న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఢిల్లీ థ్రిల్లింగ్ నింపినా.. తేలని ఫలితంగానే మ్యాచ్

By Nageshwara Rao

న్యూఢిల్లీ: వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయానికి దూరమైన ఢిల్లీ డైనమోస్ కుర్రాళ్లు తొలుత ఆధిపత్యం ప్రదర్శించి మెరుపులు మెరిపించారు. అభిమానులను తన్మయంలో ముంచెత్తారు. కానీ గురువారం రాత్రి ఢిల్లీలో పుణె సిటీతో జరిగిన మ్యాచ్‌ను 1 - 1స్కోర్ తేడాతో మ్యాచ్ ఫలితాన్ని డ్రాగా ముగించింది. ఇరు పక్షాలకు చెందిన స్ట్రయికర్లు గోల్స్ చేసే అవకాశాలు వచ్చినా మిస్ చేసుకోవడంతో ఫలితం ఎటూ తేలలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఢిల్లీ గోల్ చేయడానికి ప్రయత్నించిన మూడుసార్లు పుణె గోల్ కీపర్ ఎడెల్ బెటె అడ్డుకున్నాడు. సొంతగడ్డపై చెలరేగిపోయే మార్సెలిన్హో టార్గెట్ చేరుకోవడంలో మిస్ కావడంతో పలు దఫాలు బంతి నెట్ లోకి వెళ్లి బయటకు వచ్చింది. దీంతో ఆరు మ్యాచ్ ల్లో ఢిల్లీ నాలుగింట డ్రాగా ముగించింది. పుణె దూకుడును ఎదుర్కోవడంలో ఢిల్లీ కుర్రాళ్లు విఫలం అయ్యారు.

డిఫెండర్ రాహుల్ భెకె బంతిని హెడ్డర్ కిక్‌లో వచ్చిన చాన్స్‌ను సద్వినియోగంచేసుకుని హెడ్డర్‌గా పంపిన బంతి నేరుగా గోల్ పోస్ట్‌కు పంపడమే తప్ప మిగతా ఆటగాళ్లు ఎటువంటి అవకాశాలు కల్పించుకోలేదు. అంతకుముందు జీసస్ రోడ్రిగ్జ్ టాటూ 45 ప్లస్ 1 నిమిషంలో కార్నర్ చిక్కిన అవకాశాన్ని స్మార్ట్ హెడ్డర్ ద్వారా గోల్ చేసి పుణెను ఆధిక్యంలో నిలబెడితే.. 79వ నిమిషంలో ఢిల్లీ ప్లేయర్ మిలాన్ సింగ్ గోల్ చేసి డ్రా గా ముగించాడు.

ఈ మ్యాచ్ ఫలితం కూడా డ్రా కావడంతో మొత్తం ఈ సీజన్ లోనే వరుసగా ఢిల్లీ జట్టుకు మూడో మ్యాచ్‌ను డ్రాగా ముగించినట్లయింది. దీంతో ఒక మ్యాచ్ లో విజయం, మూడు మ్యాచ్ ల్లో డ్రాతో ఏడు పాయింట్లతో ఢిల్లీ ఏడు పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. తద్వారా ఐఎస్ఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు డ్రాగా ముగించిన రికార్డు ఢిల్లీ దక్కించుకున్నది.

ఇప్పటి వరకు ఢిల్లీ ఖాతాలో 14 ఐఎస్ఎల్ మ్యాచ్‌లు డ్రాగా చేరాయి. అలాగని పుణె పరిస్థితి అంతకంటే బాగా ఏమీ లేదు. ఆరు మ్యాచ్ ల్లో కేవలం ఆరు పాయింట్లతో పాయింట్ల టేబుల్ పై ఏడో స్థానంలో కొనసాగుతున్నది. ఒక మ్యాచ్ లో గెలుపొందిన పుణె మూడింటిని డ్రాగా ముగించి.. రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది.

Delhi play out yet another draw in 1-1 stalemate against Pune

సారధి ఫ్లోరెంట్ మాలౌడా ఆధ్వర్యంలో మార్సెల్లో పెరీరా, రిచర్డ్ గాడ్జె త్రయం తొలి ఫస్టాఫ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. తద్వారా పుణె డిఫెన్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మ్యాచ్ ను నియంత్రించే స్థాయి కలిగి ఉన్నామన్న సంకేతాలిచ్చారు. సరైన ద్రుష్టి లేకపోవడంతో ఫ్లోరెంట్, డేవిడ్ అడ్డీ కొట్టిన షాట్లు గోల్స్ గా మారలేదు. వైడ్ గా మారిపోయాయి.

ఢిల్లీ కుర్రాళ్లు ఎడమ వైపు నుంచి బాగానే ముందుకు సాగినా పుణె కుర్రాళ్ల డిఫెన్స్ వీరిని అడ్డుకున్నది. సుమారు 14 వేల మంది అభిమానుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఫస్టాఫ్ చివరి దశలో పుణె గోల్ చేసింది. చెన్నైతో జరిగిన గత మ్యాచ్ లో ఆటగాళ్లు పేలవ ప్రదర్శన కొనసాగించినా.. పుణె గోల్ కీపర్ బెటె మాత్రం రెండు దఫాలు గోల్స్‌ను అడ్డుకోవడంతోనే మ్యాచ్ డ్రాగా ముగిసింది.

కానీ ప్రారంభ దశలోనే మిలాన్ సింగ్ గోల్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని గోల్ కీపర్ బెటె తిప్పికొట్టడంతో పరిస్థితి తిరగబడింది. పుణె కుర్రాళ్లను నిలువరించేందుకు మాలౌదా మిడిల్ లెఫ్ట్ లో తిష్టవేసినా, మార్సెలిన్హో గోల్ చేసే అవకాశమే చిక్కలేదు. గోల్ కీపర్ బెటె గోల్స్‌ను అడ్డుకుని జట్టును సేవ్ చేయడం మినహా పుణె జట్టు డిఫెన్స్ అంతా కలగాపులగంగా మారింది.

సౌవిక్ చక్రవర్తి 18వ నిమిషంలో పంపిన బంతిని ఢిల్లీ గోల్ కీపర్ రిచర్డ్ గాడ్జే సక్సెస్ ఫుల్‌గా అడ్డుకోగలిగాడు. ఇక రెండో హాఫ్ లోనూ ఆధిక్యం ప్రదర్శించిన ఢిల్లీ కుర్రాళ్లు గోల్ సాధించడంలో చివరి క్షణాల వరకు విఫలమయ్యారు. ఈ దశలో ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా.. బ్రూనో పెలిస్సారీ, చింగ్లేసానా సింగ్ లను సబ్ స్టిట్యూట్లుగా పంపినా మ్యాచ్ డ్రా కోసమే ప్రయత్నించారు తప్ప.. ఆధిక్యం ప్రదర్శించలేకపోయారు.

ఢిల్లీ కుర్రాళ్ల ఆధిపత్యం మధ్య హెడ్డర్ ద్వారా గోల్ సాధించిన టాటూను పుణె సిటీ కోచ్ అంటోనియో హబాస్ అభినందించాడు. చెరో పాయింట్ తో మ్యాచ్ డ్రాగా ముగియడంపై సంత్రుప్తి వ్యక్తంచేశాడు. గోల్ కీపర్ బెటె చురుగ్గా స్పందించడం వల్లే మ్యాచ్‌ ఫలితం డ్రాగా ముగిసిందని పేర్కొన్నాడు.

పుణెలో మ్యాచ్ తర్వాత కనీసం మూడు, నాలుగు రోజుల విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని కానీ.. వెంటనే ఢిల్లీలో జరిగే మ్యాచ్ లో పాల్గొనాల్సి రావడంతో అలసిపోయారన్నాడు. పుణెతో జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసినా తదుపరి మ్యాచ్ లలో నైనా మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలని ఢిల్లీ డైనమోస్ కోచ్ జంబ్రొట్టా వ్యాఖ్యానించాడు.

మ్యాచ్ పై ఆధిపత్యం సాధించినా పుణె తొలి హాఫ్ చివరిక్షణంలో గోల్ తో ఆధిక్యం కనబరిచే సంకేతాలివ్వడంతో ఆందోళనకు గురయ్యాడు. గత మ్యాచ్ తర్వాత పుణెతో జరిగే మ్యాచ్ కోసం తాము చాలా బాగా ప్రిపేర్ అయ్యామని, ఐదారు స్పష్టమైన చాన్స్ లు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు. ఫుట్ బాల్ ఆటలో విజయం సాధించాలంటే కాలం కూడా కలిసి రావాలన్నాడు.

కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ ద్వారా పాయింట్ కోల్పోవడంతో ఓటమిపాలయ్యామని, తొలుత ఆధిపత్యం ప్రదర్శించినా.. డిఫెన్స్ లో కొరవడిన ముందుచూపు వల్ల పుణెతోనూ ఓడిపోవాల్సి వచ్చిందని, ఇటువంటి పరిణామాలు జట్టుకు మంచిది కాదన్నాడు. మిడ్ ఫీల్డర్ గా సౌవిక్ చక్రవర్తి సరైన సమయంలో స్పందించడం లేదని అసంత్రుప్తి వ్యక్తంచేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X