ఇండియన్ సూపర్ లీగ్‌కే హీరో సునీల్ చెత్రి, గోల్డెన్ బూట్ అందుకున్న కొరొమినోస్

Posted By:
 Chhetri named Hero of ISL, Corominas wins Golden Boot

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా జరిగిన ఫుట్ బాల్ పోటీల్లో బెంగుళూరు జట్టు కెప్టెన్ సునీల్ చెత్రిని మొత్తం లీగ్ కే హీరో అంటూ అభివర్ణిస్తారు లీగ్ నిర్వహకులు. చెన్నైయిన్ ఎఫ్‌సీ శనివారం జరిగిన పోటీలో బెంగుళూరు ఎఫ్‌సీపై 3-2తేడాతో గెలుపొందింది. దీంతో లీగ్ మొత్తానికి బెంగుళూరు జట్టు రన్నరప్ గా నిలిచింది.

జట్టును లీగ్ మొత్తంలో సునీల్ ఛెత్రి పాత్రను పోలుస్తూ అతనిపై అందరూ మంచి కితాబునిచ్చారు. ఆడిన ఆటగాళ్లందరిలో 14గోల్ లలను చేసిన ఒకే ఆటగాడు సునీల్ కావడం గమనార్హం. విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొన్న లీగ్‌లో అందరి ఆటగాళ్లతో పోలిస్తే చెత్రి మూడో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో ఫెర్రన్ కొమినోస్ (18 గోల్స్), ఎఫ్‌సీ గోవా జట్టుకే చెందిన మికూ (15) గోల్స్ చేశారు. కాగా, ఇందుకు గాను అత్యధిక గోల్స్ చేశాడని కొరొమినొస్‌కు గోల్డన్ బూట్ ను ప్రదానం చేశారు.

వీరితో పాటు భారత ఆటగాళ్లైన ఉదంతా సింగ్, ఆషిఖ్ కురునియన్, సర్తాక్ గోలు, హితేశ్ శర్మ, జితేందర్ నేగీ, ప్రంజల్ భుమీ, బారింగ్‌దావో బోడొ అద్భుతమైన ప్రదర్శన చేసి అదరగొట్టారు. వీరందరి కంటే భిన్నంగా ప్రదర్శన చేసినందుకుగాను కేరళ బ్లాక్ బ్లాస్టర్ ఎఫ్‌సీ మిజో డిఫెండర్ లారుత్తారా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు గెలచుకున్నాడు.

ఐజ్వాల్ ఎఫ్‌సీ జట్టు మాజీ ఆటగాడైన లారుత్తారా కేబీఎఫ్‌సీ 18 ఆటలకు 17లో ఆడి లీగ్ అవార్డు గెలుచుకున్నాడు. మణిపూర్ ఫార్వార్డ్ ప్లేయర్ ఉదంతా డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ద లీగ్ అవార్డు గెలుచుకున్నాడు. వారి స్థాయిలో ఉత్తమమైన ప్రదర్శన చేసినప్పటికీ వారెవ్వరూ భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు వహించిన సునీల్ చెత్రి గోల్స్‌కు సరికాలేదు.

ఇదే క్రమంలో ఎఫ్‌సీ గోవా జట్టుకు చెందిన ఫెర్రన్ కొరొమినోస్ కే గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది. ఇంకా గోల్డెన్ గ్లోవ్ అవార్డు జంషెడ్ పూర్ ఎఫ్‌సీ సుబ్రతా పాల్‌కి చేరువైంది. మొత్తం 18మ్యాచ్‌లలో 44 గోల్స్ ను పడకుండా ఆపినందుకుగాను అతనికి ఈ అవార్డు సొంతమైంది.

Story first published: Thursday, April 12, 2018, 17:49 [IST]
Other articles published on Apr 12, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి