న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

భారత ఫుట్‌బాల్ కోచెస్‌ అసోసియేషన్ ఏర్పాటు

Association for Indian football coaches established

హైదరాబాద్: భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడ దినదినాభివృద్ధి జరుగుతూ కొత్త పరిణామాలకు తెరలేపుతోంది. క్రీడాభివృద్ధి కోసం దోహదపడే అంశాల్లో ప్రధానమైన కోచ్‌ల కోసం ఓ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ కోచెస్(ఏఐఎఫ్ఎఫ్) అసోసియేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంఘం కేవలం కోచ్‌లు, జట్టు మేనేజర్‌ల కోసం మాత్రమే.

మేము కోచెస్‌కు సాయపడాలనే ఉద్దేశ్యంతోనే ఏఐఎఫ్ఎఫ్‌ను ఏర్పాటు చేసినట్లు సంఘంలోని ఒక డైరక్టర్ అయిన దినేశ్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇతను ఆసియన్ ఫుట్‌బాల్ సమాఖ్యలోని (ఏఎఫ్‌సీ) ఏ-లైసెన్స్‌ను కలిగిన వ్యక్తి కూడా.. కోచ్‌లకు కావలసిన శిక్షణ, లైసెన్స్, టోర్నమెంట్ వివరాలను ఈ సంఘం పర్యవేక్షిస్తుంది.

ఇండియన్ సూపర్ లీగ్‌లోని యూత్ అండ్ గ్రాస్‌రూట్స్ డెవలప్‌మెంట్ వింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయర్ ఈ విషయమై ఇలా స్పందించారు. 'ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలి. 2014వ సంవత్సరంలో భారత్‌లో 1,200మంది ఫుట్‌బాల్ కోచ్‌లు ఉండేవాళ్లు. ప్రస్తుతం 6,500 మంది వరకు కోచ్‌లు ఉన్నారు. మూడేళ్లలోనే కోచ్‌ల సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని మరో ఐదేళ్లలో 65,000 అయ్యే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంఘానికి సంబంధించిన బోర్డు సభ్యులు నాయర్‌తో పాటుగా భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఐఎమ్ విజయన్, అంతర్జాతీయ క్రీడాకారుడు డెర్రిక్ పెరీరా, సంజోయ్ సేన్, తంగ్‌బోయ్ సింటోలు ఉన్నారు. స్పోర్టింగ్ లయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ ఏఐఎఫ్ఎఫ్ ఏర్పాటు జరిగింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 17:24 [IST]
Other articles published on Dec 27, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X