ఆ గోల్ ఎంత పని చేసింది: సెక్సీ కామెంట్లు, జంతువులన్న ప్లేయర్

Aussie Lady Footballer Slams 'Animal' Trolls | Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియా పుట్‌బాల్ క్రీడాకారిణి టేలా హ్యారిస్‌ ఫోటో కింద అసభ్య వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా యూజర్లను ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ పిరికిపందలుగా అభివర్ణించాడు. వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియన్ పుట్‌బాల్ లీగ్ ఉమెన్స్ (ఏఎఫ్‌ఎల్‌డబ్ల్యు)లో భాగంగా కార్ల్‌టన్‌ జట్టు క్రీడాకారిణి టేలా హ్యారిస్ గోల్‌ చేసే ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

తొలి మ్యాచ్‌లో గెలిచేదెవరు?: చిదంబరం స్టేడియంలో ధోనితో ఆప్యాయంగా కోహ్లీ

షార్ట్‌తో ఉన్న ఆమె కుడికాలును నిటారుగా పైకి లేపి గోల్‌ చేస్తున్న ఫొటోను బ్రాడ్‌కాస్టర్‌ ప్రసారుదారైన సెవెన్స్‌ ఏఎఫ్ఎల్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోపై నెటిజన్లు అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతో పాటు టేలా హ్యారిస్‌పై సెక్సీయస్ట్ కామెంట్లు పోస్టు చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారడంతో ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ రంగంలోకి దిగి ట్రోలర్స్‌ను తప్పుపట్టాడు.

ఈ విషయంపై ఆయన మెల్‌బోర్న్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆ సోషల్ మీడియా యూజర్లను పిరికిపందలుగా అభివర్ణించాడు. వారికి ద్వేషాన్ని రెచ్చగోడుతున్నారని, వారికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నాడు. మరోవైపు తనను దూషించిన వారిని టేలా హ్యారిస్‌ జంతువులుగా పేర్కొంది.

ఆ ఫొటోను తన ట్విటర్‌‌లో పోస్టు చేసి "ఈ ఫొటో అనేది నా వృత్తిలో భాగం. చెత్త కామెంట్స్‌ చేసేముందు ఈ విషయాన్ని గమనించండి .. జంతువులారా" అని కామెంట్ పోస్టు చేసింది. దీంతో తప్పును సరిదిద్దుకుంటూ పుట్‌బాల్‌ను ప్రసారం చేస్తోన్న చానెల్‌ సెవెన్‌ వెంటనే ఆ ఫొటోను తొలగించింది.

అయితే సోషల్ మీడియా యూజర్లను విమర్శించకుండా టేలా హ్యారిస్‌ ఫొటోను తొలగించడమేమిటని అంతా ఛానల్ యాజమాన్యంపై ఎదురుదాడికి దిగారు. దీంతో మళ్లీ ఆ ఫొటోను పెట్టి "హ్యారిస్‌ ప్రతిభను హైలైట్‌ చేయడమే మా ఉద్దేశం. ట్రోలర్స్‌ కామెంట్స్‌ వెంటనే తీసేస్తాం" అని అధికారిక ప్రకటన చేసింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

Story first published: Friday, March 22, 2019, 12:42 [IST]
Other articles published on Mar 22, 2019
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X