న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Copa America: చాంపియన్ అర్జెంటీనా.. 28 ఏళ్ల తర్వాత టైటిల్ ముద్దాడిన మెస్సీ సేన!

Copa America: Argentina Beat Brazil 1-0 To Win, End 28-Year Wait

వాషింగ్టన్‌‌: ప్రతిష్టాత్మక కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో అర్జెంటీనా చాంపియన్‌గా నిలిచింది. రియోలోని మారకానా స్టేడియం వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అర్జెంటినా 1-0 తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించింది. అర్జెంటీనా ఆటగాడు ఏజెల్‌ డీ మారియా గోల్‌ చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకున్నది.అదేవిధంగా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ సారథ్యంలో తొలిసారిగా అతిపెద్ద టోర్నీని గెలిచినట్లయింది.

15వ టైటిల్‌తో..

అర్జెంటీనా చివరిసారిగా 1993లో కోపా అమెరికా కప్‌ను గెలుచుకున్నది. మొత్తంగా ఇప్పటివరకు ఆ జట్టు 15 సార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో కోపా అమెరికా టోర్నీలో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఉరుగ్వే టీమ్ సరసన నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకూ 15 సార్లు ఈ టోర్నీలో గెలుపొందింది. కాగా, కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌, అర్జెంటీనా తలపడడం ఇది మూడోసారి. 1937లో తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. అప్పుడు కూడా అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత రెండు సార్లు (2004, 2007) బ్రెజిల్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నది. ఇప్పటి వరకూ అర్జెంటీనా, బ్రెజిల్‌ 112 మ్యాచ్‌ల్లో తలపడగా.. బ్రెజిల్‌ 46 మ్యాచ్‌లు, అర్జెంటీనా 41 మ్యాచ్‌ల చొప్పున గెలుపొందాయి. ఈ విజయంతో అర్జెంటీనా అభిమానుల సంబరాలు

హోరా హోరీగా..

దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్‌లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్‌..అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువ జామున రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు ఏజెల్‌ డీ మారియా చేసిన గోల్‌ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఇరు జట్లు హోరా హోరీగా తలపడటంతో ఫస్టాఫ్ మరో గోల్ లేకుండా 1-0తో ముగిసింది. అనంతరం మరింత కట్టుదిట్టంగా కదిలిని అర్జెంటీనా ఆటగాళ్లు బ్రెజిల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా విజయాన్నందుకున్నారు.

 కన్నీటీ పర్యంతమైన మెస్సీ-నెయ్‌మర్..

కన్నీటీ పర్యంతమైన మెస్సీ-నెయ్‌మర్..

ఓవైపు ఓటమి భారంతో బ్రెజిల్‌ స్టార్‌ ప్లేయర్‌ నెయ్‌మర్‌ దా సిల్వ శాంటోస్‌ కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. మరోవైపు తన నేతృత్వంలో అర్జెంటీనా తొలి కప్పు సాధించడంతో లియోనల్ మెస్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకున్నారు. తన ప్రొఫెషనల్‌ క్లబ్‌ కెరీర్‌లో 34 టైటిల్స్‌ నెగ్గిన మెస్సీ.. అర్జెంటీనా తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క మేజర్‌ టైటిల్‌ గెలవలేకపోయాడు. తాజా విక్టరీతో అతనికి ఆ లోటు తీరినట్లయ్యింది. ఆట ముగిశాక.. బ్రెజిల్‌-అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో కూర్చుని సరదాగా గడపడం ఆకట్టుకుంది. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Story first published: Sunday, July 11, 2021, 10:05 [IST]
Other articles published on Jul 11, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X