న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రొనాల్డో ఇక యువెంటస్‌ క్లబ్‌కు: ఒప్పందం విలువ రూ. 846 కోట్లు!

By Nageshwara Rao
Cristiano Ronaldo agrees sensational Juventus move from Real Madrid - his statement

హైదరాబాద్: ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌లో మరో అధ్యాయం మొదలైంది. ఈ పోర్చుగల్‌ కెప్టెన్ ఇకపై ఇటలీకి చెందిన ఫుట్‌బాల్‌ క్లబ్‌ యువెంటస్‌కు ఆడనున్నాడు. స్పానిష్‌ లీగ్‌ లా లిగాలో గత తొమ్మిదేళ్లుగా అతడు స్పెయిన్‌కు చెందిన రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.

2009లో మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు

2009లో రికార్డు స్థాయిలో రూ.730 కోట్ల ధరకు మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు తరలివచ్చాడు. ఈ జట్టుకు రొనాల్డో నాలుగు చాంపియన్స్‌ లీగ్‌, రెండు లా లిగా టైటిల్స్‌ను అందించాడు. క్రిస్టియానో రొనాల్డో బదిలీ విషయాన్ని రియల్‌ మాడ్రిడ్‌ అధికారికంగా ప్రకటించింది.

కృతజ్ఞతలు చెప్పిన రియల్ మాడ్రిడ్

ఇన్నాళ్లు తమ క్లబ్‌ తరఫున ఆడినందుకు అతడికి కృతజ్ఞతలు చెప్పింది. ఎంత మొత్తానికి రొనాల్డో బదిలీ అయ్యాడో మాత్రం వెల్లడించలేదు. కొత్త ఒప్పందం ప్రకారం రొనాల్డో నాలుగేళ్లపాటు ఇటాలియన్‌ చాంపియన్స్‌ జువెంటస్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. సీజన్‌కు 3 కోట్ల యూరోలు (రూ. 241 కోట్లు) చొప్పున రొనాల్డోకు వేతనంగా లభిస్తాయని సమాచారం.

ఈ బదిలీ ఒప్పందం విలువ రూ. 846 కోట్లు!

ఒదిలీ ఒప్పందంలో భాగంగా యువెంటస్‌ క్లబ్‌ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్‌ మాడ్రిడ్‌కు చెలిస్తుందని స్పెయిన్‌ మీడియా వెల్లడించింది. తాజా ఒప్పందంపై క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ "మాడ్రిడ్‌కు ఆడిన సమయం నా జీవితంలో అత్యంత సంతోషకరమైనది. జట్టు, అభిమానులు, నగరానికి నా ధన్యవాదాలు" తెలిపాడు.

ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అద్భుత అవకాశాలు: ఇండియాలో 4 కోట్ల ఉద్యోగాలు

బదిలీకి అంగీకరించమని కోరా

"ప్రస్తుతం కొత్త అధ్యాయం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. అందుకే బదిలీకి అంగీకరించమని కోరా. మద్దతుదారులంతా అర్ధం చేసుకోగలరు" అని రొనాల్డో పేర్కొన్నాడు. రొనాల్డో నాయకత్వంలోని రియల్ మాడ్రిడ్ జట్టు ఈ సీజన్‌లో ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, July 11, 2018, 11:51 [IST]
Other articles published on Jul 11, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X