పుట్‌బా‌ల్: లియానెల్ మెస్సీపై రొనాల్డో ఆధిపత్యం ఇలా!!

Posted By:
Cristiano Ronaldo dominates Messi in knockout game goals

హైదరాబాద్: లా లీగా జెయింట్స్ రియల్ మాడ్రిడ్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో అనునిత్యం రికార్డులను నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నాడు. వివిధ టోర్నీల్లో రియల్ మాడ్రిడ్ తరపున ఆడిన క్రిస్టియానో రొనాల్డో గత ఫిబ్రవరి 10వ తేదీన రియల్ సోషిడాడ్ జట్టుతో జరిగిన నాకౌట్ దశలో హ్యాట్రిక్ గోల్స్ సాధించి జట్టును విజయ పథాన నడిపించాడు.

11 మ్యాచ్‌ల్లో 21 గోల్స్

11 మ్యాచ్‌ల్లో 21 గోల్స్

నాటి నుంచి ఇప్పటి వరకు నాకౌట్ దశలో జరిగిన ప్రతి మ్యాచ్‌లో ముగ్ధ మనోహర ద్రుశ్యాలను ఆవిష్కరిస్తూ గోల్ సాధిస్తూ విజయ పరంపర సాగిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 11 గేమ్స్‌ల్లో ఆడిన రొనాల్డో 21 గోల్స్ సాధించి రికార్డు నెలకొల్పాడు. తద్వారా చిరకాల ప్రత్యర్థి బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీపై ఆధిపత్యం ప్రదర్శించాడు.

రియల్ మాడ్రిడ్ జట్టులో అత్యధికంగా 448 వ్యక్తిగత గోల్స్

రియల్ మాడ్రిడ్ జట్టులో అత్యధికంగా 448 వ్యక్తిగత గోల్స్

అనునిత్యం ధైర్య సాహాసాలు ప్రదర్శిస్తూ వ్యక్తిగత గోల్స్ పెంచుకుంటూ రియల్ మాడ్రిడ్ జట్టులో ఇప్పటి వరకు ఆడిన ప్లేయర్ల అందరికంటే ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. రియల్ మాడ్రిడ్ జట్టులో ఆయన చేసిన 448 గోల్స్.. మంచి వ్యక్తిగత రికార్డును నెలకొల్పాయి. ఈ క్రమంలో చాంపియన్స్ లీగ్ నాకౌట్ దశలో క్రిస్టియానో రొనాల్డో ముఖ్య పాత్ర పోషించాడు.

ఇలా రియల్ మాడ్రిడ్ సెమీ ఫైనల్స్‌లో అడుగు

ఇలా రియల్ మాడ్రిడ్ సెమీ ఫైనల్స్‌లో అడుగు

16వ రౌండ్‌లో పారిస్ - సెయింట్ జర్మైన్, టాప్ - 8 బరిలో నిలిచిన జువెంటస్ జట్లపై జరిగిన మ్యాచ్‌ల్లో ఆరుగోల్స్ చేసిన ఘనత క్రిస్టియానో రొనాల్డోదే. చివరిగా రియల్ మాడ్రిడ్ జట్టు ఆడిన మ్యాచ్ ఒకటే ఇబ్బందికర పరిణామం. అయినా చివరి ఐదు నిమిషాల ముందు పెనాల్టీ కార్నర్‌ను అనుకూలంగా మార్చి గోల్ సాధించి జట్టును సెమీ ఫైనల్స్‌లో నిలిపిన నేపథ్యం రొనాల్డోకే దక్కుతుంది.

పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న రొనాల్డో

పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న రొనాల్డో

గత దశాబ్ది కాలంలో క్రిస్టియానో రొనాల్డోతో పోటీగా ఆడుతున్న బార్సిలోనా ఫార్వర్డ్ లియానెల్ మెస్సీ ఇద్దరూ పోటాపోటీగా గోల్స్ సాధించడంలో ముందు ఉంటున్నారు. గ్రూపు దశలో ఇద్దరూ 60 గోల్స్ కొట్టి రికార్డు నెలకొల్పారు. ఒకింత నాకౌట్ దశలో తేడాలున్నా క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో రియల్ మాడ్రిడ్ ప్లేయర్ రొనాల్డో విజయాల రికార్డులు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నాడు. రౌండ్ 16 దశలో లియానెల్ మెస్సీ 24 నుంచి 20 గోల్స్‌కు పడిపోతే.. రొనాల్డో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్ దశలో లియానెల్ మెస్సీ 20 గోల్స్ చేసినా బార్సిలోనా ఇంటిముఖం పట్టింది.

క్వార్టర్ ఫైనల్స్ తర్వాత మెస్సీ, రొనాల్డో మధ్య తగ్గిన గోల్స్ తేడా

క్వార్టర్ ఫైనల్స్ తర్వాత మెస్సీ, రొనాల్డో మధ్య తగ్గిన గోల్స్ తేడా

కానీ రియల్ మాడ్రిడ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మూడు గోల్స్ సాధించి జువెంటస్ జట్టుపై విజయాన్ని వడిసిపట్టాడు. క్వార్టర్ ఫైనల్స్ తర్వాత ఇద్దరు స్టార్ ప్లేయర్ల మధ్య గోల్స్ తేడా 23 నుంచి 10కి తగ్గిపోయింది. 2009లో రియల్ మాడ్రిడ్ జట్టులో చేరినప్పటి నుంచి రొనాల్డో.. తన ప్రత్యర్థి మెస్సీపై సాధించిన ఆధిపత్యం. క్వార్టర్ పైనల్స్ మ్యాచుల్లో మెస్సీ కంటే రెట్టింపు గోల్స్ చేసిన నేపథ్యం రొనాల్డోది. సెమీ ఫైనల్స్ మ్యాచుల్లో రొనాల్డో గోల్స్ మూడు రెట్లు పెరిగాయి. ఉదాహరణకు బార్సిలోనా ప్లేయర్ లియానెల్ మెస్సీ నాలుగు గోల్స్ చేస్తే రొనాల్డో ఖాతాలో 13 గోల్స్ నమోదవ్వడమే గమనార్హం.

120 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా రొనాల్డో

120 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా రొనాల్డో

గతవారం అట్లెంటికో మాడ్రిడ్ జట్టుపై హ్యాట్రిక్ విజయం సాధించిన రొనాల్డో.. గతేడాది గోల్స్ కంటే తక్కువే. ఫైనల్స్ మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి. లియానెల్ మెస్సీ రెండు గోల్స్ చేస్తే క్రిస్టియానో రొనాల్డో నాలుగు గోల్స్ చేశాడు. 2016 ఫైనల్స్‌లో రొనాల్డోను రెండు గోల్స్‌కు మాత్రమే జువెంటస్ పరిమితం చేసింది. అయితే చాంపియన్స్ లీగ్ కాసింత సీరియస్ పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌లో 120 గోల్స్ సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు క్రిస్టియానో రొనాల్డో.

Story first published: Monday, April 16, 2018, 8:32 [IST]
Other articles published on Apr 16, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి