బార్సిలోనాకు ‘లా లీగా’ టైటిల్ లాంఛనమేనా?

Posted By:
Barca on course to win seventh title in 10 years

హైదరాబాద్: లా లీగ టోర్నీ దాదాపు ముగింపు దశకు చేరుకున్నది. ఆదివారం రియల్ మాడ్రిడ్, అట్లెంటికో మాడ్రిడ్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బార్సిలోనా జట్టు టైటిల్ గెలుచుకోవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోతుంది. మాడ్రిడ్ జట్ల మాదిరిగానే బార్సిలోనా కూడా చివరిదశలో లెగానస్ జట్టుతో జరిగిన మ్యాచ్‪లో 3 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

మరోవైపు అట్లెంటికో మాడ్రిడ్, రియల్ మాడ్రిడ్ జట్లు చెరో గోల్ చేసి డ్రా గా ముగించాయి. పాయింట్ల పట్టికలో బార్సిలోనా తర్వాత స్థానంలో నిలిచిన అట్లెంటికో మాడ్రిడ్ జట్టుతోనే మెస్సీ టీం పోటీ పడనున్నది.

11 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న బార్సిలోనా..

11 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న బార్సిలోనా..

అట్లెంటికా మాడ్రిడ్ జట్టు కంటే 11 పాయింట్లు ఆధిక్యం కలిగి ఉన్న బార్సిలోనా.. ఫైనల్స్ మ్యాచ్‌లో గెలుపొందితే పదేళ్లలో ఏడో టైటిల్ కానున్నది. ఫ్రాంక్ రిజ్ కార్డ్ వైదొలిగిన తర్వాత పెప్ గౌర్డియాలా సారథ్యంలో 2009లో కేటాలియన్ (బార్సిలోనా) విప్లవాత్మక ఆట తీరు కనబరిచి తొలిసారి లా లీగా టైటిల్ గెలుచుకున్నది. తదుపరి మిగిలిన మ్యాచ్‌ల్లో బార్సిలోనా గెలుపొందాల్సిన అవసరం ఉన్నదని డియాగో సిమ్మోన్స్ సూచిస్తున్నారు. మాడ్రిడ్ జట్ల మధ్య పోటాపోటీగా మ్యాచ్ సాగిన నేపథ్యంలో బార్సిలోనా 10 పాయింట్లు ఆధిక్యంలో ఉండాల్సి ఉంటుంది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా రియల్ మాడ్రిడ్ కోచ్

డిఫెండింగ్ ఛాంపియన్‌గా రియల్ మాడ్రిడ్ కోచ్

ఇప్పటికే లా లీxe టైటిల్ విజేతగా బార్సిలోనా నిలుస్తుందని ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ తమ చిరకాల ప్రత్యర్థి జట్టు మాడ్రిడ్‌పై విజయం సాధించాల్సిన పరిస్థితులు బార్సిలోనాకు ఉన్నాయి. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్‌గా రియల్ మాడ్రిడ్ కోచ్ కం మేనేజర్ జినెడిన్ జిడానె.. బార్సిలోనాకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

 లీగ్ ఎలిమినేషన్ దశలో మాంచెస్టర్

లీగ్ ఎలిమినేషన్ దశలో మాంచెస్టర్

2008లో చాంపియన్స్ లీగ్ ఎలిమినేషన్ దశలో మాంచెస్టర్ యునైటెడ్ వైదొలగాల్సిన పరిస్థితుల్లో దాని వారసత్వం అందుకున్న దానిలా బార్సిలోనా నిలిచింది. క్యాంప్ నౌలో జరిగే ఫైనల్స్ మ్యాచ్‌లో బార్సిలోనా స్టార్ ఫ్లేయర్ లియానెల్ మెస్సీ తనకంటూ ఒక చరిత్ర సృష్టిస్తారని ప్రముఖుల అంచనా. అలాంటిది కేవలం టైటిల్ గెలుచుకోవడం అనేది చాలా చిన్న విషయమని అంటున్నారు. అజేయంగా లా లీగా టోర్నీలో చివరి వరకు నిలబడటమే ఒక చరిత్ర అని విశ్లేషకుల అంచనా.

బార్సిలోనా చేరే ప్రసక్తే లేదన్న ఆంటోనియో గ్రైజ్మన్

బార్సిలోనా చేరే ప్రసక్తే లేదన్న ఆంటోనియో గ్రైజ్మన్

బార్సిలోనాలో చేరనున్నట్లు వచ్చిన వార్తలను అట్లెంటికో మాడ్రిడ్ ఆటగాడు ఆంటోనీ గ్రైజ్మన్ తోసిపుచ్చారు. ఇప్పటికే బార్సిలోనా యాజమాన్యానికి, ఆయనకు మధ్య ఒప్పందం కూడా కుదిరిందన్న వార్తలను తోసిపుచ్చారు. ఇటువంటి పుకార్లు ఎక్కడ నుంచి వస్తాయో తనకు అర్థం కావడం లేదన్నారు. కానీ ఇవన్నీ తప్పుడు వార్తలని తేల్చేశారు. వచ్చే లా లీగ టోర్నీలో ఆడేందుకు ముందు రష్యాలో జరిగే ఫిఫా ప్రపంచ కప్ టోర్నీలో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

Story first published: Tuesday, April 10, 2018, 15:31 [IST]
Other articles published on Apr 10, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి