లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనలిసిమాలో యూరోపియన్ ఛాంపియన్స్ ఇటలీపై కోపా అమెరికా ఛాంపియన్స్ అయిన అర్జెంటీనా 3-0తో విజయం సాధించి.. కప్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మెస్సీ తోడుగా, లౌటారో మార్టినెజ్, ఏంజెల్ డి మారియా చేసిన స్ట్రైక్‌లతో గోల్స్ దక్కాయి. దీంతో అర్జెంటీనా మొదటి అర్ధభాగంలో రెండు గోల్స్‌తో ఇటలీపై ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పాలో డైబాలా అర్జెంటీనాకు రెండో అర్ధభాగంలో గోల్ కొట్టడంతో అర్జెంటీనా విజయం లాంఛనమైంది. ఇకపోతే పారిస్ సెయింట్-జర్మన్ టోర్నీలో నిరాశపరిచిన తర్వాత మెస్సీ మళ్లీ తన అత్యున్నత ప్రదర్శన పుంజుకున్నాడు. ఫైనలిస్సిమాలో వేగంగా బంతిని తన కంట్రోల్లోకి తెచ్చుకుని గోల్స్ వచ్చేలా చేశాడు. మ్యాచ్ ముగింపు విజిల్ తర్వాత మెస్సీ గాల్లోకి ఎగిరి విజయోత్సవాన్ని జరుపుకున్నాడు.
Argentina have not lost a match in three years 🤯 pic.twitter.com/n3jeIx9tQf
— B/R Football (@brfootball) June 1, 2022
మెస్సీ మాట్లాడుతూ.. 'ఈరోజు ఇటలీ లాంటి గొప్ప జట్టు మీద గెలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది ఒక మంచి పరీక్ష. మేం ఛాంపియన్‌గా నిలిచేందుకు మార్గం సెట్ చేస్తుంది' అని పేర్కొన్నాడు. ఉంటుందని మాకు తెలుసు. ఇక 28ఏళ్ల నిరీక్షన తర్వాత 2021లో కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా గెలుచుకున్న సంగతి తెలిసిందే. తద్వారా అర్జెంటీనా ఈ ఏడాది ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. యూరోపియన్ కప్ విజేత ఇటలీని ఓడించడం ద్వారా.. రానున్న వరల్డ్ కప్ కోసం తాము ప్రధాన పోటీదారులుగా ఉంటామనే సంకేతాలను అర్జెంటీనా ఇచ్చింది.
July 2021 ➡️ June 2022 pic.twitter.com/hxxiqmDxe6
— B/R Football (@brfootball) June 1, 2022
ఇకపోతే ఖతార్‌లో జరగబోయే ఫుట్ బాల్ వరల్డ్ కప్‌లో మెస్సీ ఈ స్థాయిలో ఆడగలిగితే.. 1986తర్వాత మళ్లీ ఆ జట్టు ప్రపంచకప్ ముద్దాడే అవకాశముంటుంది. ఫైనలిస్సిమా అంటే.. యూరోపియన్ ఛాంపియన్, కోపా అమెరికా కప్ ఛాంపియన్ మధ్య జరిగే మ్యాచ్. ఈసారి యూరోపియన్ ఛాంపియన్ ఇటలీ, కోపా అమెరికా కప్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనలిసిమాలో తలపడ్డాయి. ఇక అర్జెంటీనా గెలవడంతో.. యూరప్, సౌత్ అమెరికాలో ది బెస్ట్ టీంగా అర్జెంటీనా నిలిచినట్లయింది.