క్రీడాస్ఫూర్తి: రిషబ్ పంత్‌కు సాయం, యువీపై నెటిజన్ల ప్రశంసలు

Posted By:

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ కోట్లాది మంది క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు. క్రికెట్‌లో సీనియర్, జూనియర్ అనే బేధం లేదని యువరాజ్ మరోసారి చాటి చెప్పాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌లో యువీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులతో సన్‌రైజర్స్‌పై గెలిచింది.

19 ఏళ్ల రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షూ లేస్ ఊడిపోయింది. అతడికి సమీపంలో ఉన్న యువీ షూ లేస్ కట్టాడు. దీనికి సంబంధించిన ఇమేజిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. "Senior? says who? Glad to help you mate! - @YUVSTRONG12 #SpiritofCricket #DDvSRH" అని ట్వీట్ చేసింది.

యువరాజ్‌ క్రీడా స్ఫూర్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. యువరాజ్‌ని ఫ్యాన్స్ ఇష్టపడటానికి ఇదొక కారణం అంటూ ఓ అభిమాని ఈ ట్వీట్‌పై కామెంట్ చేశాడు. మరొక అభిమాని యువరాజ్ లెజెండ్ అంటూ కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ 20 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 34 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అభిమానుల మనసు దోచుకున్న యువరాజ్:

ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపించాడు. యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 70 నాటౌట్;11 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో రాణించాడు. తొలుత కుదురుగా బ్యాటింగ్ చేసిన యువీ.. చివరి ఓవర్లలో ఫోర్లతో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు.

Story first published: Wednesday, May 3, 2017, 17:33 [IST]
Other articles published on May 3, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి