న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

20 ఏళ్ల పాటు నిషేధం: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ

By Nageshwara Rao
Zimbabwean official receives 20-year ICC ban for match-fixing attempt


హైదరాబాద్: మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే కెప్టెన్ గ్రీమ్ క్రీమర్‌ను ఫిక్సింగ్ వైపు ప్రోత్సహించిన కేసులో హరారే మెట్రోపాలిటన్ క్రికెట్ అసోసియేషన్ అధికారి రాజన్ నాయర్‌పై 20 ఏళ్ల పాటు నిషేధం విధించింది.

హరారే మెట్రో పాలిటన్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న రాజన్ నాయర్ తాజా ఉత్తర్వులు ప్రకారం క్రికెట్‌కి సంబంధించిన ఏ ఫార్మాట్‌లోనూ పాల్గొనకుండా చేసింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఫిక్స్ చేస్తే 30 వేల డాలర్లు వచ్చేలా చేస్తానంటూ గతేడాది కెప్టెన్ క్రీమర్‌కు రాజన్ ఆశచూపాడు

వెంటనే ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి క్రీమర్ తీసుకువెళ్లాడు. దీంతో దీనిపై దర్యాప్తు ప్రారంభంచిన ఐసీసీ చెందిన యాంటీ కరప్షన్ యూనిట్ ఓ నివేదిక రూపొందించింది. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ ఆర్టికల్ 2.11 నిబంధనను రాజన్ నాయర్ ఉల్లంఘించినట్లు విచారణలో అంగీకరించాడు.

దీంతో మంగళవారం ఐసీసీ తుది ప్రకటన చేసింది. ఈ సందర్భంగా క్రీమర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా క్రీమర్ మాట్లాడుతూ మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలనుకునే వారికి ఇదొక సందేశంగా వెళుతుందని, అందుకే ఇలా చేశానని తెలిపాడు.

Story first published: Tuesday, March 27, 2018, 18:01 [IST]
Other articles published on Mar 27, 2018
Read in English: ICC bans Harare official
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X