రికార్డుల సునామీ ‘లియానెల్ మెస్సీ’.. 40 హ్యాట్రిక్ గోల్స్‌తో చరిత్ర

Posted By:
 Breaking down Messis incredible 40 hat-tricks

బార్సిలోనా: లా లీగా టోర్నీలో లియానెల్ మెస్సీ స్టార్ ప్లేయర్. జట్టులో కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా 40 హ్యాట్రిక్స్ గోల్స్ సాధించి రికార్డు నెలకొల్పాడు. శనివారం లెగానెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆయన సాధించిన హ్యాట్రిక్ గోల్ 40వది. తద్వారా లా లీగా టోర్నీలో బార్సిలోనా జట్టును ఇతర జట్ట కంటే 12 పాయింట్ల ఎగువన నిలిపింది.

 వరుసగా 38 గేమ్స్ లో బార్సిలోనా ఇలా అజేయం:

వరుసగా 38 గేమ్స్ లో బార్సిలోనా ఇలా అజేయం:

మరోవైపు వరుసగా 14 సీజన్లలో ఆడిన లియానెల్ మెస్సీ 629 గేమ్స్‌ల్లో 546 గోల్స్ చేశాడు. ఒక్కో మ్యాచ్‌కు సగటున 0.86 గోల్స్ సాధించాడు. స్పానిష్ లీగ్ టోర్నీలో బార్సిలోనా వరుసగా 38 మ్యాచ్‌లలో అజేయంగా నిలిచిందంటే అందులో మెస్సీ పాత్ర కూడా అంతే కీలకం.

2007లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ ఇలా ప్రారంభం:

2007లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ ఇలా ప్రారంభం:

తనతో పాటు ఇతర ఆటగాళ్లు 210 గోల్స్ చేయడంలో చేయూతనిచ్చాడు. 30 టైటిళ్లను జట్టు ఖాతాలో చేర్చిన లియానెల్ మెస్సీ.. 446 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. మున్ముందు మరిన్నీ హ్యాట్రిక్ గోల్స్ సాధించగలడని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2007 మార్చి 10వ తేదీన క్లాసికోలో రియల్ మాడ్రిడ్ జట్టుపై క్యాంప్ నౌ వద్ద జరిగిన మ్యాచ్‌లో తొలిసారి హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డులు ప్రారంభించాడు.

ఛాంపియన్స్ లీగ్‌లో ఏడు, కొపా డెల్ రేలో మూడు హ్యాట్రిక్ గోల్స్:

ఛాంపియన్స్ లీగ్‌లో ఏడు, కొపా డెల్ రేలో మూడు హ్యాట్రిక్ గోల్స్:

నాటి నుంచి ఇప్పటి వరకు లా లీగా టోర్నీలోనే అత్యధికంగా 29 హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఛాంపియన్స్ లీగ్ టోర్నీలో ఏడు, కొపా డెల్ రేలో మూడు, స్పానిష్ సూపర్ కప్ టోర్నీలో ఒక హ్యాట్రిక్ గోల్ నెలకొల్పాడు. లియానెల్ మెస్సీ సాధించిన ఈ 40 గోల్స్‌లో ఐదు గోల్స్ బేయర్ లివర్కుసెన్ (7 - 1)పై సాధించినవే. వాలెంసియా, ఇస్పాంయోల్, ఒసాసునా, ఇబార్, ఆర్సెనల్ జట్లపై నాలుగేసి హ్యాట్రిక్ గోల్స్ సాధించి జట్టును ముందుకు తీసుకెళ్లిన నేపథ్యం లియానెల్ మెస్సీది.

 లెగావెస్ అత్యధికంగా మెస్సీ చేతిలో విలవిల:

లెగావెస్ అత్యధికంగా మెస్సీ చేతిలో విలవిల:

మెస్టాల్లాలో వాలెంసియా జట్టుపై 2013 సెప్టెంబర్ ఒకటో తేదీన జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్ సాధించే వరకు బార్సిలోనా జట్టు, యాజమాన్యం ఎదురుచూడాల్సి వచ్చింది. 2007 నుంచి 2013 వరకు ఆయన సాధించిన ఎనిమిది హ్యాట్రిక్ గోల్స్‌ల్లో ఇదొకటి. అంతే కాదు రెండు సార్లు నాలుగు గోల్స్, ఆరుసార్లు మూడు గోల్స్ కూడా చేశాడు మెస్సీ. కానీ లెగానెస్ మాత్రం మెస్సీ 25వ హ్యాట్రిక్ గోల్స్‌తో విలవిలలాడింది. లియానెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ సాధించిన జట్లలలో వాలెంసియా నాలుగో టీం. కాగా, 2011 - 12 సీజన్‌లో ఆయన సాధించిన 73 గోల్స్.. లియానెల్ మెస్సీ కెరీర్ లో అత్యుత్తమమైనవి.

13 మ్యాచ్‌ల్లో మాత్రమే బార్సిలోనా ఓటమి:

13 మ్యాచ్‌ల్లో మాత్రమే బార్సిలోనా ఓటమి:

లా లీగా టోర్నీలో ఒక నానుడి బలంగా వినిపిస్తుంది. అది మెస్సీ స్కోర్ సాధించాడంటే జట్టు తప్పక విజయం సాధిస్తుందని, మ్యాచ్ విజయ శాతం 86.7 % కాగా, 33 మ్యాచ్‌ల్లో ఫలితం డ్రా గా ముగిసింది. కేవలం 13 మ్యాచ్‌ల్లో మాత్రమే బార్సిలోనా ఓటమి పాలైంది.

 నేటికి అజేయంగా బార్సిలోనా పయనం:

నేటికి అజేయంగా బార్సిలోనా పయనం:

ఇక గతేడాది ఏప్రిల్ ఎనిమిదో తేదీన లీగ్ సీజన్ ప్రారంభంలో మలాగా జట్టుపై 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించిన బార్సిలోనా ఇప్పటి వరకు ఎదురులేని టీంగా నిలిచింది. 1979 - 80 మధ్య రియల్ సోషిడాడ్ జట్టును డీకొట్టిన వారే లేరు. ఇక చాంపియన్స్ లీగ్‌లో ఎర్నెస్టో వాల్వెర్డె కూడా అజేయంగా నిలిచిన జట్టే. ప్రస్తుతం లా లీగా టోర్నీలో కాటలాన్స్ 31 మ్యాచ్‌ల్లో 79 పాయింట్లు సాధించి ఇతర జట్ల కంటే 12 పాయింట్ల ఎగువన నిలిచింది. అట్లెంటికో మాడ్రిడ్ రెండో స్థానంలో ఉన్నది. తర్వాతీ స్థానాల్లో వాలెంసియా, రియల్ మాడ్రిడ్ నిలిచాయి.

Story first published: Tuesday, April 10, 2018, 16:18 [IST]
Other articles published on Apr 10, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి