న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫ్రాన్స్, బెల్జియంల మధ్య సెమీస్‌కు ఇదే మంచి సమయం

 Deschamps back Kante to stifle Belgium after smothering Messi

హైదరాబాద్: ఫిఫాలో భాగంగా.. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ జట్టు.. బెల్జియంను ఢీకొంటుంది. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య ముఖాముఖిలో బెల్జియందే పైచేయి. ఐతే ప్రపంచకప్‌లో మాత్రం ఆధిపత్యం ఫ్రాన్స్‌దే. బెల్జియంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఫ్రాన్స్‌ ఓసారి ప్రపంచకప్‌ నెగ్గగా.. 'రెడ్‌ డెవిల్స్‌' తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతోంది. క్వార్టర్‌ఫైనల్లో బెల్జియం 2-1తో ఫేవరెట్‌ బ్రెజిల్‌కు షాకివ్వగా.. ఫ్రాన్స్‌ 2-0తో ఉరుగ్వేను ఓడించింది.

ఈ జట్లు చివరిసారి 1986 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఐతే ఎటాకింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ నువ్వా నేనా అన్నట్లు కనిపిస్తున్న బెల్జియం, ఫ్రాన్స్‌లలో విజేతను అంచనా వేయడం కష్టమైన పనే. అదే ఈ మ్యాచ్‌ను అత్యంత ఆసక్తికరంగా మారుస్తోంది. అన్ని విభాగాల్లో ఢీ అంటే ఢీ అనేలా ఉన్న రెండింటి మధ్య 'మాజీ చాంపియన్‌' హోదా ఒక్కటే తేడా. 1998లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌... తర్వాత పడుతూ లేస్తూ ప్రయాణం సాగి స్తోంది. ఈసారి గ్రీజ్‌మన్‌ వంటి ఆటగాడికి ఎంబాపెలాంటి మెరిక తోడవడంతో ఆటతీరుతోపాటు జట్టు రాతే మారిపోయింది.

1
958082
23 మ్యాచ్‌లలో పరాజయమన్నదే:

23 మ్యాచ్‌లలో పరాజయమన్నదే:

23 మ్యాచ్‌లలో పరాజయమన్నదే ఎరుగదు.. ఫిపా ప్రపంచకప్‌లోనూ అదే ఫాం. వరుస విజయాలు నమోదు చేస్తూ బెల్జియం జట్టు సెమీస్ చేరింది. గ్రూప్‌దశలో మూడు విజయాలు.. నాకౌట్ పోరులో 2-0తో వెనుకబడినా జపాన్‌పై విజయం సాధించడంతోపాటు క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌పై చిరస్మరణీయ విజయంతో సంచలనం సృష్టించింది. దీంతో ప్రపంచకప్ హాట్‌ ఫేవరెట్ ముద్రతో సెమీస్‌లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. జట్టులో స్ట్రయికర్లు లుకాకు (4గోల్స్), హజార్డ్ రాణిస్తుండగా..మిడ్‌ఫీల్డ్‌లో డిబ్రుయెన్, డిఫెన్స్‌లో విన్సెంట్ కొంపానీ, జాన్ వెట్రోగెన్, మౌరోనే ఫెల్లానిలతో పటిష్ఠంగా కనిపిస్తుంది. మరోవైపు మిడ్‌ఫీల్డర్ రాబెర్టో మార్టినెజ్ బరిలోకి దిగితే ఇటు అటాకింగ్‌తోపాటు డిఫెన్స్‌లోనూ బెల్జియం బలం పెరుగనుంది.

గోల్‌కీపర్ల సత్తాకు, నైపుణ్యానికి పరీక్ష

గోల్‌కీపర్ల సత్తాకు, నైపుణ్యానికి పరీక్ష

రెండు జట్లలోనూ ఎటాకర్లు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ గోల్‌కీపర్ల సత్తాకు, నైపుణ్యానికి పెద్ద పరీక్షగా నిలవనుంది. బెల్జియం గోల్‌కీపర్‌ తిబౌత్‌ కోర్ట్‌వా, ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ లారిస్‌లకు తీరికలేని పని ఖాయం. టోర్నీలో ఫ్రాన్స్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై తన ప్రదర్శనతో లారిస్‌ విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ క్వార్టర్‌ఫైనల్లో ఉరుగ్వే తన అత్యుత్తమ ఫామ్‌ను అందుకున్నాడు. అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక విన్సెంట్‌ కొంపాని, వెర్టాంగెన్‌, ఫెలానిల రూపంలో డిఫెండర్లుండటం బెల్జియంకు బలమే. కోర్ట్‌వా అత్యుత్తమ గోల్‌కీపర్లలో ఒకడిగా టోర్నీకి వచ్చాడు. క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌పై చక్కని ప్రదర్శనతో తన ప్రతిష్టను మరింత పెంచుకున్నాడు. ఇద్దరూ మంచి గోల్‌కీపర్లే అయినా ఇద్దరిలో ఎక్కువ దూకుడుగా ఉండే లారిసే మెరుగన్నది ఫ్రెంచ్‌ స్ట్రైకర్‌ ఒలివర్‌ గిరౌడ్‌ అభిప్రాయం.

ఫ్రాన్స్ చెలరేగి తీరుతుందని:

ఫ్రాన్స్ చెలరేగి తీరుతుందని:

డెస్చాంప్ కెప్టెన్సీలోనే 1998 ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీతో పాటు 2000 యూరో ఛాంపియన్‌గా నిలవడం విశేషం. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ డెస్చాంప్ ప్రేరణతోనే ఫ్రాన్స్ చెలరేగుతుందని పావార్డ్ స్పష్టం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ స్ట్రెకర్లలో ఎంబాప్పా 3 గోల్స్ కొట్టాడు. గ్రీజ్‌మాన్ 2 గోల్స్‌తోపాటు జట్టు సాధించిన మరో గోల్‌లో భాగసామ్యంలో పాలుపంచుకున్నాడు. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో ఎంబాప్పే చెలరేగగా.. ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో గ్రీజ్‌మాన్ అద్భుతనైపుణ్యంతో జట్టుకు విజయాన్నందించాడు. బెల్జియం జట్టును నిలువరించి విజయంతో ఫైనల్ చేరే అవకాశం ఫ్రాన్స్‌కే కనిపిస్తుంది.

 ఇరు జట్లు సెమీస్‌‌కు చేరిందిలా... :

ఇరు జట్లు సెమీస్‌‌కు చేరిందిలా... :

ఫ్రాన్స్‌ :

ఆస్ట్రేలియాపై 2-1తో గెలుపు

పెరూపై 1-0తో విజయం

డెన్మార్క్‌తో 0-0తో డ్రా

ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాపై 4-3తో విజయం

క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 2-0తో జయభేరి

బెల్జియం

పనామాపై 3-0తో గెలుపు

ట్యూనీషియాపై 5-2తో విజయం

ఇంగ్లండ్‌పై 1-0తో గెలుపు

ప్రి క్వార్టర్స్‌లో 3-2తో జపాన్‌పై విజయం

క్వార్టర్స్‌లో 2-1తో బ్రెజిల్‌పై జయభేరి

కీలక ఆటగాళ్లు వీరే..

బెల్జియం..

రొమేలు లుకాకు.. ఈడెన్ హజార్డ్.. కెవిన్ డిబ్రుయెన్..నాసిర్ చాడ్లీ

గోల్‌కీపర్ : టిబుట్ కౌర్టోస్..18 సేవ్‌లు

ఫ్రాన్స్..

ఆంటోనీ గ్రీజ్‌మన్.. కైలియన్ ఎంబాప్పే.. లుకాస్ హెర్నాండెజ్..పాల్ పోగ్బా.. బెంజిమిన్ పావర్డ్.. రాఫెల్ వారనే

గోల్ కీపర్ : హ్యూగో లోరిస్.. 5 సేవ్‌లు

Story first published: Tuesday, July 10, 2018, 12:52 [IST]
Other articles published on Jul 10, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X