న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రియల్ మాడ్రిడ్‌తో అట్లెటికో చివరి మ్యాచ్ నేడే

లా లీగ ‘జెయింట్స్’ రియల్ మాడ్రిడ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయంతో రెండు జట్ల మధ్య అంతరాయం తగ్గనుంది.

By Nageshwara Rao

మాడ్రిడ్: ప్రస్తుత సీజన్ లా లీగ స్పానిష్ ఫుట్ బాల్ టోర్నీలో రియల్ మాడ్రిడ్ జట్టుకు అట్లెటికో మాడ్రిడ్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే చివరిసారి కానున్నది. శనివారం రెండు జట్లు తలపడనున్నాయి. మూడేళ్ల క్రితం చాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌లో అట్లెటికో మాడ్రిడ్ ఓటమే రెండు జట్లు పోటీ పడటం ఇదే తొలిసారి.

ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర గాయాలతో బాధపడుతూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి అట్లెటికో మాడ్రిడ్ టాప్ స్కోరర్ అంటోనై గ్రైజ్మన్, రియల్ మాడ్రిడ్ సారధి సెర్జియో రామోస్ గాయాలతో సతమతం అవుతున్నారు.

Atletico Madrid Seek Real Madrid Revenge in Last Calderon Derby

'అక్కడ కొన్ని భయాలు ఉన్నాయి. మేమెప్పుడు వాటిని మర్చిపోం' అని అట్లెటికో మాడ్రిడ్ సారధి కబి వ్యాఖ్యానించాడు. రెండు జట్ల మధ్య తీవ్రమైన బాధాకర తీపిగుర్తులు ఉన్న మాట నిజమైగానీ, అట్లెటికో మాడ్రిడ్ అభిమానుల ద్రుష్టితో పరిశీలిస్తే రియల్ మాడ్రిడ్ జట్టుపై ఆడటం చాలా కష్టంగా ఉంటుందన్నాడు.

గత మేలో చివరిసారి తలపడ్డ ఈ రెండు జట్లలో అట్లెటికో మాడ్రిడ్ పూర్తిగా నిరాశాజనక పరిస్థితిలో ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన రియల్ మాడ్రిడ్ కంటే ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్న రియల్ మాడ్రిడ్‌పై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని అట్లెటికో మాడ్రిడ్ తలంచడానికి కారణాలు పుష్కలమే. కాల్డెరోన్ స్టేడియంకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా నూతనంగా నిర్మించిన లా పైనెటా స్టేడియంకు తరలి వెళతారు.

మూడు మ్యాచ్‌లలో రెండు పరాజయాల నేపథ్యంలో మళ్లీ గెలుపొంది పూర్వ వైభవం సాధించేందుకే తమ పోరాటం కొనసాగుతుందన్నాడు. కాల్డ్రోన్ స్టేడియంలో ఇది చివరి మ్యాచ్ కావడంతో ఇరు జట్ల మధ్య చాలా ఆసక్తి నెలకొన్నదని, ఇది ప్రత్యేక పరిస్థితిని తెలియజేస్తుందన్నాడు.

అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్న ఫ్రాన్స్ కుర్రాడు గ్రైజ్మనన్ ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది.ఇక రియల్ మాడ్రిడ్ జట్టులోనూ తీవ్రంగా గాయపడిన టోనీ క్రూస్, క్యాసెమిరో, అల్వారో మోర్టాటా మ్యాచ్ లో పాల్గొనే అవకాశాలే లేవు. మోకాలి కండరాలు పట్టేసినప్పటి నుంచి నెలరోజులుగా రామోస్ మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నాడు.

కానీ తన సెంట్రల్ డిఫెన్సివ్ భాగస్వామి పెపెతో కలిసి తిరిగి బరిలోకి దిగే అవకాశాలపై ద్రుష్టిని కేంద్రీకరించాడు.పెపె ఆడటం కూడా అనుమానమే. రియల్ మాడ్రిడ్ జట్టుకు లుకా మోడ్రిక్ ఫిట్‌గా ఉన్నాడు.

చాన్స్ కోసం బార్సిలోనా యత్నం
బార్సిలోనా, మాలాగా జట్ల మధ్య కూడా క్యాంప్ నౌలో శనివారం మరో మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ లో విజయం ద్వారా బార్సిలోనా టాప్ స్థానానికి దూసుకెళ్లాలని తలపోస్తున్నది. గతనెలలో డెపోర్టివో లా కొరునా దెబ్బతో 4 - 0 స్కోర్ తేడాతో దెబ్బతిన్న బార్సిలోనా తన పేలవ ప్రదర్శనను రిజర్వుచేసుకున్నది. లూయిస్ సౌరేజ్ సస్పెండ్ అయ్యాడు.

వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల కోసం అర్జెంటీనా, బ్రెజిల్ తరఫున ఆడిన లియానెల్ మెస్సీ, నేయ్మార్ తిరిగి జట్టులో చేరారు. సౌరేజ్ గైర్హాజరీలో పాకో అల్సాసర్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత ఆగస్టులో వాలెంసియా నుంచి బార్సిలోనా జట్టులో అల్సాసర్ చేరాడు. గేరార్డ్ పీక్యూ, జోర్డీ అల్బా గాయాల భారీ నుంచి బయటపడి జట్టులోకి రావడం బార్సిలోనాకు సానుకూల అంశమే.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X