌వ‌డానికి మెక్సికన్లు చేసిన కృషి విజయవవంతమైంది. మెక్సిక‌న్లు దీంతో మెక్సికన్లు ఆనందంతో గంతులేశారు. దేశ‌వ్యాప్తంగా అభిమానులంతా రోడ్ల‌పైకి వ‌చ్చి డ్యాన్స్‌లు చేయ‌డంతో ఆ ధాటికి భూమి కంపించింది. అస‌లు జ‌ర్మ‌నీపై మెక్సికో గెలుస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ అనూహ్యంగా 1-0 తేడాతో గెలిచి అద్భుత‌మే చేసింది.

మ్యాచ్ ముగియ‌గానే ల‌క్ష‌ల సంఖ్య‌లో అభిమానులు వీధుల్లోకి వ‌చ్చి దేశ అన‌ధికారికి సాక‌ర్ ఆంథెమ్ సీలిటో లిండోని పాడుతూ ఎంజాయ్ చేశారు. మెక్సికో సిటీలోని ఏంజెల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద‌గ్గ‌ర ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ మ్యాచ్ 35వ నిమిషంలో మెక్సికో ప్లేయ‌ర్ హిర్వింగ్ లొజానో గోల్ కొట్ట‌డంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మెక్సికో.. మ‌ళ్లీ స్కోరును స‌మం చేసే అవ‌కాశం జ‌ర్మ‌నీకి ఇవ్వ‌లేదు.

ఈ గోల్ త‌ర్వాత మెక్సికో సిటీలోని రెండు ప్రాంతాల్లో భూమి కంపించిన‌ట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోలాజిక‌ల్ అట్మాస్పియ‌రిక్ ఇన్వెస్టిగేష‌న్స్ వెల్ల‌డించింది. ఇది కృత్రిమ భూకంపం అని ఆ సెంట‌ర్ ప్ర‌క‌టించింది. ఈ జర్మనీ.. 36 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్‌ను కోల్పోయింది. 1982 తర్వాత ఇప్పటివరకూ ఇలా జరగలేదు.

Story first published: Monday, June 18, 2018, 17:12 [IST]
Other articles published on Jun 18, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X