న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫేర్‌వెల్ మ్యాచ్‌లో ఆల్ టైమ్ టీ20 రికార్డు నెలకొల్పాడు

Zimbabwe’s Hamilton Masakadza breaks all-time T20I record in his farewell international game

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ తన పేరిట టీ20ల్లో రికార్డుని నెలకొల్పాడు జింబాబ్వే జట్టు కెప్టెన్ హామిల్టన్ మసకద్జ. శుక్రవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మసకద్జ 42 బంతుల్లో 71 పరుగులు చేయడంతో పాటు తన ఖాతాలో అరుదైన రికార్డుని నెలకొల్పాడు.

టీ20 క్రికెట్‌లో ఓ ఆటగాడి ఫేర్‌వెల్ మ్యాచ్‌‌లో హామిల్టన్ మసకద్జ సాధించిన 71 పరుగులకే ఇప్పటివరకు అత్యధికం కావడం విశేషం. అంతేకాదు ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో టి20ల్లో ఆప్ఘన్ 12 వరుస విజయాల ఆల్‌ టైమ్‌ రికార్డుకు బ్రేక్ పడింది.

ధోని భార్య సాక్షికి ఎంత కష్టమొచ్చిందో తెలుసా!ధోని భార్య సాక్షికి ఎంత కష్టమొచ్చిందో తెలుసా!

రహ్మానుల్లా గుర్బాజ్‌ హాఫ్ సెంచరీ

రహ్మానుల్లా గుర్బాజ్‌ హాఫ్ సెంచరీ

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్‌ 47 బంతుల్లో 61(4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించగా.. హజ్రతుల్లా జజాయ్‌ (31) ఫరవాలేదనిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

156 పరుగుల విజయ లక్ష్యంతో

156 పరుగుల విజయ లక్ష్యంతో

అనంతరం 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టులో కెప్టెన్ మసకద్జ 42 బంతుల్లో 71(4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో జింబాబ్వే 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో మసకద్జ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

జర్దాన్ బౌలింగ్‌లో ఔట్

జర్దాన్ బౌలింగ్‌లో ఔట్

మసకద్జ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. దూకుడుగా ఆడే క్రమంలో 13వ ఓవర్‌లో జర్దాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తన కెరీర్‌ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో మసకద్జ అద్భుతమైన రికార్డుని తన ఖాతాలో వేసుకుని వీడ్కోలు పలకడంతో మ్యాచ్ అనంతరం ఆప్ఘన్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, నబీలు అతడిని అభినందించారు.

జింబాబ్వే జట్టుకు చిరస్మరణీయ విజయం

జింబాబ్వే జట్టుకు చిరస్మరణీయ విజయం

జింబాబ్వే జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించి తన వీడ్కోలుకు ఘనమైన ముగింపు పలికిన మసకద్జపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, జింబాబ్వే తరుపున మొత్తం 66 ఇన్నింగ్స్‌లు ఆడిన మసకద్జ 25.96 యావరేజితో 1,662 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Saturday, September 21, 2019, 12:09 [IST]
Other articles published on Sep 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X