న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీ పర్యటనలో చాహల్ ఖాతాలో ఓ చెత్త రికార్డు

By Nageshwara Rao
Yuzvendra Chahal creates this unplesant record during 2nd South Africa vs India T20

హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో నాలుగు ఓవర్లు వేసి అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్ల జాబితాలో చాహల్ అగ్రస్థానంలో నిలిచాడు.

సెంచూరియన్‌లో హాఫ్ సెంచరీతో ధోని సాధించిన రికార్డులివేసెంచూరియన్‌లో హాఫ్ సెంచరీతో ధోని సాధించిన రికార్డులివే

బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో చాహల్ నాలుగు ఓవర్లు వేసి 64 పరుగులిచ్చాడు. దీని అర్ధం ఏంటంటే ఓవర్‌కి 16 పరుగులిచ్చాడు. టీ20ల్లో ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా నాలుగు ఓవర్లలో ఇన్ని పరుగులు ఇవ్వకపోవడం విశేషం.

2007లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోగీందర్‌ శర్మ ఇచ్చిన 57 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. ఆ తర్వాత యూసుఫ్‌ పఠాన్‌ (54 పరుగులు, 2009లో శ్రీలంకపై), మహమ్మద్‌ సిరాజ్‌ (53, 2017లో న్యూజిలాండ్‌పై)లు 4 ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాళ్లు.

తాజాగా ఈ జాబితాలో 64 పరుగులతో చాహల్ అగ్రస్థానంలో నిలిచాడు. సఫారీ పర్యటనలో భాగంగా జరిగిన ఆరు వన్డేల సిరిస్‌లో చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌ బౌలింగ్‌లో పరుగులు తీయడానికే ఇబ్బంది పడిన సఫారీ బ్యాట్స్‌మెన్లు రెండో టీ20లో మాత్రం చాహల్‌ను ఊచకోత కోశారు.

లంకలో ముక్కోణపు సిరిస్: కోహ్లీతో పాటు బుమ్రా, భువీలకు విశ్రాంతి!లంకలో ముక్కోణపు సిరిస్: కోహ్లీతో పాటు బుమ్రా, భువీలకు విశ్రాంతి!

తొలి టీ20లో చాహల్‌ నాలుగు ఓవర్లలో 39 పరుగులిచ్చి ఒక వికెట్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రెండో టీ20లో వికెట్ తీసుకోపోగా పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 శనివారం కేప్ టౌన్ వేదికగా జరగనుంది. ఈ సిరిస్‌లో ఇరు జట్ల చెర్ మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. మూడో టీ20లో ఏ జట్టు అయితే గెలుస్తోందో ఆ జట్టే సిరిస్‌ను సొంతం చేసుకుంటుంది.

Story first published: Thursday, February 22, 2018, 19:22 [IST]
Other articles published on Feb 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X