న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సలహా ఇచ్చినందుకు.. కోచ్ గొంతుపై కత్తిపెట్టిన పాకిస్తాన్ క్రికెటర్!!

Younis Khan Held A Knife To My Throat For Offering Batting Advice, Reveals Grant Flower
సలహా ఇచ్చినందుకు బ్యాటింగ్ కోచ్‌ గొంతుపై కత్తి పెట్టిన క్రికెటర్ !! || Oneindia Telugu

హరారే: పాకిస్థాన్ క్రికెటర్ల తీరే అందరిలోకెల్ల పూర్తి బిన్నంగా ఉంటుంది. స్పాట్ ఫిక్సింగ్, వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇక జట్టు కోచ్‌లతో గొడవపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గత ఏడాది ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలైన కమ్రాన్ అక్మల్ ఆవేశంలో ఫిట్‌నెస్ ట్రైనర్‌‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే పాక్ దిగ్గజ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ కూడా గతంలో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ గొంతుపై కత్తిపెట్టి బెదిరించిన ఓ సంఘటన ఉందని తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని గ్రాంట్ ఫ్లవర్ స్వయంగా తెలిపారు.

నొవాక్‌ జొకోవిచ్‌కు కరోనా నెగటివ్!!నొవాక్‌ జొకోవిచ్‌కు కరోనా నెగటివ్!!

బ్యాటింగ్ కోచ్‌గా గ్రాంట్ ఫ్లవర్:

బ్యాటింగ్ కోచ్‌గా గ్రాంట్ ఫ్లవర్:

జింబాంబ్వే మాజీ క్రికెటర్ అయిన గ్రాంట్ ఫ్లవర్ పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా 2014 నుంచి 2019 వరకూ పనిచేశాడు. అదే సమయంల్లో చీఫ్ కోచ్‌గా మిక్కీ ఆర్థర్ ఉన్నారు. అయితే ఈ ఐదేళ్లలో ఓసారి పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళింది. ఓ రోజు ఉదయం పాక్ జట్టు మొత్తం బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా.. యూనిస్ ఖాన్ పక్కన కూర్చున్న గ్రాంట్ ఫ్లవర్ బ్యాటింగ్‌కి సంబంధించి ఒక చిన్న సలహా ఇచ్చాడట. దాంతో ఒక్కసారిగా ఊగిపోయిన యూనిస్.. టేబుల్‌పై ఉన్న కత్తిని తీసుకుని గ్రాంట్ ఫ్లవర్ గొంతుపై పెట్టాడట. ఆ పక్కనే ఉన్న చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ కలగచేసుకోవడంతో యూనిస్ వెనక్కి తగ్గాడట.

యూనిస్‌ ఖాన్‌ని హ్యాండిల్ చేయడం కష్టం:

యూనిస్‌ ఖాన్‌ని హ్యాండిల్ చేయడం కష్టం:

ఫాలోయింగ్ ఆన్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో గ్రాంట్ ఫ్లవర్ మాట్లాడుతూ.. యునిస్ ఖాన్ తన బ్యాటింగ్ చిట్కాలతో ఎంతగానో విభేదించిన సంఘటనను వివరించారు. 'పాకిస్తాన్ జట్టుతో నాకు అది అద్భుతమైన కెరీర్. అయితే యూనిస్‌ ఖాన్‌ని హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కష్టం. బ్రిస్బేన్‌లో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది, ఎప్పటికీ మర్చిపోలేను కూడా. బ్రిస్బేన్ టెస్ట్ సమయంలో.. మ్యాచ్‌కి ముందు ఓరోజు ఉదయం అందరం బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. యూనిస్ ఖాన్ నా పక్కనే కూర్చున్నాడు' అని ఫ్లవర్ తెలిపారు.

గొంతుపై కత్తి పెట్టాడు:

గొంతుపై కత్తి పెట్టాడు:

'బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా.. యూనిస్ ఖాన్‌కు బ్యాటింగ్‌పై ఓ చిన్న సలహా ఇచ్చా. కోపంతో ఒక్కసారిగా ఊగిపోయిన అతడు.. టేబుల్‌పై ఉన్న కత్తిని తీసుకుని నా గొంతుపై పెట్టాడు. నాకు బయమేసింది. ఆ పక్కనే ఉన్న చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ షాక్‌కు గురయ్యాడు. ఆ వెంటనే ఆర్థర్ అడ్డుపడటంతో ఆరోజు బతికి బయటపడ్డా. సలహా ఇవ్వడం కోచింగ్‌లో భాగం. కానీ యూనిస్ తీసుకోలేదు' అని గ్రాంట్ ఫ్లవర్ చెప్పారు. ప్రస్తుతం శ్రీలంక జట్టుకి బ్యాటింగ్‌ కోచ్‌గా గ్రాంట్ ఫ్లవర్ ఉండగా.. పాకిస్థాన్ జట్టుకి యూనిస్ ఖాన్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

అహ్మద్ షెహజాద్ మంచి బ్యాట్స్‌మన్‌:

అహ్మద్ షెహజాద్ మంచి బ్యాట్స్‌మన్‌:

'నా ప్రయాణంలో అదొక మరుపురాని ఘటన. నేను ఇంకా చాలా నేర్చుకోవలసి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న కెరీర్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా' అని మాజీ కోచ్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ జట్టులో అహ్మద్ షెహజాద్ ఆసక్తికరమైన వ్యక్తి అని, అతనికి మంచి నైపుణ్యం ఉందన్నారు. అయితే అతగాడు ఓ రెబెల్ అని పేర్కొన్నారు. జింబాంబ్వే తరఫున ఫ్లవర్ 67 టెస్టులు, 221 వన్డేలు ఆడారు. మొత్తంగా 12 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు బాదారు.

Story first published: Thursday, July 2, 2020, 19:20 [IST]
Other articles published on Jul 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X