న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే టీవీ వదిలి పక్కకు కూడా వెళ్లను: పాక్‌ దిగ్గజం

Zaheer Abbas says Virat Kohli Great But Watching Rohit Sharma Makes Me Happy

కరాచి: 'హిట్‌మ్యాన్‌' టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై పాక్‌ దిగ్గజం జహీర్‌ అబ్బాస్‌ ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే టీవీ వదిలి పక్కకు కూడా వెళ్లను అని అబ్బాస్‌ అన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తక్కువేం కాదని, కోహ్లీ అంటే కోహ్లీనే అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో టీమిండియా ప్రదర్శనపై స్పందించిన అబ్బాస్‌ కోహ్లీ, రోహిత్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీవీ వదిలి పక్కకు వెళ్లను

టీవీ వదిలి పక్కకు వెళ్లను

తాజాగా జహీర్‌ అబ్బాస్‌ మాట్లాడుతూ... 'రోహిత్ మ్యాచ్ ఆడుతుంటే.. నేను టీవీ వదిలి పక్కకు కూడా వెళ్లను. ఒక్క బంతిని కూడా మిస్ కాను. అతని బ్యాటింగ్‌ నాకు అంతలా నచ్చింది మరి. హిట్‌మ్యాన్‌ ఆడటం చూస్తుంటే ఆనందం కలుగుతుంది. రోహిత్‌ షాట్‌ ఎంపిక చేసుకొని ఆడటాన్ని ఇష్టపడుతా. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే భారీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతాడు. రోహిత్ అద్భుత ఆటగాడు' అని అన్నారు.

కోహ్లీ తక్కువేం కాదు

కోహ్లీ తక్కువేం కాదు

'మ్యాచ్ చూస్తుంటే మా ఇంట్లోవాళ్లు రోహిత్ గురించేనా.. కోహ్లీ ఆటను ఏమంటావని అడుగుతారు. కోహ్లీ తక్కువేం కాదని, కోహ్లీ అంటే కోహ్లీనే అని చెబుతా. రోహిత్, కోహ్లీ ఇద్దరు బాగా ఆడతారు. ఇద్దరు బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తుంటారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ చేస్తారు. వాళ్లిద్దరి బ్యాటింగ్‌ చూస్తుంటే మైమరచిపోతాను' అని అబ్బాస్‌ పేర్కొన్నారు.

ఆటమీద ధ్యాసపెడితే చాలు

ఆటమీద ధ్యాసపెడితే చాలు

టీమిండియా, బీసీసీఐ రెవెన్యూపై కూడా అబ్బాస్‌ స్పందించారు. 'భారత్‌లో ఆడే ఆటగాళ్లకు డబ్బుతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆటమీద ధ్యాసపెడితే చాలు. ఇక ప్రొఫెషనల్‌ ఆటగాళ్లుగా ఆడితే వారికొచ్చే రివార్డులు కూడా భారీగానే ఉంటాయి. బీసీసీఐ తమ ఆటగాళ్లకి సంపూర్ణ ఆర్థిక భద్రత కల్పించింది' అని అబ్బాస్‌ చెప్పుకొచ్చారు.

అరుదైన రికార్డులకు చేరువలో రోహిత్, కోహ్లీ

అరుదైన రికార్డులకు చేరువలో రోహిత్, కోహ్లీ

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందురోహిత్‌-కోహ్లీ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నారు. రోహిత్‌.. పాంటింగ్‌ రికార్డుపై కన్నేస్తే, కోహ్లీ.. సచిన్‌ రికార్డుపై కన్నేశాడు. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా.. పాంటింగ్‌ రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో రోహిత్‌ ఉన్నాడు. మరోవైపు ఇరు జట్ల మధ్య అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ తొలి స్థానంలో నిలవగా.. కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, January 14, 2020, 9:45 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X