న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జహీర్ కాస్త బరువు తగ్గు.. హ్యపీ బర్త్ డే

Zaheer Khan Turns 40: Birthday Wishes Pour In For Indias Finest Pacer

న్యూ ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్లలో వీరేందర్ సెహ్వాగ్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తూనే తాను చెప్పాలనుకున్నదాన్ని వైవిధ్యంగా పోస్టు చేస్తూ ఉంటారు. కానీ, జహీర్‌ఖాన్ పుట్టినరోజుని మాత్రం చాలా మామూలుగా చెప్పేశారు. కానీ, టీమిండియా మాజీ కెప్టెన్ ఆ బాధ్యత తీసుకున్నారో ఏమో..! కాస్త బరువు తగ్గు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఆదివారంతో 40వ ఏట అడుగుపెట్టిన టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌కు అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తమ విషెస్‌ను తెలియజేశారు. 'హ్యాపీ బర్త్‌డే జహీర్‌.. నీకు ఈ ఏడాది మంచి జరగాలి. దయచేసి కొంచెం బరువు తగ్గవు.. నీవు భారత బలం' అని చమత్కరిస్తూ విషెస్‌ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సెహ్వాగ్ ఏమో.. 'ఎవరి బౌలింగ్‌తోనైతే చాలా వికెట్లు చిత్తు చేశాడో ఆ వ్యక్తికి హ్యాపీ బర్త్ డే. హేవ్ ఏ గ్రేట్ లైఫ్ గ్యాన్ బాబా' అంటూ జహీర్ ఖాన్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశాడు.

ఇక జహీర్‌ గంగూలీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో 36 టెస్టులు, 88 వన్డేలతో మొత్తం 124 మ్యాచ్‌లాడిన జహీర్‌ 232 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్‌ స్వింగ్‌ బౌలరైన జహీర్‌.. 2000లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో అదరగొట్టాడు.

స్వింగ్‌తో తన బౌలింగ్‌ వైవిధ్యాన్ని చాటుకున్నాడు. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరినప్పటికి న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైంది. మొత్తం కెరీర్‌లో 200 వన్డేలు, 92 టెస్టులు, 17 టీ20లాడిన జహీర్‌ వన్డేల్లో 282, టెస్టుల్లో 311, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లలో జహీర్‌ నాలుగోవాడు. అతని కన్నా ముందు అనిల్‌ కుంబ్లే, శ్రీనాథ్‌, అజిత్‌ అగార్కర్‌లున్నారు. ఇక జహీర్‌కు తన టీమ్‌మెట్స్‌ సెహ్వాగ్‌, లక్ష్మణ్‌, భజ్జీ, ఆర్పీసింగ్‌, కైఫ్‌లు సైతం విషెస్‌ తెలిపారు.

Story first published: Monday, October 8, 2018, 11:02 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X